నవ్వడం ఒక యోగం, అందుకని మరిన్ని నవ్వులు.

… 

ఏకాంతమేనా?

“నా భార్య చనిపోయిన తర్వాత నాకు మిగిలింది ఏ కాంతమే”

“ఆయ్యో పాపం, ఒక్కడివీ ఎలా ఉంటున్నవురా?”

“ఓక్కణ్ణే ఉంటున్నానని ఎవరన్నారు? ఏ. కాంతం అని మనం కాలేజీ లో చదివేప్పుడు వెంట పడే వాళ్ళం గుర్తుందా… ఆమెతో కలసి ఉంటున్నా”     

లేచిపోదామా?

“రాణీ, ఇక లాభం లేదు. ఈ రోజు రాత్రి సరిగ్గా రెండు గంటలకు మనం ఈ ఊరు విడిచి పారిపోవాలి.” అడిగాడు ఆ కాబోయే అభాగ్యుడు.

“సరే రాజు! అలాగే చేద్దాం”

“ఖచ్చితంగా ఆ టైముకు రడీ గా ఉండు. నేను రాగానే పారిపోదాం…”

“నువ్వేమీ బెంగ పెట్టుకోకు రాజు, మా నాన్న నిన్ననే నా లగేజీ పాక్ చేసి పెట్టాడు.  ”

గుత్తొంకాయ విలువ

కొత్తగా కాపురం పెట్టిన గోపాలం భార్యతో అన్నాడు. “నువ్వు మీ అమ్మ ద్వారా తెలుసుకొని చేసిన గుత్తొంకాయ కూర విలువ 435 రూపాయలు”

“ఆంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు”?

“ఇదిగో STD బిల్లు”
 

దొంగా, దొంగా

మన పెళ్ళి రోజుకు టివి కావాలని అడిగావు కదా! పక్క షాపులో దొంగిలించి తెచ్చాను తీసుకో” అన్నాడు దొంగ.

“ఏడ్చినట్టే ఉంది, ఆ షాపులో టివి కొంటే ప్యాన్ ఉచితం అని రాశారు కదా! మరి ప్యాను వదిలేసి వచ్చరేం? ..” అన్నది దొంగది.

కోరికలు

“నేను కూడా మా నాన్న లాగే డాక్టర్ కావాలని కోరుకుంటున్నాను” అంది బుడిగి.

“అదేంటి, మీ నాన్న ఏదో ఆఫీసులో క్లర్కు అని గుర్తు….”

“నేను చెప్పేదీ అదే, .. మా నాన్న కూడా అలాగే కోరుకున్నారు”

4 స్పందనలు to “నవ్వడం ఒక యోగం, అందుకని మరిన్ని నవ్వులు.”

  1. radhika అన్నారు:

    guttomkaaya kuura joku baagundi.paapam maa vaariki ilaniti anubhavalu calane vunnayi naa valla

  2. రానారె అన్నారు:

    బుడిగి కోరిక అదిరిపోయింది.

  3. Manasa అన్నారు:

    Chaala Bagunnayi…. NAVVULU

  4. sirishasri అన్నారు:

    nice jokes,
    chaduvarula yokkavira jaajula navvulaku!

ప్రత్యుత్తరమిమ్ము