హలో, కాస్త నవ్వండి….

..

కోళ్ళ గొడవ

అన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగు భాషను ప్రభుత్వ కార్యాలయాల్లో ఉపయోగింపజేయడానికి గానూ,ఉద్యోగులకు తెలుగు బాషపై పరీక్షలు పెట్టి ఫలితాల ఆధారంగా ఇంక్రిమెంట్లు ఇచ్చారు. అలాంటి ఒక పరీక్షలో తెలుగు కు తర్జుమా చేయమని కోరుతూ ఇచ్చిన ఆంగ్ల వాక్యం “A hen has four chicken”.

ఉర్దూ తప్ప మరే బాష రాని ఒక ప్రభుత్వ ఉద్యోగి ఇలా అనువదించాడు.

“కోడి కొడుకులు నాలుగు.”

కుటుంబ నియంత్రణ

“కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ఎవరు చేయించుకుంటే మంచిది? ఆడవాళ్ళా లేక మొగవాళ్ళా? “అని ఒకాయన హస్యావధాని శంకర నారాయణను అడిగాడు. దానికి శంకర నారాయణ గారు చెప్పిన జవాబు ఇది.

“ఆడా, మొగా కాదు నాయనా, ఆడేవాళ్ళు చేయించుకోవాలి!”

చల్లని మాట

ఏదైనా ఒక చల్లని మాట చెప్పవోయ్, వినాలని ఉంది.” అంటూ భార్య పక్కన కూర్చున్నాడు భర్త.

“మన ఇల్లంతా ఏ.సీ. చేయించుకుందామండి” గోముగా అన్నది ఆ  భార్యామణి.

ఏదైతే ఏం లే,

రెండు గాడిదలు కష్ట సుఖాలు మాట్లాడుకుంటున్నాయి.
“ప్చ్, ఈ జన్మ లాభం లేదు గురూ! వచ్చే జన్మలో నైనా మనిషిగా పుట్టలి.”
“పుడితే పుట్టేవు గానీ – ఆ జన్మలో పెళ్ళి మాత్రం చేసుకోకు ” అన్నది రెండో గాడిద.
“ఏం?” అడిగింది మొదటి గాడిద.
“ఏవుందీ, మళ్ళీ గాడిద బతుకే, “

ప్రకటనలు

3 Responses to హలో, కాస్త నవ్వండి….

  1. radhika అంటున్నారు:

    ha ha…bhale baagunnayi.

    మెచ్చుకోండి

  2. charasala అంటున్నారు:

    🙂

    మెచ్చుకోండి

  3. మధు అంటున్నారు:

    ఆఖరి జోకు చాలా బాగుంది… ఇలా తెలుగు జోకులకు ఒక బ్లాగు అంకితమైతే ఇంకా బాగుంటుంది. ఏమంటారు!?

    మెచ్చుకోండి

మీరేమంటారు ...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: