సరదా దారులు – సర్దారులు

నేను పంజాబ్ లో కొద్ది రోజులు ఉన్నప్పటి సంగతి. ఆక్కడ కాస్త పరిచయాలు పెరిగాక ఒక పార్టీకి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడి వాళ్ళంతా మన లాంటి ఆంధ్రులు కాదు కనుక, అచ్చంగా వాళ్ళ మాతృభాష పంజాబీ లోనే మాట్లాడుకుంటున్నారు. నాకు పంజాబీ రాదు కానీ, వాళ్ళ నవ్వులని బట్టి వాళ్ళు పంజాబీలో జోక్స్ చెప్పుకుంటున్నారని అర్థమైంది. ఒక రెండు పెగ్గులు పూర్తయ్యేసరికి నాకూ కాస్త దైర్యమొచ్చింది. నేనూ (హిందిలో)ఒక జోక్ చెబుతానని ప్రకటించాను.

ఒక్క సారి నిశబ్దం,

అందరూ నా వంక దృష్టి సారించారు.

అందరూ అంత నిశబ్దంగా అయ్యే సరికి నాకు ఒక పెగ్గు మత్తు కాస్తా దిగి పోయింది. ఎందుకైనా మంచిది అని నాకు తెలిసిన ఒక సర్దార్జీ జోక్ లో (అప్పటికి, నాకు తెలిసిన జోక్స్ అన్నీ సర్దార్జీలవే) సర్దార్లను బీహారీలుగా మార్చడానికి నిర్ణయించుకొని జోక్ చెప్పడం మొదలెట్టాను.

“ఏక్ బీహారీ థా, ….(అనగనగా ఒక బీహారీ…)” అని నేను ఇంకా చెప్ప బోతుండగా, ముందు వరసలో ఉన ఒక సర్దార్ గట్టిగా అరిచాడు.

“క్యో,దునియా మే సారే సర్దార్ మర్ గయె క్యా?..(ప్రపంచంలో ఉన్న సర్దార్లు అంతా చచ్చారా ఏం?..)”

ఒక్క సరిగా రెండు వందలకు పైగా జతల పెదవులు నవ్వడం మొదలెట్టాయి. ఎందుకంటే,

నవ్వడం అనేది పెదవులు చేసే రెండో మంచి పని” అని వాళ్ళకు తెలుసు మరి.

ఇప్పుడు చెప్పండి; సర్దారులు సరదా దారులు కారా?

4 Responses to సరదా దారులు – సర్దారులు

  1. radhika అంటున్నారు:

    ha ha…nijamea

    మెచ్చుకోండి

  2. రానారె అంటున్నారు:

    ఆ మాటన్న సర్దార్జీకి సలాం.

    మెచ్చుకోండి

  3. ప్రసాద్ అంటున్నారు:

    సర్దారులు సరదా రాయుళ్ళే కావచ్చు. వాళ్ళ మీద మనం వేసే జోకులని జొకుగా గానే స్వీకరించడం వాళ్ళ హుందాతనం కావచ్చు కానీ వాళ్ళ మీదనే పనిగట్టుకొని జోకులు వేయడం మటుకు మన విజ్ఞత కాదు.

    –ప్రసాద్
    http://blog.charasala.com

    మెచ్చుకోండి

  4. త్రివిక్రమ్ అంటున్నారు:

    ప్రసాదం గారూ! నేను చెప్పదలచుకున్నదే చరసాల గారు చెప్పేశారు. సర్దార్జీల హాస్యప్రియత్వానికి నా జోహార్లు. అసందర్భమే అయినా ఒక మాట చెప్తాను: ఏ గుర్తింపూ లేని కడపకు బాంబుల కడప అని ముద్ర పడినందుకు, బయటి ప్రాంతాలకెళ్ళినప్పుడు ‘మాది కడప’ అని చెప్పగానే ఎదుటివాళ్ళు బాంబులను గుర్తుచేసుకుని భయం ప్రదర్శించినందుకు ‘మనమంటే అందరికీ హడల్’ అని మురిసిపోయే కడపవాసులూ ఉన్నారు. ఆవేదన చెందేవాళ్ళూ ఉన్నారు.

    మెచ్చుకోండి

మీరేమంటారు ...