
జ్ఞాపకాలు వర్షించిన రాత్రి
నవంబరు 30, 2006…
ఎందువల్లో నీరవం నన్ను ఆక్రమించుకొంటుంటే, నెచ్చెలి జ్ఞాపకాలు నిలువరించే వేళ,
కాలం తోడు తెచ్చుకొని, కలం చేతబట్టుకొని, మీతో గడపటానికి నేను వేసిన అడుగుల ప్రయత్నం ఈ…
జ్ఞాపకాలు వర్షించిన రాత్రి
గతం తాలూకూ ఒక్కొక్క తెర తొలగుతూ ఉంటే, గుండెలను తాకే గులాబీల సుగంధం నీ ఎన్ని జ్ఞాపకాలు తెస్తుందని!
మదిలో దాగిన,
మగువ నీవని,
మనసు నీదని-
నీవు వలచేలా,
నీకు తెలిసేలా
ఎలా చెప్పను?
కళ్ళతోనే నిను పలకరించీ,
కళ్ళ ముందు నిను స్మరించీ,
కనుల మాటున కలవరించీ,
కనులనన్నీ నిలువరించీ,
కలల లోనా నిను వరించీ-
ఓ వెన్నెల కురిసే రాత్రి, సముద్రపు ఇసుక తిన్నెలపై కూర్చుని
చిరుగాలి సవ్వడికి అల్లరి చేసే నీ ముంగురులు సరిదిద్దాలని,
సిగ్గుతో బరువెక్కిన నీ కనురెప్పలు పైకెత్తాలని ప్రయత్నిస్తుండగా,
ఆ సిగ్గే పులుముకొని ఎరుపెక్కిన నీ చెక్కిళ్ళు చూస్తూ-
నన్ను నేను మైమరిచే క్షణాన….
సవ్వడి చేయకుండా నీ పాదాలను ముద్దు పెట్టుకొని పారిపోయే అలను చూసి అసూయ పడి,
నీ జ్ఞాపకాల అలల వెంట పరిగెత్తడం తప్ప ఏం చెయ్యను?
కలవరం రేపిన కళ్ళకు,
కళ్ళ వెనకాల అనుభూతికి,
అనుభూతి తెచ్చిన స్వప్నాలకు,
స్వప్నాలు కురిసిన రాత్రులకు…
ఇదంతా -
ప్రసాదం యొక్క టపా
ప్రసాదం యొక్క టపా