…
మా అంజి గాడు ఈ మధ్య ఒక చిక్కు లెక్క తెచ్చి నాకు తగిలించాడు. కాస్త జుట్టు పీక్కొని, (ఉన్నదే కాస్త లెండి) చిక్కుముడులన్నీ విప్పేను. ఆ ముళ్ళేవో మీరూ చూస్తారని ఇదిగో ఇక్కడ వేస్తున్నా. మరి కాచుకోండి.
16 – 36 = 25 – 45 అన్నది నిజమే కదా,
రెండు పక్కలా (9/2)2 కలపండి.
16 – 36 + (9/2)2 = 25 – 45 + (9/2)2
దీన్నే ఇలా రాసుకుందాం.
(4)2 - 2 x 4 x (9/2) + (9/2)2 = (5)2 – 2 x 5 x (9/2) + (9/2)2
ఇది (a2 – 2ab – b2 ) రూపం లో ఉంది కద, దాన్ని, (a-b)2 అని రాయ వచ్చు కదా, అందుకని
(4 - (9/2))2 = (5 - (9/2)2
రెండు పక్కలా వర్గమూలం (square root) చేయండి.
4 - (9/2) = 5 - (9/2) రెండు పక్కలా (9/2) తొలగించండి. 4 = 5 ఏవంటారు మరి. ఏక్కడో తప్పుందంటారా. చెప్పండి మరి.…
ప్రసాదం యొక్క టపా