దయ చేసి నవ్వండి. అది పెదవులు చేసే రెండో మంచి పని…

… 

నిర్వచనాలు

ఆలస్యం అమృతం విషం అంటే?
త్వరగా ప్రేమించు అని అర్థం.
మరి… నిదానమే ప్రదానము అంటే?
కాస్త ఆలోచించి పెళ్ళి చేసుకోవాలని …

వయసు కిటుకు

డెబ్బై ఏండ్లున్న ఒకాయన పాతికేళ్ళ పడుచుతో ప్రేమలో పడ్డాడు. ఆ విషయం ఆమెతో చెప్పడానికి ధైర్యం చాలక ఒక స్నేహితుడిని ఇలా అడిగాడు.
“ఒరే పెళ్ళీ పెటాకులు లేకుండా ఇన్నేళ్ళు గడిపాను. వ్యాపారంలో దాదాపు పది కోట్లు వెనకేసాను. అనుభవించడానికి ఎవరూ లేరు. ఇప్పుడు ఆ పిల్ల పై మనసు పడ్డాను. నాకు యాభై ఏళ్ళు అని చెబితే ఒప్పుకుంటుందంటావా?”

ఏనభై ఐదు ఏళ్ళని చెప్పు. గ్యారంటిగా ఒప్పుకుంటుంది.” అన్నాడా స్నేహితుడు.
కష్టనష్టాలు

“పురుషుడి కష్టనష్టాలు మరపింప జేసేది భార్యే కదండీ!” అందో ఇల్లలు భర్తతో గోముగా.
“పెళ్ళి కాక ముందు పురుషుడికి కష్టనష్టాలేముంటాయి” అంటూ ఆశ్చర్యపోయాడు భర్త.

ఏం చేసేవారో ?

దేశ రాజకీయ నాయకులను గూర్చి చెబుతూ ఒక గురువుగారు ఇలా అడిగాదు. “ఇప్పటి పరిస్థితుల్లో గాంధీ గారు బతికుంటే ఏం చేసేవారో చెప్పరా రామూ” అని.

సదరు రాము చెప్పైన జవాబు ఇదీ, “ఏం జేస్తారండీ, పెన్షన్ తీసుకుంటూ ఉండేవారండీ” 
   
  
    
  

3 Responses to దయ చేసి నవ్వండి. అది పెదవులు చేసే రెండో మంచి పని…

  1. radhika అంటున్నారు:

    modatidi chala bagundi.baaga navvanu.mudavadi chusi maavaaru navvaru.

    మెచ్చుకోండి

  2. ఆసా అంటున్నారు:

    బావున్నాయి. :))) ‘నవ్వు’ పెదవులు చేయగలిగే ‘మొదటి’ మ౦చిపనేమో!! : )

    మెచ్చుకోండి

  3. రానారె అంటున్నారు:

    మొదటిదేదో చెప్పలేదింతకీ…

    మెచ్చుకోండి

మీరేమంటారు ...