…
వయసు పిలిచిందో, వలపు చిలికిందో తెలీదు కానీ,
ఒక మనసు పలికింది.
మానసి గా నిలిచింది,
నా మదినీ గెలిచింది.
గురుతుగా మిగిలింది,
గురుతుగా-
ముద్దిచ్చిందీ, ఓ చామంతి!
ఆ గురుతు తాలూకూ జ్ఞాపకాల దొంతర ను పదాలతో పరిస్తే, ఇలా……
కలవరం రేపిన కళ్ళకు,
కళ్ళ వెనకాల అనుభూతికీ,
అనుభూతి నిండిన స్వప్నాలకీ,
స్వప్నాలు కురిసిన రాత్రులకు,
రాత్రులు విరిసిన వెన్నెలకు,
వెన్నెల పంచిన భావాలకు,
భావాలు పలికిన పదాలకు,
పదాలు పలికిన పెదాలకు,
పెదాలు వణికిన క్షణాలకు,
..
హౄదయ లయకు,
మనసు ప్రియకు,
అంకితం;
నేను
ప్రసాదం యొక్క టపా