NIL భీమ పాకం

విమానం టేకాఫ్ అయ్యిందని నిర్దారించుకొని మరీ “ఆనందమానందమాయెనే, మా ఆవిడ పుట్టింటికి పోయెనే…” అని పాడుకుంటూ హుషారుగాఎయిర్ పోర్ట్ నుండి నేరుగా అంజి గాడి దగ్గరికి బయలుదేరాను. అంజిగాడి మూలంగా నేను బాగా చెడిపోతున్నానని మా ఆవిడ నిశ్చితాభిప్రాయనికి వచ్చిన తర్వాత నాకు హొం డిపార్టుమెంటు అంక్షలు మరీ ఎక్కువయ్యయి. అందువల్ల అంజిగాడిని ఆఫీస్ లో మాత్రమే కలుస్తున్నాను. అనుకున్న ప్లాన్ ప్రకారం అంజిగాడి రూంలో అంజిగాడితో పాటు నీలూ, (అసలు పేరు నీలేష్), గుల్లూ (అసలు పేరు గోపాల్) బాగులు అవీ సర్దేసుకొని సిద్దంగా ఉన్నారు. ఇక మా ఇంటికి వెళ్ళి ఒక సిట్టింగ్ అదీ ముందు పూర్తి చేసుకొని ఆ తర్వాత లాంగ్ వీకెండ్ కోసం కళా పోషణ కార్యక్రమం నిర్ణయించాలి.

కార్లో జుమ్మని దూసుకుపోతుంటే, డిపార్టుమెంటల్ స్టొర్ దగ్గర అంజి గాడు పాటందుకున్నాడు.

“ఏ బీరుగ నను దయ జూచెదవో మన వంశోత్తమ మామా!…” అని అనగానే నాకు వాడి ఛాయస్ అర్థమైంది. డిపార్టుమెంటల్ స్టోర్ లో వాడికోసం బీరు టిన్నులు కొన్నాను. ( మాంఛి మూడ్లో ఉంటే అంజి గాడు బీర్ కావాలంటాడు)

బయలుదేరబోతుండగా, గుల్లు గాడు గుర్తు చేసాడు. “కాస్త పెగ్గు వేసుకున్నాక నీలు గాడి చేతికి రుచొస్తుంది మామా, వాడి వంటే వంట,”. ఆ మాట నిజమే, నీలు గాడు రెండు పెగ్గులు లాగించిన తర్వాత చేసే చికెన్ ఫ్రై ముందు కెంటకీ  ఫ్రైడ్ చికెన్ ఎందుకూ పనికి రాదు. వాడు చేసిన బిరియానీ ముందు హైదరాబాద్ బిరియానీ బలాదూర్. వాడి వంటలను రుచి చూసిన తర్వాత మేము నలభీమ పాకం అనడం మర్చిపోయి నీల-భీమ పాకం అంటున్నాము. నీలు గాడు కూడా సరేననడంతో మా వంటకు కావలసిన చికన్, మటన్ వగైరాలన్నీ కొనేసాము. తర్వాత మరికాస్త ముందు కెళ్ళి లిక్కర్ స్టొర్స్ లో మా అందరికీ విస్కీ, సోడాలు మామూలే.

నీలూ గాడింకా బాచిలరే, మొగుళ్ళు పడే కష్టాలన్నీ చూసిన తర్వాత వాడు ముందు జాగ్రత్తగా, వంట చేసే మొగాళ్ళను వాళ్ళ పెళ్ళాలు బాగా ఇష్ట పడతారని, మందేసుకున్న తర్వాత మాత్రమే వంటలు రుచిగా ఉంటే, మందు పురాణముకు ప్రాబ్లం ఉండదనీ, వాడు అట్నుంచి నరుక్కువస్తున్నాడు. వాడి ప్రయత్నం ఏమవుతుందో వాడికి పెళ్ళయ్యాక గానీ తెలీదు.

దార్లో CD లు ఇవ్వడానికి నీలూ గాడి అన్నయ్య ఇంటిలో కాసేపు ఆగాము.నీలూ గాడు ఒరిజినలుగా మరాఠి, మా దగ్గరే తెలుగు కాస్త కాస్త నేర్చుకున్నడు. తెలుగులో చెప్పలనుకున్నదంతా ముందు మనసులో హిందీలో అనుకొని దాన్ని తెలుగు లోకి మార్చి చెబుతుంటాడు. ఏడాది వయసున్న వాళ్ళ అన్న కూతురిని ఎత్తుకుని నేను ముద్దు చేస్తుంటే, “అరేయ్, ఆమె కరుస్తుంది రా!” అని వాడు హఠాత్తుగా అరిచాడు. “వాడి ఉద్దేశం ఆమె కొరుకుతుంది అని”. (హిందీ లో వాడు మనసులో అనుకున్న స్టేట్మెంటు “అరెయ్, ఓ ఖాఠేగా రే”)     
    

కారును ఇంటికి పరిగెత్తిస్తుంటే, అంజి గాడు “భలే మంఛి రోజు, పసందైన రోజు…” అని మళ్ళి పాట అందుకున్నాడు. వాడికి నీలూ తోడయాడు. “భాభీజీ పోయిన రోజు, భయ్యాకు హాయిగ రోజు, భయ్యాగాని ఇల్లంతా బారు లాగ మారిన రోజు” అని హిందీ నీ తెలుగు నూ  కలిపి వదలటం మొదలెట్టాడు.

“రేయ్, పోయిన రోజు అనకూడదురా, అర్థాలు మారిపోతాయి…” అని అరిచాను నేను.    

కారు పార్క్ చేసి దర్జాగా అందరం మా ఇంటి గుమ్మం దగ్గరకు వెళ్ళి నేను తాళం తీస్తుండగా అందరూ ఒక్కసారి గట్టిగా “ఛీర్స్!” అని అరిచారు. నేను ఆనందం తాండవిస్తుండగా తలుపు తీసాను.  

ఎదురుగా మా ఆవిడ సోఫాలో కూర్చోనుంది.

“బావున్నవా అక్కా” అని అడిగి, మా వాళ్ళు మరు క్షణంలో అక్కడ్నుంచి మాయమయ్యారు..

ఇక నాకు తప్పేదేముంది, మీకు చెప్పేదేముంది. 

నీల-భీమ పాకం అనుకున్నది కాస్తా NIL-భీమ పాకం అయింది

మా ఆవిడ ఇంతే, మరి మీ ఆవిడ..?

=================================================

(సాంకేతిక కారణాల వల్ల ఫ్లైట్ ను మళ్ళీ లాండ్ చేసారని, ఆ తర్వాత మర్నాటికి రీ షెడ్యూల్ చేసారని తర్వాత తెలిసింది)
 

ప్రకటనలు

5 Responses to NIL భీమ పాకం

 1. radhika అంటున్నారు:

  ayyo paapaam bhayya….taruvaata baabhiji emi cesaro maa uuhaki vadilesaaraa?caalaa baaga raasaru.paatalu baagunnayi

  మెచ్చుకోండి

 2. Rajendra Alapaty అంటున్నారు:

  ప్రసాద్ గారు,

  మీ కధలు బహు బాగున్నాయి. ఇంతకి ఈ కధా సంకలనం లొ కధనాయకుడి పేరు ఏంటండి?

  ధన్యవాదాలు,
  రాజేంద్ర ఆలపాటి

  మెచ్చుకోండి

 3. vihaari అంటున్నారు:

  ప్రసాదం గారు,

  మీ అనంద సన్నివేశం అప్పటికి ఆరిపోయినా తరువాతి రోజు సన్నివేశం ఎలా వుంటుందో వూహించగలను. మేము ఇక్కడ నా నటనా, రచనా మరియు దర్శకత్వపు ప్రతిభ(????) తో (దర్శకత్వమా పాడ…సెట్టింగులు గిట్టింగులు లేవు) “పెళ్ళాం ఇండియా వెళితే” అనే నాటిక వేశాం. దానికి మా గొప్ప రెస్పాన్సు వచ్చింది. ఆ నాటకాన్ని నా నాటకాల సైటు (http://naatakaalu.blogspot.com/) లో పెడదామనుకుంటే కుదరడం లేదు. ఎప్పుడో వీలు చూసుకుని పెడతా.

  మీరు వెంటనే ఓ పెగ్గేసి మిగిలిన భాగం రాసెయ్యండి. మేము తూలుతూ చదువుకుంటాం.

  విహారి.
  http://vihaari.blogspot.com

  మెచ్చుకోండి

 4. రానారె అంటున్నారు:

  వహ్వా!! “మా ఆవిడ ఇంతే, మరి మీ ఆవిడ..?” పేరుతో ప్రసిద్దికెక్కే లక్షణాలున్నాయి మీ రచనలకు.

  మెచ్చుకోండి

 5. jyothi అంటున్నారు:

  ఎందుకండీ అనవసరంగ ఆవిడకి భయపడ్డట్టు నటిస్తారు. అలా చేసి బోల్తాపడేదీ మీరే నష్టపోయేదీ మీరే. ఎంత వారలైనా కాంత దాసులే!

  మెచ్చుకోండి

మీరేమంటారు ...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: