పెళ్ళంటేనే వేడెక్కిందీ గాలి!… మళ్ళీ అంటే ఏమవుతాడో బాలాజీ…

నా  కెరీర్ ను ప్రారంబించిన తొలి రోజుల్లో నేను హైదరాబాద్ లోని ఒక ప్రముఖ సంస్థ లో (పేరు చెప్పను!) పని చేసాను. అప్పటికీ సంస్థ ఉద్యోగుల సంఖ్య చాల తక్కువ కావడం వల్ల అందరి మధ్యా మంచి పరిచయాలు, పరిహాసాలు  ఉండేవి. నేను టెక్నికల్ హెడ్, బాలాజీ మా మార్కెటింగ్ మేనేజరు. వాడు మంచి ఆకర్షణీయమైన శరీరంతో సరదా మాటలతో దసరా బుల్లోడిలా ఉండేవాడు. వృత్తిపరంగా ఎంతటి ఘనుడో, ప్రవృత్తి పరంగా అంతటి సౌమ్యుడు. అప్పటికింకా బ్రహ్మచారి. ఆ మాట కొస్తే ఒక్క మా “పెద్దాయన” (అంటే మా బాస్) తప్ప అంతా బ్రహ్మచారులే. కుర్ర వయసు కొంటె తనం మా కంపనీ లో అమ్మాయిలూ, అబ్బాయిలూ అందరిలో ఎప్పుడూ ప్రతిఫలించేది.

ఆ త్రైమాసికానికి టార్గెట్లు ఇస్తూ మా పెద్దాయన ఒక మాంఛి ఆర్థిక ఇన్సెంటివ్ ఇస్తానని ప్రకటించాడు. మా బాలాజీ విని ఊరుకోకుండా, “ఇన్సెంటివ్ పక్కన పెట్టండి సార్, టార్గెట్ పూర్తయితే నాకు ఒక లేడీ అసిస్టెంటు ను అపాయింటు చెయ్యండి. ఇక చూసుకోండి ప్రొడక్టివిటీ” అన్నాడు.

“ఏ ప్రొడక్టివిటీ బాలాజీ…” అని అంటించాను నేను

“అరే, నువ్వు కాస్త ఉండురా బాబూ…” అని నా వంక తిరిగి “అసలే అమ్మాయిలు లైన్లో పడక నేనేడుస్తుంటే నువ్వీ ప్లాన్ చెడగొట్టకు” అన్నాడు.

పాపం వాడి బాధంతా అంతకు మందే చెప్పుకోవడంతో వాడి కో గొప్ప ప్లాను వేసిచ్చాను నేను.  అమ్మాయిలతో మాట్లాడాలంటే వాడికి తగని సిగ్గు. (ఆ మాట కొస్తే నేనూ అంతేలెండి, మా ఆఫీసులో ఒక అమ్మయికి “I Love You” అన్న మూడు ముక్కలు చెప్పడానికి ముప్పయి రోజులు ప్రిపేరయ్యను. తీరా ఆమె ముందుకెళ్ళి టెన్షన్ తో “I,…   I…..,   I…..,  I love….,  I Love…..,    I Love Tea” అని చెప్పేసి చెమట తుడుచుకొని మంచి నీళ్ళు తాగి వచ్చేసాను, ఆ కథ మరో సారి)

బాలాజీ గాడి ఫిజికూ, రంగూ చూసి వాడితో మాట్లాడడానికి కి చాల మంది అమ్మయిలు ఇంట్రస్టు చూపించేవారు. కానీ మన వాడికి మార్కెటింగు తప్ప మరోటి మాట్లాడడం తెలీదు. (ఒక సారి ఒక అమ్మయిని దైర్యం చేసి ఐసుక్రీం పార్లరుకు తీసుకు వెళ్ళి ఆర్డరు ఇచ్చాక ఏం మాట్లాడాలో తెలీక, ఐసుక్రీం మార్కెటింగు టెక్నిక్కులు చెప్పటం మొదలెట్టాడట. “ఛీ, గర్లు ప్రెండు తో ఎవరైనా సినిమాలూ, షికార్ల కబుర్లు చెప్పుకుంటారు గానీ, ఐసుక్రీం ఎలా అమ్ముకోవాలా చెబుతారా? ” అనేసి మధ్యలోనే వెళ్ళిపోయిందట ఆమె. ఆ టెక్నిక్కులు విన్న షాపు వాడు వాడి దగ్గర ఐసుక్రీం కు బిల్లు తీసుకోలేదట.)

నేనిచ్చిన ప్లాను ప్రకారమే వాడు మా పెద్దయనకు టెండరు పెట్టాడు. వాడికంటూ ఒక లేడీ అసిస్టెంటు ఉంటే, ఆ అసిస్టెంటు కూడా మార్కెటింగే మాట్లాడాలి కాబట్టి,  ఆ సబ్జక్టు మా వాడికి కొట్టిన పిండే కాబట్టి, మా వాడు ఒక ప్రోబేషనరీ  గర్లు ఫ్రెండు ను చూసుకోవచ్చు. అన్నీ కుదిరితే పర్మనెంటూ చేసుకోవచ్చు. కుదరకపోతే ఇంట్లో చూసిన సంబంధమే చేసుకోవచ్చు. ఈ లోపు టీ, కాఫీ , ఐసుక్రీము ఖర్చులన్నీ అఫీషియల్ కనుక పెద్దాయన చూసుకుంటాడు.  (ఈ ప్లాను చెప్పినందుకు నన్ను అడిగిన చోట వారం పాటు మేపటానికి మా వాడు ఒప్పుకున్నాడు లెండి!)      

నేను ఈ ప్లాను చెప్పిన సంగతి తప్ప మిగిలిన సమస్య అంతా పెద్దాయనకు కూడా తెలుసు కాబట్టి, మార్కెటింగ్ టీం లో అవసరం ఉంది కాబట్టి, ఆయన కూడా కాస్త ఆలోచించి సరే అన్నాడు. ఇక తెగ తిరిగి, టార్గెట్ అంతా మావాడు  రెండున్నర నెల్లల్లోనే పూర్తి చేసాడు. అన్న మాట ప్రకారం పెద్దాయన బాలాజీ కి ఒక (పెళ్ళి కాని) లేడీ అసిస్టెంటును అపాయింటు చేసాడు. ఆమె పేరు “మేరీ నీరజ”.

పేరు ఎంత సుందరంగా ఉన్నా, ఆవిడ మాత్రం “మాయావతి” కి పెద్దక్కలాగా కనిపిస్తూ, “మమతా బెనర్జీ” కి చిన్నక్క లాగా మాట్లాడేది. మొదటి రోజే, మా వాడికి ఆమెతో మాట్లాడాలనే కోరిక పూర్తిగా చచ్చిపోయింది. అను క్షణమూ ఆమెను తప్పించుకుంటూ ఉండేవాడు. లేడీ అసిస్టెంటు అనే బేవార్సు ఐడియా ఇచ్చిన నన్ను ఎప్పుడు ఎలా చితక్కొడదామా అన్న విషయం కూడా నాతోనే డిస్కస్ చేయడానికి ప్రయత్నించాడు.

ఓ రెండ్రోజుల తర్వాత మేరీ నీరజ తప్ప అందరం కాంటీన్లో కూర్చున్నప్పుడు, వాడు మేరీ నీరజ గురించి చెప్పడం మెదలెట్టాడు.

“… అని చెబితే వదలదే మేరీ నీరజ”, “అలా కాదు, మేరీ నీరజా….” అని బాలాజీ ఇంకేదో చెప్పబోతుంటే,నేను మధ్యలో అందుకొని

“బాలాజీ! బార్ బార్ మేరీ నీరజ, మేరీ నీరజ కహనేకా జరూరత్ నహీ హై, నీరజ తేరీ హీ హై” అన్నాను.

వాడా సాయంత్రమే ఇంట్లో చూసిన సంబందానికి OK చెప్పేసాడు. పది రోజుల్లో పెళ్ళి చేసుకున్నాడు.

ఇప్పుడు, వాదో పెద్ద MNC కి మార్కెటింగ్ మేనేజరు. 

ప్రకటనలు

11 Responses to పెళ్ళంటేనే వేడెక్కిందీ గాలి!… మళ్ళీ అంటే ఏమవుతాడో బాలాజీ…

 1. vihaari అంటున్నారు:

  చాలా చక్కగా వుంది కథనం. మీరు బాగానే చెప్పారు. భారత్ లో ఉద్యోగం చేస్తే ఇలాంటి సరదా కబుర్లు ఎన్నో వుంటాయి. ఇలాంటి ఆహ్లాదకరమైనవి అందిస్తూ ఉండండి.

  విహారి

  మెచ్చుకోండి

 2. వెంకట రమణ అంటున్నారు:

  మీ కథ, కథనం చాలా బాగున్నాయి. ఇలానే ఇంకా వ్రాస్తుండండి.

  మెచ్చుకోండి

 3. Praveen Garlapati అంటున్నారు:

  అదెంటండి మీరు అంత మంచి సలహా ఇచ్చిన మీరు, తన సెక్రటరీ ని తనే సెలెక్ట్ చేసుకోవాలనే సలహా ఇవ్వలేదు ???

  మెచ్చుకోండి

 4. రానారె అంటున్నారు:

  “పెళ్ళంటేనే వేడెక్కిందీ గాలి!… మళ్ళీ అంటే ఏమవుతాడో బాలాజీ…” అంటున్నారు, ఆయనకింకో పెళ్లి చేసి సార్థకనామధేయుడుగా చేస్తారా ఏమిటి!!?

  మెచ్చుకోండి

 5. radhika అంటున్నారు:

  ha ha…caalaa baagundi.kadhanam inkaa baagundi

  మెచ్చుకోండి

 6. jyothi అంటున్నారు:

  soopar

  మెచ్చుకోండి

 7. gsnaveen అంటున్నారు:

  రోజుకి ఎన్నో చెత్త farwards వస్తూంటాయి. ఇట్లాంటి పోశ్టులను స్నేహితులకు పంపిస్తే…మంచి కథల్ని farward చేసినట్టూ ఉంటుంది, వాళ్ళకు…తెలుగు ను యూనీకోడులో చదవచ్చు..వ్రాయచ్చు అని తెలియజేసినట్టూ ఉంటుంది

  మెచ్చుకోండి

 8. నాగరాజు అంటున్నారు:

  గమ్మత్తుగా ఉంది మీ టపా.

  మెచ్చుకోండి

 9. శ్రవణ్ అంటున్నారు:

  So, కంపెనీ oracle అన్నమాట.

  ఎంత ధైర్యం? మీ “ఐ లవ్యూ” విషయం మీ ఆవిడకి తెలిస్తే యేమవుతుందో తెలిసే రాశారా ఈ ఆర్టికల్?

  మెచ్చుకోండి

 10. ప్రసాదం అంటున్నారు:

  శ్రవణ్ గారూ,

  – కంపనీ ఓరాకిల్ అని ఎలా ఊహించారండీ?:-/

  – నా బ్లాగు సంగతి మా ఆవిడకు తెలీదు లెండి ఇంకా. మీరు చెబుతారా ఏవిటీ ? 😉

  మెచ్చుకోండి

 11. బాలాజీ నాయుని అంటున్నారు:

  ప్రసాద్ గారు చాలా బాగ ఎంజాయ్ చేశారు మీ కెరీయర్ లో
  హ హ హ హ హ హ హ….!

  మెచ్చుకోండి

మీరేమంటారు ...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: