వెన్నెల్లొ గోదారి

… 

చాల కొద్ది రోజుల క్రితం ఎక్కడొ చదివాను. ప్రపంచంలో కెల్లా దురదృష్టవంతుదెవరంటే, ఒంటరిగా ఉన్నప్పుడు పది మంది లోనూ, పదిమందిలో ఉన్నప్పుడు ఒంటరిగా ఉండాలనుకునే వాడు అట.

అయితే, అలనాటి జ్ఞాపకాలు గుభాళిస్తుంటే, ఆ గుభాళింపులన్నీ గులాబీల గుత్తులై గుండెల్లో  పరిమళించే వేళ, ఒంటరితనం ఎంత అందమైందో తెలెసేదెందరికని?

అణువణువూ తడిసిన జీవిత రహదారి.
అన్నిటికీ తోడు వెన్నెల్లో గోదారి.

చిన్నప్పుడు, తల చుట్టూ మఫ్లర్ చుట్టుకొని, దూరంగా పొగ మంచులో కమ్ముకు పోయిన ఆలయం నుండి వచ్చే సుప్రభాతం వింటూ, మోకాళ్ళ పై కూర్చోని అమ్మ వేసే ముగ్గు ను గమనిస్తుంటే , లేత చలి వణికించే ఆనందం, ఎంత బావుంటుందని.

సూర్యోదయానికి ముందే, పాలు తేవడానికి నడుస్తూ ఉంటే, కొంచం దూరంలో మసక వెన్నెల్లో కుప్పలా శివాలయం. అల్లంత దూరాన సూరీడు వస్తున్న గుర్తుగా ఎరుపు రంగు పులుముకున్న క్షితిజ రేఖ. రాత్రంతా మంచులో తడిసిన నందివర్ధనం చెట్టు కొమ్మల్లో  బృందగాణం ఆలపిస్తున్న  భరద్వాజ పక్షులు.

ఎవరన్నారు జీవితం లో ఆనందం లేదని?
అనుభవించగలిగితే, బతుకంతా అనుభూతి కాదా?

సంధె వేళ, టప్ మని  శబ్దం చేస్తూ పడిన వర్షపు చుక్క.
– హఠాత్తుగా మనసు నిండా ఎవరిదో జ్ఞాపకం.

వర్షం రాబోతున్నట్టుగా ఉంది. గబ గబా లైట్లన్నీ ఆపేసి సౌండ్ సిస్టం సెట్ చేసి, చేతికందిన సిడి లోపలికి తోసి, కిటికీ దగ్గర నిలబడగానే హొరున వర్షం. గుండెల నిండా మట్టి తడిసిన వాసన. స్ట్రీట్ లైట్ వెలుగులో పారుతున్న వర్షపు కాలువలను చూస్తుంటే, గదిలో జగ్జీత్ సింగ్ గొంతు విప్పాడు.

యేహ్ దౌలత్ భీ లేలో-
యేహ్ షహరత్ భీ లేలో,
ఆవుర్ చీన్ లో ముఝ్ సే మెరే జవానీ,
మగర్ ముఝ్ కో లౌటాదో బచ్పన్ కా సావన్,
ఓహ్ కాగజ్ కీ కస్తీ, ఓహ్ బారిష్ కా పానీ,
 
      
నా యవ్వనం, సంపద, గౌరవ మర్యాదలు అన్నీ ఇస్తాను-
ఓ దేవ దేవా,
నా కాగితం పడవల బాల్యం, వర్షపు నీటి ఆటల వయసు –
ఇవ్వగలవా?

హఠాత్తుగా ఫోన్ మ్రోగింది. కొద్దిగా వెనక్కు వాలి అందుకున్నాను. వెన్నెల్లో గోదారి ప్రవహించడం మొదలైంది, రెండు మనసుల మధ్య –

ప్రకటనలు

5 Responses to వెన్నెల్లొ గోదారి

 1. చదువరి అంటున్నారు:

  ఎంతో బావుంది మీ జాబు.. గాఢమైన భావుకతతో.

  మెచ్చుకోండి

 2. cbrao అంటున్నారు:

  పరవశించి బ్లాగండి. మీ బ్లాగులో variety ఉంది. వెన్నెల చల్లదనం, ముద్దులోని వెచ్చదనం ఉన్నాయి.మీకు స్వాగతం చెప్తున్నాం.

  మెచ్చుకోండి

 3. రామ్ అంటున్నారు:

  చాలా బాగుంది మీ కవిత,

  మెచ్చుకోండి

 4. శ్రీనివాస రాజు ఇందుకూరి అంటున్నారు:

  అవును ఇటువంటివి చదివినపుడు కూడా

  మదిలో రేగే తీపి జ్ఞాపకాలు కూడా ఆనందమే కదా..

  బాగుంది.. మూ వర్ణన

  శ్రీనివాస్.

  http://www.nivasindukuri.blogspot.com

  మెచ్చుకోండి

 5. charasala అంటున్నారు:

  అనుభవించి మీరు రాస్తే
  చదివి నేను అనుభవించాను.
  అందమైన మీ భావం
  మదిలో నింపింది పరవశం.
  –ప్రసాద్
  http://blog.charasala.com

  మెచ్చుకోండి

మీరేమంటారు ...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: