…
నమస్సులు,
ఈ బ్లాగుకు ప్రసాదం అని పేరు పెట్టడానికి మూడు కారణాలు వున్నాయి.
మొదటిది నా పేరు. నా పేరు M.Prasad ప్రాస కోసం ముందున్న Mను చివరికి తోసేసి Prasad Mగా మార్చి తెలుగు లో ప్రసాదం అని ధ్వనించేలా బ్లాగ్ కు నామకరణం చేసాను. మరందుకే, నేములో నేమున్నది కదా!
ఇక రెండవది, ప్రసాదం అన్న పదానికి గల పవిత్రత. ప్రసాదం అంటే “స్వచ్చమైన మనసుతో అందించేది” కనుక సాధ్యమైనంత స్వచ్చంగా రాయడానికి ప్రయత్నిస్తాను. ప్రసాదం లో ప్రచురించడానికి రాస్తున్నాను కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని రాయలోయ్ అని నాకు నేను గుర్తు చేసుకోవడానికి అన్నమాట.
మూడోవదీ, ముఖ్యమైన కారణం ఏమంటే, ప్రసాదం ఎప్పుడూ కొద్ది కొద్దిగానే పెడతారు కదా, నేనూ అంతే, నాకు రాయలన్న భావావేశం వచ్చినప్పుడు రాసి ప్రచురిస్తాను తప్ప, తరచుగా రాయలేను. అందుకని ఈ బ్లాగు లో తరచుగా టపాలు కనిపించవు.
ఇదండీ, ఈ బ్లాగు నామకరణం వెనుక కథ. ఇంతకీ సరైన పేరే పెట్టానంటారా?
-ప్రసాదం
బహుబాగున్నదండీ!
మీ ప్రసాదం బాగున్నదండి. రోజూ కొంచెం తీసుకుంటాను. ఈ క్షణం నుంచి మీ అభిమానినయిపోయాను. వీలయితే మా గుమ్మంలోకి కూడా ఒకసారి దయచేయండి. http://saradaa.blogspot.com
సహజం గానే ప్రసాదం గా తీసుకునే ఏ పదార్దం అయినా బహు రుచి గా ఉంటుంది అని నా భావన !! నాకు మీ ప్రసాదం రోజు తినాలనిపిస్తుంది …
ప్రసాద్ గారు మీ హస్యపు చురకలు దేవుని ప్రసాదం లాగే పంచాలి మన వాళ్ల్లకి
మీ బాలాజీ