సినిమాకు తెలుగు పదకోశం…

… 

ఒక చిన్న నటుడికి కొంత కాలం క్రితం – షూటింగ్ వచ్చింది. ఆ సినిమా పేరు “బృందావనం”. చందమామా విజయా వారిది. ఆ చిన్న నటుడి పేరు ప్రకాష్. ఒక సారి వేసాడు. ఆ వేషం మళ్ళీ రావడం తో అతనికి షూటింగ్ వచ్చింది. ప్రొడక్షన్ వాళ్ళు అతన్ని కంటాక్ట్ చేసారు. అతను రూంలో లేడు. మర్నాడు తిరుపతి బయలుదేరాలి.  – షూటింగ్ అక్కడ. “రాత్రికి వస్తాడు. మీరు లెటర్ రాసి తలుపు కింద నుండి తోసేయండి” అని పక్క వాళ్ళు చెప్పారు. ఆ మాట ప్రొడక్షన్ వాళ్ళు డైరెక్టోరియల్ డిపార్టుమెంట్ కు విన్నవించారు. “అయితే ఓ లెటర్ రాసి పంపేయండి. రేపు అతను బయలుదేరాలి” అన్నారు దర్శకత్వ శాఖా వారు. కానీ ఓ చిక్కొచింది. ఆ ప్రకాష్ అనే ఉప వేషధారికి ఇంగ్లీష్ రాదని, తెలుగు లోనే సుబ్బరంగా ఈ లేఖ రాయమనీ ప్రొడక్షన్ వారు చెప్పగా, దర్శక శాఖా లో కొత్తగా చేరిన అబ్బాయికి – పేరు గోపాల రావు – చెప్పారు.

కంపనీ లెటర్ హెడ్ పై రాసి, అతన్నే తీసుకెళ్ళి ఆ రూం తలుపు కింది నుండి లోపలికి తొయ్యమన్నారు. తెలుగు లోనే రాయాలన్నారు.  సదరు గోపాల రావు లెటర్ హెడ్ పట్టుకుని కూచుని, గంట గంటన్నర సేపు తెలుగు భాష తో కుస్తీ పట్టి, ఎలాగైతేనేం లెటర్ రాసి తీసుకెళ్ళి తలుపు సందులోంచి నెట్టాడు. మర్నాడు ఉదయం – ప్రకాష్ అనే ఆ చిన్న నటుడు ఆ లేఖ తెచ్చి అందరికీ చూపించాడు. అందులో ఇలా ఉంది.

చందమామా విజయా కంబైన్స్
విరేచన చిత్రాల నిర్మాతలు
వాహినీ స్టూడీయోలు, మదరాసు-26

శ్రీ ప్రకాష్ గారికి,

సహాయ దర్శకుడినైన నేను గోపాల రావ్ తెలియ జేసుకుంటున్నాను.

ఆర్యా, రేపు తమకు కాల్పులు గలవు. మన చిత్రం యొక్క కాల్పులు తిరుపతిలో జరుగును. కాల్పులలో మొదటి దెబ్బ మీ మీదే. అందువలన రాత్రికే బయలు దేరవలెను. కాల్పులు రెండు రోజులు జరిగిన తర్వాత మీరు తిరిగి రాగలరు. ఈ లేఖ అందిన వెంటనే మా కార్యాలయముకు విచ్చేసి ఖర్చులు అందుకొనగలరు.

ఇట్లు
శిక్షణలో  ఉన్న సహాయ దర్శకుడు
జి. గోపాల రావు
 
                       

ఈ లేఖ చూసి అందరూ ఒకటే నవ్వు. “విరేచన చిత్రాల నిర్మాతలు” అన్నది లెటర్ హెడ్ మీదున్న Motion Picture Producers కి తెలుగు అన్న మాట.! అలాగే షూటింగ్ అన్నదానికి కాల్పులు అన్నాడు. “మొదటి దెబ్బ” అంటే First shot లోనె మీరు ఉంటారు అనిట. దీని మీద వచ్చిన అలోచనతో, షూటింగ్ లో వచ్చే English పదాలకు తెలుగు వాడితే ఎలా ఉంటుంది?

సైలెన్స్ : నిశబ్దము
ఆల్ లైట్స్ :అన్ని దీపములు
రడీ ఫర్ టేక్ : తీతకు సిద్దము
క్లాప్ : చప్పట్లు
యాక్షన్ : నటించు 
కట్ : కోయుము
క్లోజ్ షాట్ : మూత దెబ్బ
లాంగ్ షాట్ : దూరపు దెబ్బ
మిడ్ షాట్ : మధ్య దెబ్బ
క్రేన్ షాట్ : కొంగ దెబ్బ
ట్రాలీ షాత్ :  బండి దెబ్బ

ఇలా రాసుకుని తెలుగులో షూటింగ్ చేస్తే ఎలా ఉంటుంది?

( రావి కొండల రావ్ రాసిన హ్యుమరథం పుస్తకం నుండి )
                       

ప్రకటనలు

4 Responses to సినిమాకు తెలుగు పదకోశం…

 1. విహారి అంటున్నారు:

  మీరు మాకి ఇలాంటివి అందించినందుకు మీ ప్రతిభ కు మెచ్చి మా చిత్రంలో నటించడానికి “పిలిచే పత్రాలు” (కాల్ షీట్లు) ఇవ్వగలరని ఆశిస్తూ. మీ మీద కాల్పులు జరపడానికి అంగారహక గ్రహానికి రమ్మని ఆహ్వానిస్తున్నాము.

  ఆ.దే.ఈ.శు. విహారి
  http://vihaari.blogspot.com

  మెచ్చుకోండి

 2. radhika అంటున్నారు:

  ha ha…baagundi

  మెచ్చుకోండి

 3. రానారె అంటున్నారు:

  భలే.
  విహారిగారి చట్నీ జోకు గుర్తుకొస్తోంది.

  మెచ్చుకోండి

 4. త్రివిక్రమ్ అంటున్నారు:

  హహహ…భలే ఉంది. మీరు కొడవటిగంటి కుటుంబరావు గారి కేయాస్ కథలు చదివారా? మిస్సమ్మ సినిమాలో నాగేశ్వరరావు లాంటివాణ్ణి ప్రధానపాత్రగా చేసి రాసిన వ్యంగ్య హాస్య కథలు. దాంట్లో ఇంగ్లీషు అసలు రాని డిటెక్టివు కేయాస్ పారిపోయిన తన ‘హసిస్టెంటు’ భద్రాన్ని వెతుక్కుంటూ సినిమా స్టూడియోకు వెళ్ళి అక్కడ దర్శకుడి ‘షాట్’ (అంటే గుండేసి కొట్టడమన్నమాట. షాటంటే ఒక యేటనుకో), కట్ (నరుకు), టేక్ వన్, టూ, త్రీ లాంటి మాటలు విని అక్కడో హత్య జరిగిందని, ఎవర్నో చంపి ముక్కలుముక్కలుగా నరికేశారని ఊహించుకుని వణికిపోతాడు. ఇలాంటి ముక్కకు ముక్కానువాదం నిజంగానే జరిగిందన్నమాట. 😀

  మెచ్చుకోండి

మీరేమంటారు ...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: