ఒక్క ముద్దు పెట్టనా?… బొట్టుగా, …వద్దంటే ఒట్టుగా…

నీకు,

ఎలా మొదలెట్టాలో తెలీటం లెదు ఈ భావావేశ పరంపరను,

ఉన్నట్టుండి నువ్వు అలా చెబితే,  మనసు లో ముప్పిరిగొన్న భావాలు ఎన్నని లెక్కించను? మదిలో కలిగిన మమతలన్నీ ఎలా తిరగెయ్యను? నాలో అస్పష్టత కు పదాలు కడితే ఇలాగే ఉంటుందా?

మమత ఏదో కదిలింది
మనసు నాది చెదిరింది
వలపు దారి తనదంది
వలచి నన్ను తలచింది

…..ఉహూ, ఇలా కాదు,

తొలి సంజె లో కలుసుకున్నప్పుడు నీ పక్కన నడుస్తూ ఉంటే, నాలో ఘనీభవించే మనసు పొరలన్నీ విప్పి చెప్పాలని ఆరాటం బయట పడితే ఇదిగో ఇలా,

మదిలో చిన్నది, మాటున అన్నది
తనుగా ఉన్నది, మనసై విన్నది
మదియై ‘నది ‘, మనసైనది,
వలపైనది, వరదైనది, 

వలపుల వలయై
మనసున తలపై
మదిలో నెలవై
మాటలు కరువై
 
మది నదియైనది
తుది సన్నిధియైనది 

…కాదంటావా?

అయితే ఏం, ఎంతకాలమిలా చూపులు గుసగుసలాడుకుంటాయి? మాటలు మౌనంగా ప్రవహిస్తాయి?

…హఠాత్తుగా అప్పుడెప్పుడో విన్న హిందీ సినిమా పాట గుర్తొచ్చింది.  

హం లాఖ్ చుపాయ ప్యార్ మగర్ దునియా కో పథా చల్ జాయెగా,
లేకిన్ చుప్ చుప్ కే మిల్ నేసే, మిల్ నె కా మజా తో ఆయేగా,…

దాచాలని పది లక్షల ప్రయత్నాలు చేసినా, ప్రేమ ప్రపంచానికి తెలిసిపోయింది
కానీ దొంగ చాటు గా కలుసుకున్న క్షణాలు, హృదయం లో నిలిచి పోయింది.

…కదూ, ఇంకా ఎన్ని చెప్పను?

పదాలకే ప్రాణం వస్తే, భాషకే భావం తోస్తే,
మనసుకు బాషలెందుకు?
మనకిక మాటలెందుకు?
  
నువ్వు లేని నా క్షణాలలో,
 
“టప్” మంటూ జారిన వాన చినుకు, నీ జ్ఞాపకం లా ;
“ఘల్లు” మంటూ మ్రోగిన కాలి అందె, నీ రవళి లా; 
“ఝల్లు” మంటూ  పొంగిన గుండె చప్పుడు, నీ సవ్వడి లా;

అన్నీ నా దగ్గర మిగిలిపోతే,

నీ కోసం

ఒక్క ముద్దు పెట్టనా?… బొట్టుగా,
వద్దంటే ఒట్టుగా…

-నేను

=============================================

 అప్పుడెప్పుడో మిగిలిన అపురూప క్షణాలు ఆణువణువూ పలకరిస్తే, ఆ ఆనందం ఇలా పరిచాను.

ప్రకటనలు

5 Responses to ఒక్క ముద్దు పెట్టనా?… బొట్టుగా, …వద్దంటే ఒట్టుగా…

 1. radhika అంటున్నారు:

  హా..ఎక్కడికో తీసుకుపోయారు మీ మాటల్లో.
  ఎన్నాళ్ళకెన్నాళ్ళకు బ్లాగ్దర్శనం.మరీ ఇంత గాప్ నివ్వకండి.అలాగే ఒక హాస్యపు తునకను కూడా అందించంది అందరి కోపం తగ్గిపోయేలా.

  మెచ్చుకోండి

 2. ప్రసాద్ అంటున్నారు:

  బాబ్బాబు కొంచం ఈ కామెంట్సు ఫాంటు సైజు పెంచరూ?

  –ప్రసాద్
  http://blog.charasala.com

  మెచ్చుకోండి

 3. సుధాకర్(శోధన) అంటున్నారు:

  అహా ఎన్న్లాళ్ళకు మళ్లీ ప్రసాదం పెట్టారు.. 🙂

  మెచ్చుకోండి

 4. Manasa అంటున్నారు:

  Chala bavamu vundi deenilo………….very nice, I red this so many times, I can’t count

  మెచ్చుకోండి

 5. prasad అంటున్నారు:

  chala baaga raasaru. bhavam, padala perpu baagundi.

  మెచ్చుకోండి

మీరేమంటారు ...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: