మా ఆవిడ ఇంతే, మరి మీ ఆవిడ…?

ఆహా, వారాంతం! విసుగు విరామాలకు ఇక ఇదే అంతం అనుకుంటూ ఆనందంగా ఇంటికి చేరాను. చేరి చూద్దును కదా, మా ఆవిడ కోపగౄహము సీన్ లో కనిపించే సరికి గుండె జల్లు మంది. “దేనికిరా బాబు ఈ సారి టెండరు” అని మనసులోనే అనుకుని కాస్త దగ్గర చేరి “ఏంటి డియర్..” అంటూ అనునయించబోయాను. ఊహూ వింటేనా? పట్టు వదలని విక్రమార్కునిలా మరో అర గంట ప్రయత్నించినా ఫలితం లేదు.

(నా ఉద్దేశంలో ఈ పని చేయడం కన్నా, శవాల్ని, (కాదు లెండి బేతాలుడు అంటేనే కాస్త మర్యాదగా ఉంటుంది. ఎంతైనా విక్రమార్కుడు సాటి మగాడే) భుజాన వేసుకుని తిరగడం చాలా సులభం. పైగా మాంఛి కథలు వినొచ్చు. చిన్నప్పుడు చందమామ కథల్లో విక్రమార్కుడు అర్థరాత్రులు ఎందుకు బయలు దేరేవాడో ఇప్పుడు అర్థమవుతోంది. అప్పుడు చందమామ లో అలా కథలు చెప్పినా, ఆ తర్వాత సిరివెన్నెల బద్రం బీ కేర్ ఫుల్ బ్రదరూ అని పాట కట్టినా అర్థం, అనుభవం ఒకటే అని ఇప్పుడు తెలుస్తోంది)

ఇక మనకి సత్రం బోజనం, మఠం నిద్రే గతి అని మా ఆవిడ చూడకుండా మా అంజి గాడికి రెండు మిస్సుడ్ కాల్స్ ఇచ్చాను. మరో రెండు నిమిషాల్లో అంజిగాడు ఫోన్ చేసాడు. స్పీకరు ఫోన్ ఆన్ చేయగానే “క్లైంట్ కాల్ …. చాలా అర్జంటు … వెంటనే ఆఫీస్ కు రావాలీ..” అనీ సారాంశము. ( ఈ కాల్స్ విషయంలో  నాకూ అంజిగాడికి గొప్ప అవగాహన ఉంది). “సారీ డియర్” అని చెప్పి నేను హడావుడిగా బయటపడి అంజిగాడి గది వైపు కారు పరిగెత్తించాను.

అంజిగాడి గదిలోకి వెళ్ళగానే వాడు విశాలంగా నవ్వుతూ ఆహ్వానించాడు. ఎదురుగా టేబుల్ పై విస్కీ సోడాలతో పాటు కెంటకీ ఫ్రైడ్ చికెన్ పాకెట్టు పలకరించాయి. ఈ విషయంలో వాడిది చాలా గొప్ప అభిరుచి. లాప్ టాప్ ఏవో గజల్స్ పాడటం మొదలెట్టగానే విస్కీ గ్లాసుల్లోకి వంపుతూ నేను కాస్త ఈర్ష్యగా అన్నాను. “ఓరెయ్, పెళ్ళి చేసుకోవడం లాంటి ప్రోగ్రాం ఎమీ పెట్టుకోవద్దురా. చాలా మిస్సయిపోతాం లైఫులో”.  

వాడు కళ్ళెగరేసి గ్లాసందుకొని “నాకు అలాంటి ..” ఒక్క క్షణం ఆగి కాస్త బీరు చప్పరించి “…భాదలేమీ ఉండవు గురూ. ఎందుకంటే ఈ పుస్తకంలోని టెక్నిక్కులని ఫాలో అవుతున్నాను” అంటూ, నా ముందుకు ఓ పుస్తకాన్ని తోసాడు. 

పుస్తకం కవరు పై అక్షరాలు మెరుస్తున్నాయి. “Why men lie and women cry”. 

మేము విస్కీ సీసా ఖాళీ చేసే లోపు వాడు ఆ పుస్తకం అన్ని కాపీలు అమ్ముడు పోయిందో, ఆ పుస్తకం సారాంశమేమిటో, ఆ పుస్తకం చదివిన గత నాలుగు రోజుల్లో వాడికీ,  నందినికీ (నందిని, అంజి గాడి గర్లు ఫ్రెండు) ఎన్ని గొడవలు సమసి పోయాయో సోదాహరణంగా చెప్పాడు. నాకు హటాత్తుగా మహాభారతంలో గీతోపదేశం సీన్ గుర్తొచ్చింది.

అంజిగాడు చివరి పెగ్గు లాగిస్తూ చెప్పాడు “ఇదే పుస్తకాన్ని తెలుగులోకి అనువదించాలనుకుంటున్నాను. మంఛి క్యాచీ గా ఉండే టైటిలు కావాలి గురూ”.  

“మగవాళ్ళెందుకు తాగుతారు – ఆడవాళ్ళెందుకు వాగుతారు” అనేసి నేను మరో పెగ్గుకు సిద్దమవుతుండగా వాడు నావంక కాసేపు ముత్యాల ముగ్గు రావుగోపాల్రావు పద్దతిలో చూసి, “మడిసన్నాక కూసింత కలాపోసణుండాలి, లేకపోతే మడిసికీ, మొగుడికీ తేడా ఏవుంటుంది చెప్పు?” అనేసి పడుకున్నాడు.

ఆ డైలాగు దెబ్బకు నాకు మత్తు దిగిపోయింది. ఇక ఆ రాత్రి చాలా దీక్షగా ఆ పుస్తకం చదివేసాను. ఆ పుస్తకంలో చెప్పిన అతి ముఖ్యమైన సూత్రం ఏమిటంటే, “ఆడవాళ్ళ కు కావలసింది కేవలం సానుభూతితో వాళ్ళ సమస్యలు వినేవాళ్ళు.  పరిష్కారాలు కాదు. అందువల్ల సమస్యలను ఎప్పుడూ పరిష్కరించే ప్రయత్నం చేయవద్దు. కేవలం వినేసి సానుభూతి చూపిస్తే చాలు”. నాకు గొప్ప చిదంబర రహస్యం అర్థమైనట్టుగా అనిపించింది.

ఉత్సాహంగా వెలిగిపోతూ ఇంటికి బయలుదేరాను. ఆ రోజుకి సమస్య ఎమీ అనిపించలేదు. మా ఆవిడ చెప్పేదంతా కళ్ళు విప్పి (వింటున్నట్టు ఉండాలంటే అలాగే చేయాలిట మరి,)వినడం అలవాటు చేసుకున్నాను. మూడేళ్ళ క్రితం జరిగిన వాళ్ళ పిన్ని తమ్ముడి కూతురి పెళ్ళిలో తనెందుకొ ఫీలయిందో, వాళ్ళ అన్నయ్య బామ్మర్ది ఇంట్లో కిటికీ కర్టెన్ రంగులు ఎందుకు సరిగ్గా మాచ్  కాలేదో, వాళ్ళ చెల్లెలి కూతురికి చేయించిన బంగారు గాజుల డిజైన్ ఎందుకు బాలేదో…ఒకటేమిటి మా ఆవిడ గడగడా చెబుతుంటే, తలాడించడమే మన పని. అంతా విని, “ప్చ్! చాలా కష్టపడ్డావ్ డియర్”, “నీకు కాబట్టి ఇవన్ని తెలిసాయి” లాంటి స్టాకు డైలాగులు చెబితే చాలు.

మా ఆవిడ ఆఫీసులో ఉన్నప్పుడు ఫోన్ చేసినా, చెప్పేదంతా వింటున్నట్టుగా రిసీవరు పక్కన పెట్టేసి మధ్య మధ్యలో “ఆవునా, ఆహా” అంటున్నాన్ను.

ఏ మాటకా మాటే చెప్పుకోవాలి. పుస్తకంలోని కిటుకులు బాగా పని చేస్తున్నయి. రెండు వారాల పాటు అంజి గాడి దగ్గరికి వెళ్ళే  అవసరం రాలేదు. వాడూ డిటో యే, నందిని చెప్పే సోదంతా వింటున్నాడు(ట).

హమ్మయ్య, పుస్తకం పుణ్యాన “బతుకు పరిమళించెనే….” అని ఆఫీసులో  పాడుకుంటూ ఉండగా, హఠాత్తుగా నా కాబిన్ లోకి అంజిగాడు ఊడిపడ్డాడు.

“ఓరేయ్, అర్జంటుగా ఓ వెయ్యి డాలర్లు కావాల్రా, శాలరీ రాగానే ఇస్తాను” అన్నాడు.

వాడి అకౌంట్లోకి EFT చేస్తూ అడిగాను నేను. “ఇంతకీ దేనికిరా”

“ఫోను బిల్లు కట్టడానికిరా మామా, పుస్తకం లో కిటుకులు కాదు గానీ ఈ సారి ఫోను బిల్లు పేలింది. ” అంటూ నా గుండెల్లో బాంబు పేల్చాడు. 

వెంటనే నా (మా ఆవిడది లెండి) ఫోన్ బిల్లు చూద్దును కదా, మొత్తం బిల్లు 1670 డాలర్లు.  ఈ సారి నా గుండెల్లో అణు బాంబు పేలింది. ఈ ఫోను బిల్లు విషయం చెప్పనందుకు పుస్తకం రాసినాయనకు ప్రపంచంలోని బూతులన్నీ రాసి మెయిలు కొడదామనిపించింది.
ఇంతలో ఫోన్ మోగింది. మా ఆవిడనుంచే,

“బిజీ గా ఉన్నాను ” అని చెప్పి ఫోన్ పెడుతుండగా, అంజి గాడన్నాడు. ” సాయంత్రం రూంకు రా రా మామా!”

ఇక చెప్పేదేముంది, మనకు తప్పేదేముంది.

మా ఆవిడ ఇంతే, మరి మీ ఆవిడ…? 

===========================================================

ఈ కథ వెనుక కథ: వ్యక్తిగతమైన అవసరం వల్ల హైదరాబాద్ వెళుతూ, పొగ మంచు పుణ్యమా అని డిల్లీ లో ఓ ఆరు గంటలు ఇరుక్కు పోయాను. అప్పుడు చదివిన పుస్తకం దాని పరిణామాలపై ఓ సరదా ఊహకు అక్షర రూపం ఇది. అన్నట్టు ఇది, నా మొదటి కథ.  ఇక కథలు చెప్పొచ్చంటారా? 

ప్రసాదం  

ప్రకటనలు

21 Responses to మా ఆవిడ ఇంతే, మరి మీ ఆవిడ…?

 1. ప్రవీణ్ గార్లపాటి అంటున్నారు:

  చాలా బాగుంది, నాకు ఇలాంటి సరదా కథలంటే చాలా ఇష్టం.
  ఇలాంటివి ఇంకెన్నో రాయాలని ఆశిస్తూ…

  మెచ్చుకోండి

 2. cbrao అంటున్నారు:

  కథలేమిటి, హరికథలు చెప్పే సత్తా కూడ మీ కుందని మాకు తెలుసు. హాస్యం బాగా పండుతోంది మీ రచనలలో.

  మెచ్చుకోండి

 3. వీవెన్ అంటున్నారు:

  బేషో! బాగుంది. కానీ ఈ టెక్నిక్కులు నాకు ఉపయోగపడే అవకాశం లేదు. మా ఆవిడ కూడా కూడలి చదువుతుంది మరి.

  మెచ్చుకోండి

 4. vihaari అంటున్నారు:

  చాల గొప్పగా చెప్పారు.

  మెచ్చుకోండి

 5. చదువరి అంటున్నారు:

  చాలా బాగుంది. మీకిదే మొదటి కథంటే ఆశ్చర్యంగా ఉంది. ఇక చెప్పుకుపోండి.

  మెచ్చుకోండి

 6. రానారె అంటున్నారు:

  భేషుగ్గా చెప్పొచ్చు. మీ కథనకుతూహలాన్ని “పొద్దు” ఆహ్వానిస్తోంది మరి మీ తరువాతి కథకోసం అక్కడ ఎదురుచూస్తుంటాము.

  మెచ్చుకోండి

 7. radhika అంటున్నారు:

  caalaa baagundi kadha.miirichina idea[adenamdi missed calls idea]ikkadi vaallaki bhale vupayogapadutundanukunta.annattu nenu koapam ga vunnappudu maa vaariki kuudaa office calls vachinattu gurtostundi.lol

  మెచ్చుకోండి

 8. అనిల్ చీమలమఱ్ఱి అంటున్నారు:

  ఇది కథ కాదు…నిజమే….
  నేను బ్రహ్మచారినైనా….వివాహితుల ద్వారా, తెలిసిన నిజాలు.

  ఇక కథ విషయమంటారా, మీరు వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేదు..రంగంలోకి దూకండి..

  కానీ…మీ జీతం కాగితం, కలాలకి తగలబెడితే మీ అవిడ ఊరుకొంటుందా అన్నది కాస్త అలోచించుకోండి..అతరువాత మొదలు బెట్టండి…

  అనిల్ చీమలమఱ్ఱి

  మెచ్చుకోండి

 9. శ్రీనివాస రాజు ఇందుకూరి అంటున్నారు:

  ఇంతితోటి బాద ఇంతింత కాదయా….. విశ్వమంత తెలుసు ఈ వింతగోల… హ హ హ…

  మీరు మంచి కధకులే.. ప్రాసాద్ గారు.. కానీయ్యండి. మాకు మంచి కధలు అందించండి మరి.

  మెచ్చుకోండి

 10. నవీన్ గార్ల అంటున్నారు:

  నా భాషలో చెప్పాలంటే…మీ కథ “కటారి కత్తి”లా ఉంది 🙂
  తెలుగు భాషలో మరో రచయిత పుట్టాడు

  మెచ్చుకోండి

 11. సత్యసాయి అంటున్నారు:

  అయ్యా మీ కథా ప్రసాదం చాలా బాగుంది. ఆయన ఎవరో చెప్పిన నిజం ఏదేశకాలాల్లోనైనా నిక్కచ్చిగా నిజం. ఆడవాళ్ళకి సమస్యలుండాల్సిందే. పరిష్కారాలు పనికిరావు. చాలా బాగా చెప్పారు.

  మెచ్చుకోండి

 12. Prasad Charasala అంటున్నారు:

  మీ కథ చాలా బాగుంది. మీరు భేషుగ్గా మరిన్ని కథలు రాయొచ్చు.

  –ఫ్రసాద్
  http://blog.charasala.com

  మెచ్చుకోండి

 13. రవి వైజాసత్య అంటున్నారు:

  ఈ కథ అదిరింది బాసూ. ఆ ప్రేమ కవితలుమాని ఇలాంటివే మరిన్ని గొప్ప కథలను రాయాలని ఆశిస్తున్నా

  మెచ్చుకోండి

 14. aravind అంటున్నారు:

  కధ బాగుంది. నిస్సంకొచంగా మీరు కధలు చెప్పచ్చు.

  మెచ్చుకోండి

 15. vijaya అంటున్నారు:

  ammaini ainaa nenu mecchukuntunnanu ante mee kadha enta bagundo ardham chesukondi. laast lo idi kadha annaru kaabatti saripoindi. lekapote nenu inko pedda blaag raasesedaanne!!! any ways, all the best…go ahead with same spirit

  మెచ్చుకోండి

 16. jabalimuni అంటున్నారు:

  The maiden attempt itself is vey impressive.Why not write more with this inspiration.Future stories will have better appreciation.
  Jabalimuni

  మెచ్చుకోండి

 17. jabalimuni అంటున్నారు:

  మీరి రాసిన మొదటి కధ నాకు బాగ నచ్చింది.మొదటి ప్రయత్నమే యింతగా బాగుంటే మీరు భవిష్యత్తులొ రాయబోయేవి యింతకు మించి బాగుంటాయని నమ్ము తాను.మీప్రయత్నం సఫలీకృతం అవుతుందని నాకు నమ్మకం
  జాబాలిముని

  మెచ్చుకోండి

 18. Dileep అంటున్నారు:

  Haa haa chaala chaala bagundi continue ayepondi……. inkaa alasyam enduku.

  మెచ్చుకోండి

 19. చాలా బాగుంది!

  మెచ్చుకోండి

 20. vijju అంటున్నారు:

  superb..

  మెచ్చుకోండి

 21. Sudhakar అంటున్నారు:

  చాలా బాగున్నాయి,చాలా రోజులైంది మనసారా నవ్వుకొని

  మెచ్చుకోండి

మీరేమంటారు ...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: