బ్రహ్మచారులు – సంసారులు

పుస్తకాల షాపులో కామసూత్ర లాంటి పుస్తకాలు తిరగేసి, నిట్టుర్చి, చివరికి “Tell me Why?” పుస్తకాలు కొనేవాళ్ళు సంసారులు. కామసూత్ర కొనేవాళ్ళు బ్రహ్మచారులు.

హార్డువేర్ షాపుల్లో కనబడే వాళ్ళంతా సంసారులే. బ్రహ్మచారులకు రిపేరు చేసేదేమీ ఉండదు. మహ అయితే ఒక జిగురు సీసా అవసరం. అది పుస్తకాల షాపులో దొరుకుతుంది.

మ్యూజిక్ షాపు ముందు బయట అద్దాల నుండి ఆశగా చూసే వాళ్ళు సంసారులు. బ్రహ్మచారులు నేరుగా వెళ్ళి కొనేస్తారు.

హొటల్లో తప్పదన్నట్టు అసహనంగా భోజనం చేసే వాళ్ళు బ్రహ్మచారులు. “జీవితంలో మళ్ళీ ఈ ఛాన్సు ఎప్పటికో అన్నట్టు భోజనం చేసే వాళ్ళు సంసారులు.

పార్టీ లో అర్ధరాత్రికి ముందే వాచీ చూసుకుంటూ, తిట్టూకుంటూ వెళ్ళిపొయెవాళ్ళు సంసారులు. “ఇక దయ చేస్తారా “అని పార్టీ ఇచ్చిన వాళ్ళు అనే వరకూ ఉండే వాళ్ళు బ్రహ్మచారులు.

కారు సీట్లో ఏ డెబోనేర్ లాంటి పత్రిక ఉంటే, ఆ కారు బ్రహ్మచారులది అని అర్థం.సంసారుల కార్లో చితికిపోయిన ఆలూ చిప్స్ లాంటివి ఉంటాయి.

నున్నటి గడ్డానికి ఆఫ్టర్ షేవ్ లోషన్ వాసన వస్తే బ్రహ్మచారి. సంసారి అయితే బేబీ పౌడరో, ఆడవాళ్ళ షాంపూ వాసనో వస్తూ ఉంటుండి.

కొత్త సినిమా పాట పాడుతూ ఉంటె బ్రహ్మచారి. సంసారులు టివీ సీరియల్ సిగ్నేచర్ సాంగో లేక నర్సరీ పిల్లల రైంస్ లాంటివి పాదుతూ ఉంటారు.

                                                            ఆధారం : ఓకానొక పాత హాసం పత్రిక నుండి.

ప్రకటనలు

6 Responses to బ్రహ్మచారులు – సంసారులు

 1. Raju S అంటున్నారు:

  🙂

  మెచ్చుకోండి

 2. వీవెన్ అంటున్నారు:

  ఆహ్హా! 😀

  మెచ్చుకోండి

 3. రానారె అంటున్నారు:

  ఓహో!

  మెచ్చుకోండి

 4. radhika అంటున్నారు:

  idi maa vaariki cadivi vinipiste musi musi ga navvukunnaru.nenayite peddagane navvesabu.

  మెచ్చుకోండి

 5. Sudheer Kothuri అంటున్నారు:

  భలే బాగుంది!

  మెచ్చుకోండి

 6. Dileep అంటున్నారు:

  haa haa chalaa chalaa bagundi andi… continuee.

  మెచ్చుకోండి

మీరేమంటారు ...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: