చిగురించే నా కలలు…

ప్రేమించే మనిషి  ప్రాయముకు పరిహసించే మనసు గాయముకు ఘర్షణ జరిగితే, గెలిచేది ఎవరైనా బహుమతి కన్నుల్లో నీరే, ఆ కలలకు దారి గోదారే. ఆ గోదారి ఓడ్డున నిలిచిన ఓ ప్రేమపిపాసి ప్రయత్నం తో నైనా చిగురించెనా ఆ కలలు,  చిగురించే నా కలలు, చిగురించేనా కలలు,…   

    
చిగురించే నా కలలు
చేజారనీకు
చివరకీ నా కనులు
చెమరించనీకు

కలల కనులు కనిపిస్తే
మనసు పాట విరహం
కనులు కనులు కలహిస్తే 
మనసు బాట విషాదం

భావాలే బరువైతే
భాధెందుకు మనసా
కలలే ఇక కరువైతే
కన్నీళ్ళే వయసా

వలపు తలపు తీరుగా
వలచినాను నేనిక
తలపు వలపు మీరగా
మరచినావు నీవిక

నేనేమో కలగంటి
వలపంత కలగంటి
నీవేమో వలదంటి
మన జంట వలదంటి

అయినా ప్రియా…

చిగురించే నా కలలు
చేజారనీకు
చివరకీ నా కనులు
చెమరించనీకు

ప్రకటనలు

One Response to చిగురించే నా కలలు…

  1. radhika అంటున్నారు:

    baagumdandi.mii kavitalloa ii linu aa linu ani ceppaleamu.kavita mottam bhaava prakatanalathoa amdam gaa vumtumdi

    మెచ్చుకోండి

మీరేమంటారు ...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: