సాగర సంగమం

ఆంధ్రదేశమంతా, “ఆకుచాటు పిందె తడిసే..” లకు పరవశించి పోతుండగా, రసిక హౄదయులంతా వళ్ళంతా కళ్ళు చేసుకొని తెలుగు చిత్ర వినోద ప్రపంచానికి రెండు కళ్ళుగా ఉన్నా జయమాలిని, జ్యొతి లక్ష్మి లను చూస్తున్న రోజులవి. ఆదిగో అప్పుడు ఓ కళాతపస్వి  శంకరాభరణం తో తెర తీసి, సాగర సంగమాన్ని సాదించాడు. ఏలా సాధించాడో మనందరికీ తెలిసినా మరోసారి పునశ్చరణ చేసుకొనే ప్రయత్నమే ఈ సాగర సంగమం.

ఈ చిత్రం లో కూడా కళాతపస్వి   దర్శకత్వ ప్రతిభ అద్భుతంగా ప్రకటితమవుతుంది. చిత్ర ప్రారంభంలో టైటిల్సు వేసేప్పుడే, నేపథ్యం లో వచ్చే సంగీతం మరియు చిత్రాల ద్వారా ప్రేక్షకులని శాస్త్రీయ నాట్య భరిత చిత్రాన్ని చూడడానికి సన్నద్దులని చేస్తాడు. ప్రేక్షకులందరినీ రవీంద్ర భారతిలో జరిగే నాట్యం లో కూర్చోబెట్టి, సరైన  దైహిక సంస్కారం లేని వ్యక్తిని విలేఖరుల వరుసలో కూర్చోబెట్టడం ద్వారా, ప్రేక్షకుల్లో ఒక రకమైన ఉత్సుకత ని రేకెత్తిస్తాడు. అనామకుడిగా కనిపించే కథా నాయకుడు నాట్య మయూరి నాట్యంలో ఒక పెద్ద దోషాన్ని పసిగట్టి ప్రకటించడం తో ప్రేక్షకులకు ఆ తప్పేమిటో తెలుసుకోవాలన్న కోరిక పెరిగిపోతుంది. (మరి కమలహసన్ చూపించే వరకూ మనకూ ఆ తప్పేమిటో తెలీదు. ఓక సారి తెలిసిన తర్వాత మనమూ అది తప్పేనని అంగీకరిస్తాము.) ఈ సంఘటనతో మనకు కథనాయకుడిపై అపరిమితమైన గౌరవం పెరుగుతుంది. అందువల్లే కమలహసన్ వివిధ సంప్రదాయాల్లో ఆ చరణాన్ని (పంచభూతములు ముఖ…) ప్రదర్శించి చూపించి బయటకు వెళ్తుండగా,  అక్కడి ప్యూను నమస్తే సార్ అనడాన్ని మనం మనకు తెలియకుండానే ఆస్వాదిస్తాము. ఎందుకంటే కమలహసన్ పట్ల మనకు కూడా ఆ క్షణం లో అంత గౌరవ భావం ఉంటుంది మరి. దర్శకత్వం అంటే ఇదీ.

ఇదే విదమైన సీక్వెన్సు రజనీకాంత్ చిత్రం లో కనిపిస్తుంది.  ఓక అతి మామూలు ఆటో డ్రైవరు కు గొప్ప నేపథ్యం ఉండడం ప్రేక్షకులను కట్టి పడేస్తుంది. అయితే సాగరసంగమము స్థాయిలో ఈ రజనీకాంత్ చిత్రం సీక్వెన్సు విజయవంతం కాకపోడానికి కారణం ఏమిటంటే, ప్రేక్షకుడు సాగరసంగమము లోని సంఘటనను అంగీకరించినంతగా, ఆటో డ్రైవరు సంఘటనను అంగీకరించలేకపోవడము.

సాగరసంగమం చిత్రంలో మనకు కథనాయకుడి పట్ల అపరిమిత గౌరవం పెరగగానే, ఆ వెంటనే వచ్చే చిత్ర కథనంలో  శరత్ బాబు చేత “నువ్వు నాకు అన్నవా తమ్ముడివా?” అంటూ పలికించడంతో ప్రేక్షకులలో మరింత ఉత్సుకత మొదలవుతుంది. అదే బిగువును చివరి వరకూ ఉంచడంతో ఈ చిత్రం తెలుగు చలన చిత్రాల్లో ఒక మైలురాయిగా మిగిలి పోయింది.

ఆంతటి బిగువు కథనంలో ఎలా వచ్చిందో మరోసారి చెప్పుకుందాం.

మరి  విజ్ఞులైన మీరు ఏమంటారో చెప్తారా?

ప్రకటనలు

2 Responses to సాగర సంగమం

 1. radhika అంటున్నారు:

  imtagaa visleashimci ceppaleanu gaani chuustunnamta seapuu[enni saarulu chuusinaa sarea]amduloa liinamaipoataanu.mounamealanoayi paataki maimaracipoatuu,takita tadhimi paataki ulikkipadutuu….aakhari sanniveasaaniki kalla niillu pettukuntuu vuntaanu.

  మెచ్చుకోండి

 2. శ్రీనివాస రాజు ఇందుకూరి అంటున్నారు:

  వేధం అనువనువున నాధం…. ఈ పాటలో ఉన్న భావావేశంతో పొంగిపోతుంటాను నేను.

  నిజంగా ఇది ఉత్తమ చిత్రం.

  కధతో పాటుగా కధనం. ప్రతి సన్నవేశంలో ఒక నిజరూపచిత్రాన్ని చూపిఇంచడమే విషేశఁ

  రజనికాంత్ ఆటోవాడైనా అడిడాస్ షూష్ వేసుకనే ఉంటాడు.
  కానీ కమల్ హాసన్ కాని, శరత్ బాబు కానీ వాళ్ళను చూస్తే.. ఏమనిపిస్తుంది ఆ సినిమాలో….

  మెచ్చుకోండి

మీరేమంటారు ...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: