ప్రేమ హద్దు ఆగునా? పెదవి ముద్దు దాగునా?

… 

నోరిటా (టోక్యో)ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్.
అర్థ రాత్రి సమయం.

మరి కాసేపట్లో బయలుదేరబోయే సాన్ ఫ్రాన్సిస్కో కనెక్టింగ్ ఫ్లైట్ కి బోర్డింగ్ పాస్ తీసుకొని సెక్యురిటీ లాంజ్ లో ఎదురుచూస్తుండగా, ఎన్నాళ్ళో వేచిన విరహం హఠాత్తుగా కనిపిస్తే…

ఆ క్షణం ఉశస్సు గా, 
ఆ స్థలం ఒయాసిస్సు గా,
ఆ కాలం తపస్సు గా,
ఆ జ్ఞానం యశస్సు గా,
ఆణువణువూ వేదనతో ,
తనువు తనువూ తపనతో తడిసిపోయే వేళ

ప్రేమ హద్దు ఆగునా? పెదవి ముద్దు దాగునా?

బోర్డింగ్ పాస్ తీసుకున్న ప్రయాణికుడు కనిపించని కారణంగా టేకాఫ్ తీసుకావల్సిన విమానం నిలిచిపోయింది. హోరెత్తించే అనౌన్సుమెంట్ల మధ్య కాలం మరిచిన క్షణాలకు, కవితా రూపపు పదాలివి.

కల ఇలయని కలవరింప,
ప్రియ ప్రియయని పలవరించే,
కలనైనా నిను వరించ
పరిణయమే నిలువరించే,

వేల వేల దేవతలు
వేరు చేసే కథలు
ఏల ఏల దేవతలు
ఏరులే లే వ్యధలు

కలలలోన కౌముది కిరణం
కనులలోన వరుణుడి వర్ణం,
కదలిపోని కవితా స్మరణం
కడలిలోన కరిగిన వర్షం.

తరువాత జాము రాత్రి
ప్రేమ హద్దు ఆగునా?
జాము రాత్రి తరువాత
పెదవి ముద్దు దాగునా?

మెరిసేలే నీ రూపం
మేఘంలా నే కదిలేను
మదినేలే నీ కోసం
మేరువులా నే మిగిలేను

ప్రకటనలు

2 Responses to ప్రేమ హద్దు ఆగునా? పెదవి ముద్దు దాగునా?

 1. radhika అంటున్నారు:

  kavita baagundi.kaani aa samyamloa jnnanam yasassu gaa anna padam akkada saripaDademo anipinchindi.migilina kavita mottam mii igilina kavitallanea bhavayuktam gaa vunnayi.

  మెచ్చుకోండి

 2. ప్రసాదం అంటున్నారు:

  రాధిక గారూ, ముందుగా మీ పరిశీలనకు నా ధన్యవాదములు.

  యశస్సు అన్న పదానికి సాకారము, విజయము, సాధించినది అని కూడా అర్థాలు ఉన్నాయి. తన ప్రేయసిని ఇక జీవితంలో చూడగలనా లేదా అని తపన పడుతున్న ప్రేమ పిపాసికి, ఒక్కసారిగా ఆమె ఎదురుపడితే, అతని మానసిక సంచలనాన్ని ఊహించండి.

  అందుకే ఆ క్షణం అతనికి ఉశస్సు,
  ఆ స్థలం ఒయాసిస్సు,
  ఆ కలిసున్న కాస్త సమయం ఒక తపస్సు, (తపస్సు అంటే ధ్యానం అని కూడా అర్థం)
  మరి తనని చూడాలి అన్న తపస్సు సాకారం అయినట్టే కదా! నిరంతరమూ ఆ ప్రేయసి జ్ఞాపకాలతో గడిపే అతనికి ఆ కాసిన్ని క్షణాలు కల కాదు, నిజం అన్న విషయం గుర్తుంది. ఆ జ్ఞానం అతని విజయం. అందుకే అది యశస్సు అయింది.

  మీ ప్రశ్న వల్ల నా కవిత లోకి నేను తొంగి చూడగలిగాను. మరో సారి ధన్యవాదములు.

  ప్రసాదం

  మెచ్చుకోండి

మీరేమంటారు ...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: