చిక్కులిప్పగలవా బ్లాగరి,..లెక్క చెప్పగలవా?

మా అంజి గాడు ఈ మధ్య ఒక చిక్కు లెక్క తెచ్చి నాకు తగిలించాడు. కాస్త జుట్టు పీక్కొని, (ఉన్నదే కాస్త లెండి) చిక్కుముడులన్నీ విప్పేను. ఆ ముళ్ళేవో మీరూ చూస్తారని ఇదిగో ఇక్కడ వేస్తున్నా. మరి కాచుకోండి.

16 – 36 = 25 – 45 అన్నది నిజమే కదా, 

రెండు పక్కలా (9/2)2 కలపండి 

16 – 36 + (9/2)2  =  25 – 45 + (9/2)2  

దీన్నే ఇలా రాసుకుందాం.  

(4)2  – 2 x 4 x (9/2)  +  (9/2)2    =   (5)2 – 2 x 5 x (9/2)  + (9/2)2 

ఇది   (a2 – 2ab – b2 ) రూపం లో ఉంది కద, దాన్ని, (ab)2 అని రాయ వచ్చు కదా, అందుకని

(4  –  (9/2))2    =   (5  – (9/2)2 

రెండు పక్కలా వర్గమూలం (square root) చేయండి.

 4  –  (9/2)   =   5  – (9/2) రెండు పక్కలా (9/2)   తొలగించండి. 4 = 5 ఏవంటారు మరి.  ఏక్కడో తప్పుందంటారా. చెప్పండి మరి.

 

ప్రకటనలు

6 Responses to చిక్కులిప్పగలవా బ్లాగరి,..లెక్క చెప్పగలవా?

 1. త్రివిక్రమ్ అంటున్నారు:

  (4 – (9/2))2 = (5 – (9/2)2
  ఇంతవరకూ బాగానే ఉందండీ. ఆ తర్వాత రెండువైపులా వర్గమూలం తీసుకుంటే LHS=(+/-)RHS అవుతుంది. మీరది పట్టించుకోకుండా నేరుగా LHS=RHS అని భావించడం వల్ల (- 0.5)2 = (0.5)2 అని ఉన్నది కాస్తా (- 0.5) = (0.5) ఐపోయింది.

  మెచ్చుకోండి

 2. విహారి అంటున్నారు:

  ప్రసాదం గారూ,

  మీ లెక్క ప్రకారమే నాకో అయిదు కోట్లు అప్పివ్వండి. నేను వెంటనే మీకు నాలుగు కోట్లు తిరిగి ఇచ్చేసి మీ నుంచి ఋణగ్రస్తుడనవుతా 🙂

  విహారి

  మెచ్చుకోండి

 3. విహారి అంటున్నారు:

  ఋణవిముక్తుడనవుతా…అని చదువుకోవలసినది గా మనవి 🙂

  మెచ్చుకోండి

 4. radhika అంటున్నారు:

  ఇదేమి లెక్క…..నాకు వున్న జ్ఞానం కూడా పోయేలా వుంది.

  మెచ్చుకోండి

 5. kishore అంటున్నారు:

  మీరు గనక నిజంగా తెలియక అడిగిఉంటే, ఎప్పుడూ రెండు సున్నాలను సమానం చేసి ఒక సమీకరణాన్ని సాధించరాదు.
  ఈలా ఐతే మనకు ఏది కావాలంటే అది సాధించవచ్హు, ఇది చూడండి

  (5-5) (3-2) = (5-5) (3-1)

  రెండు వైపుల విలువ శూన్యం కదా, ఇప్పుడు రెండువైపులా (5-5) కొట్టివేస్తే, 1 = 2 , అవుతుంది.
  ఇక్కడ మీరు చేస్తున్నది కూడ కొంతవరకు అలాంటిదే.

  విలువ శూన్యం ఐనప్పుడు, కొట్టివెయ్యరాదని చిన్నప్పుడు లెక్కల్లో చదువుకొన్నాము.

  మెచ్చుకోండి

 6. ckishor అంటున్నారు:

  ఏం నేను వెధవ్వాయిలా కనిపిస్తున్నానా ? ఆ మాత్రం అర్థం చూసుకోలేనా ? చిన్నప్పుడు లెక్కల మాష్టారు చెప్పిన పాఠం గుర్తులేదనుకున్నావా ? లెక్క తప్పే కాదు తప్పున్నర ! ఇదిగో ఎప్పుడూ ఇరువైపులా వర్గాలు కలపడం కాని, తీసివేయడం గాని చేయరాదు. అది ప్లస్, మైనస్ వరకే పరిమితం.ఉధా.కు (2-1)=(3-2) అంతే అందరూ ఒప్పుకుంటారు కాని దీనికి రెండు వైపులా వర్గాలు కలిపితే సమానమౌతుందా ? అది తప్పు బాబూ తప్పు. అలా ఎప్పుడూ చేయరాదు.

  మెచ్చుకోండి

మీరేమంటారు ...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: