హాస్యం : తాయారు – సద్గుణరావు

… 

సద్గుణరావు భార్య తాయారు పరమ గయ్యాళి. అందగాడైన  సద్గుణరావు ఇంకెవరితోనైనా తిరుగుతున్నాడేమోనని ఎప్పుడూ అనుమానపడుతూ ఉండేది. రోజూ అతను ఇంటికి రాగానే బట్టల మీద ఏవైనా లిప్-స్టిక్ మరకలు లేక పొడవైన వెంట్రుకలు  ఏమైనా ఉన్నాయేమోనని శల్యపరీక్ష చేసేది. పొరపాటున ఏమైనా కనిపిస్తే “ఎవరితో తిరిగొచ్చావు” అని వేపుకు తినేది. పైగా సద్గుణరావు పని చేసేది చీరలు మరియు కాస్మెటిక్స్ అమ్మే దుకాణం కావడంతో, చాలా తరచుగా ఇలాంటి ఈ వేధింపులు ఎదుర్కోవాల్సివచ్చేది. 

సద్గుణరావు బాగా ఆలోచించి, ఇంటికి వచ్చేముందే బట్టలన్నీ శుభ్రంగా దులుపుకుని రావటం మొదలెట్టాడు. యథావిధిగా శల్య పరీక్షలు అన్నీ చేసి అనుమానించదగినవేమీ లేకపోవటంతో తాయారు వేధింపులు కూడా  రెండు రోజులుగా తగ్గిఫొయాయి. మూడవరోజూ శల్యపరీక్షలో ఏమీబయట పడలేదు. హమ్మయ్య, ఉపాయం బాగా పనిచేస్తోంది అని సద్గుణరావు చిన్నగా ఈల వేయబోతుండగా, తాయారు ఇలా అంది.

“ఊ! నేను అనుకుంటూనే ఉన్నాను. ఈ మధ్య మీరు బోడి ముండలతో తిరుగుతున్నారని…”

ఇక సద్గుణరావు సంగతి వేరే చెప్పాలా?

* * *

ఒకసారి సద్గుణరావు, తాయారు కలసి సినిమాకు వెళ్ళారు. సినిమా హాల్లో టికట్లు తీసుకుంటుండగా, క్యూలో అతని కొలీగ్ పార్వతి కనిపించడంతో పలకరించాడు. ఇదంతా గమనించిన తాయారుకు “ఏదో ప్రొఫెషనల్ పరమైన పరిచయం..” అంటూ సర్ది చెప్పబోయాడు.

వెంటనే తాయారు అంది. “ప్రొఫెషనల్ పరిచయం సరే!  ఇంతకీ ఎవరి ప్రొఫెషన్ పరంగా?”

సద్గుణరావు సంగతి మళ్ళీ చెప్పాలా?

* * * 

మరోసారి మరిన్ని తమాషాలు చెప్పుకుందాము… 

ప్రకటనలు

మీరేమంటారు ...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: