ప్రేమలేఖ రాసా, ఎదకంది ఉంటది…

 …

అప్పుడెప్పుడో రాసుకున్న ప్రేమలేఖ గుండె కు గుర్తొచ్చింది. 
ఆనాటి లేఖలో కొంత బాగం ఇలా కదిలొచ్చింది. 

——————————

ప్రియమైన నీకు,

ఎక్కడ మొదలెట్టను? 

….

ఈ కాస్త సమయంలో నాలో ఎన్నెన్ని భావాలని! ఏమిటవి అంటే, ఏమని చెప్పను? ఎన్నని చెప్పను? అసలెక్కడ మొదలెట్టను?
 

ఇదిగో, నీతో మాట్లాడాలని ఫొన్ చేతిలోకి తీసుకోని బాల్కనీ లోకి గానే హడవుడిగా వచ్చే వాన చినుకులు స్వాగతం చెప్పాయి, అచ్చూ నీ జ్ఞాపకాల్లా.

నన్ను బలంగా తాకి ముందుకి పోయిన వర్షపు గాలి తాలూకూ మట్టి వాసన.

నీ నంబరు డయలు చేయబోతుండగా అనిపించింది.

“నా లోని భావాలను నీకు చెప్పటం కన్నా, నాలో దాచుకోవటమే ఎక్కువ ఆనందాన్ని ఇస్తుందేమోనని.”

ఊహూ, కాదు కాదు, నీకు చెప్పాలి, కానీ ఫొన్ లో కాదు. అందుకే …

ఇలా కాగితం పై పరిచేసిన ఈ అక్షరాలు,
నాలో కదిలే అనుభూతుల క్షణాలు;

ఉదయం కాస్త ఆలస్యంగా చలి దుప్పటిలోంచి బద్దకంగా బయటకు వచ్చే సూర్యుడు,
చిరు వర్షం రాగానే పరిగెత్తే పిల్ల కాలువ,
మళ్ళీ గోధూళి వేళ పశ్చిమాన పరచుకొనే సంజ కెంజాయపు  రంగు,
వెన్నెల రాత్రిలో కదిలే కొబ్బరాకు క్రీనీడలు,
వీటన్నిటిలోనూ మైమరిచిపోయె నన్ను తట్టి లేపే మంచు గాలి;

….

ఎలా చెప్పను నీకు, నిన్ను చూసిన క్షణం నాలో ఇన్ని భావాలు ఒక్క సారిగా ముప్పిరిగొంటాయని,
ఎలా చెప్పను నీకు, నిన్ను చూసిన క్షణం నాలో నాదం ప్రణవిస్తుందని,
ఎలా చెప్పను నీకు, నిన్ను చూసిన క్షణం నాలో వేదం ప్రభవిస్తుందని,

మా ఇంటి టెర్రెస్ పైనుండి చూస్తే, ఒక పక్క బీచ్ రోడ్డు, కాస్త దూరంగా సముద్రం, ఇంకాస్త పైన వెలుగు నీడల క్షితిజ రేఖ. నా చూపులతో పాటు పరిగెత్తుకు వచ్చే ఒంటరి నక్షత్రం. తాకనా వద్దా అన్నట్టుగా కొద్ది కొద్దిగా వణికించే చలిగాలి. ఇంకా నాకు తోడుగా నీ జ్ఞాపకం.

ఆన్నట్టు-

“నువ్వు నాకు గుర్తొస్తే , నా పక్కన ఎవరూ ఉండరు, నీ జ్ఞాపకం తప్ప,
నువ్వు నా పక్కనుంటే, అసలు నేనే ఉండను, నువ్వు తప్ప!”

ఏమంటారు ఈ అనుభూతిని?  

నేటి ఒంటరి తనంలో నిన్నటి దగ్గరితనం మాటిమాటికీ గుర్తొస్తుంది-
నిన్నటి దగ్గరితనంలో,మరెప్పటిదో ఒంటరితనం,

ఎలా చెప్పను నీకు ఈ అనుభవాన్ని?

జీవితాన్ని గెలిచే ప్రయత్నంలో, నన్ను నేను కోల్పోయాను. అలా కోల్పోయిన “నన్ను” నీ దగ్గర వెతుక్కునే ప్రయత్నం ఇదంతా. నా విజయం తాలూకూ ప్రతిబింబాల్ని, నీ అభినందనపూర్వకమైన చిరునవ్వులో చూసుకోవాలని ఆశ పడుతున్నాను.

ఎలా కోరను, నిన్ను ఈ వరాన్ని?

ఇన్నాళ్ళుగా ఎదురుచూసిన స్వప్నం ఒక్కసారిగా ఎదురు పడితే,

నేను; ఏం చేయాలో తెలీక    

అడుగులు తడబడి,
ఆడలు కడబడి,
మతి చెడి, విరి జడి,
మది నే విడివడి,
మనసై కలబడి,
మదనుని పాలబడి,

మదిలో నీ సడి,
మాయని సవ్వడి,

అందుకే,

అడలు కడబడి,
అడుగులు తడబడి…
    
… ఎలా వినిపించను నీకు, మనసు పలికే మౌన గీతాన్ని?

నిన్ను చూసిన తర్వాత మళ్ళీ నిన్ను గుర్తు చేసుకునే ప్రయత్నమే చెయ్యలేదు. అసలు మర్చిపోతే కదా, గుర్తు చేసుకోవడానికి.

నీ జ్ఞాపకం నాకు తోడుగా లేనిది ఎప్పుడని?
అందుకే, నా కల కూర్పుగా,
నీ జ్ఞాపకాల సాక్షిగా,

“నేడే తెలిసింది,
ఈనాడే తెలిసింది,
కమ్మని కలకే రూపం వస్తే,
అది నీ లాగే ఉంటుందనీ….”

ఇలా ఇంతసేపూ నీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నా, నా అనుభూతి తాలూకూ గాఢత నీకు తెలీకపోతే;

నా ప్రేమ లోని నిజాయితీ లో ఎక్కడో లోపం ఉన్నట్టు!”

అవునా, అందుకేనా ఇంత మౌనం. అలా కాకపోతే,
రా! ప్రియతమా,
నువ్వు వస్తావని,
వచ్చే దారంతా,
అనుభూతులతో పరిచి
ఆశల దీపాలు వెలిగించి ఉంచాను.

నీ నిర్ణయం తో
నా కలలని “కళ్యాణి” రాగం ఆలపించమంటావో,
లేక
నా కళ్ళని “మేఘమల్హర్” రాగం ఆశ్రయించమంటావో !

ఎదురు చూస్తూ ,
నీ 
నేను.

  
    

     

ప్రకటనలు

3 Responses to ప్రేమలేఖ రాసా, ఎదకంది ఉంటది…

 1. radhika అంటున్నారు:

  ఏమి చెప్పను అంటూనే మీ మదిలోని భావాలని అద్భుతం గా ఆవిష్కరించారు..చిన్న చిన్న పదాల్లో మీ అనుభూతి గాడత ఆస్వాదించగలుగుతున్నాము.ఈ ప్రేమలేఖని చూస్తే ఎవరైనా సరే పరిగెత్తుకుని వస్తారు…అంత అందం గా,అంత భావయుక్తం గా వుంది మరి.

  మెచ్చుకోండి

 2. pradeepwrites అంటున్నారు:

  mee kavitha chaala baagundi prasad garu. mee madi lo ni bhaavaalani chaala chakkaga varninchaaru.

  మెచ్చుకోండి

 3. శ్రీనివాస రాజు ఇందుకూరి అంటున్నారు:

  ఇది చూసి మనసు కరగని, మీ మనసును అర్దంచేసుకోని పడతి ఉండదేమో??

  మెచ్చుకోండి

మీరేమంటారు ...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: