ఔర్ ఇస్ దిల్ మే క్యా రఖా హై…

దాదాపు పదేళ్ళ క్రితం, కాలేజీ నుండి బయట పడిన తొలి రోజుల్లో, కలసి బతకాలనుకున్న రెండు జతల కళ్ళను కాసులు విడదీసాయి. ఆనాటి రాత్రి, మనసు మధువుతోనూ కలం కన్నీళ్ళతోనూ తడిసింది. కాసుల వేటలో ధన రాశులను గెలిచిన క్షణం నుండీ తన కోసం వెతకని చోటు లేదు. వెతికి వెతికి వేసారి విసిగిపోయి, ప్రతీ రాత్రీ తనను మర్చిపోవాలని నిర్ణయించుకొని, ఉదయం లేవగానే ఏం మర్చిపోవాలో గుర్తొచ్చి, తను గుర్తొచ్చి…

… ఔర్ ఇస్ దిల్ మే క్యా రఖా హై…

గుండె గొంతు విప్పింది
జ్ఞాపకాల మాలిక,
గుండె గొంతు విచ్చింది
గాయాలే నాకిక

కనులు కనులు కలుసుకుంటే
కాలం జ్ఞాపకాల వారధి గా,
కనుల కలలు నిలువకుంటే
కలం గాయాలతో వరదే గా

నీ కన్నుల్లో నేనుంటే
ఆనందం అనంతం,
నీ కన్నుల్లో నీరుంటే
ఆవేదన అనంతం

నా మదిలో నిరంతరం
నువ్వు వెన్నెల్లో ఆడపిల్ల,
నీ మదిలో నే, ఈ అంతరం
నాలో వేదననూ చూడవేల

కౌముది కోసం అనాదిగా
ఆగదు సాగర ఆరాటం!
నీ మది కోసం అనాధగా
సాగును జీవన పోరాటం!!

(తను ఎన్నాళ్ళకైనా కనిపిస్తుందన్న ఆశతో …)

ప్రకటనలు

7 Responses to ఔర్ ఇస్ దిల్ మే క్యా రఖా హై…

 1. Sudheer Kothuri అంటున్నారు:

  excellent! baagaa vraasaaru…

  మెచ్చుకోండి

 2. రవి వైజాసత్య అంటున్నారు:

  ఇది కవితైతే బాగుంది. జీవితమైతే..get up and get over it

  మెచ్చుకోండి

 3. radhika అంటున్నారు:

  ఇప్పుడు కనిపించినా పిల్లలతో కనిపిస్తుందండి ఆమె.కాబట్టి గతకాలపు మధుర స్మ్రుతులను నెమరు వెస్తూ..డైరీ లో జ్ఞాపకాల పుటలను తిరగేస్తూ…అప్పుడప్పుడు ఊహల్లో కుశలం అడుగుతూ…మనసు బరువైనప్పుడు ఇలా కలం కదిలిస్తూ ఒదార్పు పొందండి.
  జ్ఞాపకాన్ని మించిన ఓదారుపు లేదు
  మరపు కి మించిన మందు లేదు

  మెచ్చుకోండి

 4. రానారె అంటున్నారు:

  “ఉదయం లేవగానే ఏం మర్చిపోవాలో గుర్తొచ్చి,” … Wonderful! Brother, you disturbed me!!!

  మెచ్చుకోండి

 5. రానారె అంటున్నారు:

  “క గుణింతం తెలియనివాళ్లు కాళిదాసులు ఐపోతారు – కాఫీటీలే తాగనివాళ్లు దేవదాసులు ఐపోతారు”

  సరిగ్గా సంవత్సరం క్రితం పైత్య ప్రకోప ప్రభావంతో నేను రాసిన lines, poetry.com లో ఇంకా వున్నాయి…

  “It’s all… over”
  I thought that evening
  But the next morning
  It’s found… all over
  “ఏం మర్చిపోవాలో గుర్తురావడం” ఇదేకదా

  తరావాత నాకు నేనే చెప్పుకొన్నదిది…
  Time is the healer…
  Even if it is the big bang!
  Come on, start over…
  You are young and strong!

  ఇప్పుడు తలచుకొంటే ఒక చిన్న నవ్వొస్తుంది.

  మెచ్చుకోండి

 6. చింతు అంటున్నారు:

  గుండె గొంతులోనికి రావడం అంటే ఇదేనేమో? కవిత బాగుంది.

  మెచ్చుకోండి

 7. అయ్యబాబోయ్ భలేగా రాసేస్తున్నారు 🙂

  మెచ్చుకోండి

మీరేమంటారు ...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: