శంకరాభరణం

సంగీతం లో ఎలాంటి అనుభవం గానీ అర్హతలు గానీ లేని నా లాంటి అర్భకుడు ఈ చిత్రం గురించి చర్చించబోవడం సాహసమే అయినపటికినిన్నీ, ఆరు నెలల విశ్వ ప్రయత్నం తర్వాత కేవలం ఒకే ఒక థియేటర్ లో ప్రేక్షకులు ఎవరూ లేకుండ విడుదలై, విడుదలైన పాతికేళ్ళ తర్వాత కూడ అనేకుల ఆధరాభిమానాలను నోచుకున్న ఈ చిత్రం గొప్పతనం గూర్చి చెప్పడానికి నాదైన పద్దతిలో ప్రయత్నిస్తాను. ఇప్పటికి ఏ వంద సార్లో చూసినప్పటికినిన్నీ, మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే అద్భుత చిత్రమిది.
ఈ చిత్రం లోని దర్శకత్వ ప్రతిభకు తార్కాణం లాంటి కొన్ని విశేషాలు మీ ముందు ఉంచాలన్న ప్రయత్నం ఇది.

శంకరాభరణం శాస్త్రీయ సంగీతంలో ఒక రాగం పేరు. ఈ చిత్రం లో ఈ రాగం ఎంతగానో వాడ బడింది.  అలాగే శంకరుడికి ఆభరణం అయిన సర్పాన్నీ శంకరాభరణం అంటారు. సర్పాలు ఎన్నున్నా అన్నీ శంకరాభరణాలు కానట్టే, వేశ్య పుత్రులందరూ పండితులూ అవలేరు. చిత్రం కథా నాయకుడి పేరు కూడా శంకరశాస్త్రి. (శంకరుడి వ్యక్తిత్వాన్ని శాస్త్రీకరించినవాడు) పైగా శంకరుడిలా గరళ కంఠుడు. గరళం లాంటి అవమానాలను గొంతులో దాచుకొని మధుర స్వరాల్ని పలికించేవాడు. ఇలాంటి ఒక శంకరుడికి తన దగ్గర గల విష ఫలాన్నే సమర్పించాడానికి చేసిన ప్రయత్నమే ఈ చిత్ర కథ.

ఇక ఈ (అ)సామాన్య కథ కి ఎంచుకున్న కథనం చాల విభిన్నమైంది.  ఇది ఎంత అధ్భుతంగా ఉందంటే, మనందరికీ కథ తెలుసు కానీ అచ్చంగా సినిమాలో ఏ సీక్వెన్సుల్లో కథ చెప్పారో మీరు చెప్పగలరా? ఒకసారి ప్రయత్నించిన తర్వాత మళ్ళీ సినిమా చూస్తే మీకే తెలుస్తుంది. కథ లో మిళితమైన హస్యం మనల్ని గిలిగింతలు పెడుతుంది.

కథనంలో గొప్పతనం ఏమిటంటె, కథనాయకుడి గొప్పదన్నాన్ని వివిధ సంఘటనల ద్వారా బలోపేతం చేయడం.(ఇదే పద్దతి మణిరత్నం చిత్రాల్లో కూడ కనిపిస్తుంది. ముఖ్యంగా నాయకుడు చిత్రం లో. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన గాడ్ ఫాదర్ లోనూ ఇంతే) ఉదాహరణకు, చిత్రం మొదట్లో మంజు భార్గవి పాత్ర శంకరశాస్త్రి ఇంట్లోకి ప్రవేశిస్తున్నప్పుడు, నేపథ్య సంగీతంగా స రి గ మ ప ద ని స లు వినబడతాయి. ఆ తర్వాత, మంజు భార్గవి తన కుమారుడిని శంకరశాస్త్రి ఇంట్లోకి ప్రవేశ పెట్టె క్రమంలో వచ్చే డైలాగు ఇలా అంటుండి. “ఆ ఇంట్లో అడుగడుగునా స రి గ మ ప ద ని స లు వినిపిస్తాయి”. ఆంతకు ముందే ప్రేక్షకులు మంజు బార్గవి సన్నివేశాన్ని చూసి ఉండడం వలన ప్రేక్షకులు కూడ “అవును నిజమే కదా” అన్న భావనకు లోనవుతారు. ఈ క్రమం దాదాపు అన్ని సన్నివేశాల్లోనూ కనిపిస్తుంది. ఇలాంటి కథనం వల్ల శంకర శాస్త్రి పాత్ర ఔన్నత్యాన్ని సంతరించుకుంది. చిత్ర విజయానికి దోహదం చేసిన అంశాల్లో ఇదీ ముఖ్యమైనది. ఈ విధమైన కథనం ప్రతిభ విజయవంతమైన అన్ని చిత్రాల్లోనూ కనిపిస్తుంది.
దొరకునా ఇటువంటి సోధి… అనుకోకుండ విజ్ఞులు నా పరిశీలనను సరి చేసే వారందరికీ మరియు మీకూ

ఎందరో మహానుభావులు, ఆందరికీ వందనములు…

మరిన్ని ఆంశాల గూర్చి మరోసారి.

5 Responses to శంకరాభరణం

  1. నేను ఈ చిత్రానికి ఒక fan అని చెప్పడం కన్నా, ఒక భక్తుడిని అని చెప్తే correctగా ఉంటుందేమో…

    ఈ సినిమా పాటలు ఎన్ని సార్లు విన్నా, మల్లీ మల్లీ వినాలి అనిపిస్తూ ఉంటుంది… అదే ఈ సినిమాలో ఉన్న శక్తి…

    ఇందులో ఈ “దొరకునా ఇటువంటి సేవ…” పాట startingలో కొన్ని dialogues ఉంటాయి… అవి ఎప్పుడూ నా స్ఫురణకి వస్తూ ఉంటాయి…

    పాశ్చాత్య సంగీతపు పెను తుఫానుకి రెపరెపలాడుతున్న సత్సాంప్రదాయ సంగీత జ్యొతిని ఒక కాపు కాయడనికి తన చేతులు అడ్డు పెట్టిన ఆ దాత ఎవరో… వారికి శతసహస్ర వందనాలు అర్పిస్తున్నాను…
    సుష్కించిపోతున్న భారతీయ సంస్కృతినీ సాంప్రదాయాన్నీ పునరుద్ధరించదానికి నడుం కట్టిన ఆ మహా మనీషికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను…
    ఈ కళ జీవ కళ… అజరామరమైనది… దీనికి అంతం లేదు…
    నిరాదరణ పొందుతున్న ఈ సంగీతాన్ని పోషించడానికి కోటికి ఒక్క వ్యక్తి ఉన్నా సరే ఈ అమ్రుతవాహిని అనంతంగా ఇలా ప్రవహిస్తూనే ఉంటుంది…మనిషి నిలువెత్తు ధనం సంపాదించినప్పటికీ
    దొరకునా? దొరకునా?
    దొరకునా ఇటువంటి సేవా….

    మెచ్చుకోండి

  2. నేను ఈ చిత్రానికి ఒక fan అని చెప్పడం కన్నా ఒక భక్తుడిని అని చెప్పడం సమంజసమేమో….

    ఈ చిత్రం లోని ప్రతీ dialogue ఎప్పుడూ నా మన:స్ఫురణలోనే ఉంటాయి…

    నన్ను ముఖ్యంగా influence చెసినవి ఈ కింది dialogues

    పాశ్చాత్య సంగీతపు పెను తుఫానుకి రెపరెపలాడుతున్న సత్సాంప్రదాయ సంగీత జ్యొతిని ఒక కాపు కాయడనికి తన చేతులు అడ్డు పెట్టిన ఆ దాత ఎవరో… వారికి శతసహస్ర వందనాలు అర్పిస్తున్నాను…
    సుష్కించిపోతున్న భారతీయ సంస్కృతినీ సాంప్రదాయాన్నీ పునరుద్ధరించదానికి నడుం కట్టిన ఆ మహా మనీషికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను…
    ఈ కళ జీవ కళ… అజరామరమైనది… దీనికి అంతం లేదు…
    నిరాదరణ పొందుతున్న ఈ సంగీతాన్ని పోషించడానికి కోటికి ఒక్క వ్యక్తి ఉన్నా సరే ఈ అమ్రుతవాహిని అనంతంగా ఇలా ప్రవహిస్తూనే ఉంటుంది…మనిషి నిలువెత్తు ధనం సంపాదించినప్పటికీ
    దొరకునా? దొరకునా?
    దొరకునా ఇటువంటి సేవా….

    మెచ్చుకోండి

  3. radhika అంటున్నారు:

    chala manchi movie jnaptiki techaaru.star lu evvaru lekunnaa kadhaa balam vumtea aa movie hit avutumdi anadaniki idoka mamci udaaharana

    మెచ్చుకోండి

  4. ravichandrareddy అంటున్నారు:

    naaku anthagaa aa cienma gurthu ledu kaanee… mee pariseelana ..inkaa mee vivarana naaku chala baga nachayi ..

    మెచ్చుకోండి

  5. Ramu అంటున్నారు:

    EVERGREEN MOVIE

    మెచ్చుకోండి

మీరేమంటారు ...