కనులు జనులతో కలబడితే, ఇక ఆ పై జరిగేదీ…(Part-1)

చాలా రోజుల తర్వాత మళ్ళీ వారాంతానికి విహార యాత్ర కి పథకం వేసుకున్నాము. సందర్భమేమంటే, ఆ ఆదివారం నా పుట్టిన రొజు. సాధారణంగా పుట్టిన రోజు ఫంక్షన్లకు దూరంగా ఉండే నేను, మా ఆవిడ నా స్నేహితులైన అంజి గాడు,నీలూ, గుల్లూ, మాకు రెండు ఇళ్ళ అవతల ఉండే సాంబారు షణ్ముగం ను, ఆయన భార్య చిత్ర ను, అంజి గాడి గర్లు ఫ్రండు నందిని  ని, మా ఆఫీసు నుండి మరి కొందరు కొలీగ్స్ ను పిలిచే సరికి నాకు గొప్ప ఉత్సాహం వచ్చింది.

శని వారం రాత్రి తొమ్మిది గంటలప్పుడు, ఇక్కడికి దగ్గరలో 200 కిలొమీటర్ల దూరం లో ఉన్న హిల్ స్టేషన్ కు ప్రయాణం. ప్రయాణం మధ్యలో రాత్రి 11:45 కు గంటలకు  దారిలొ ఒక చిన్న రెస్టారెంట్ దగ్గర ఆగి, సరిగ్గా 1200 గంటలకు బర్త్ డే కేక్ కట్ చేసాను.  అందరూ చప్పట్లు కొడుతూ హాపీ బర్త్ డే అని చెబుతుంటే, నిజం చెప్పూద్దూ, నాకు గొప్ప సంతోషంగా అనిపించింది. నేను ఇంకా ఆనందంలోంచి తేరుకోకుండానే, మా ఆవిడ నా కోసం ప్రత్యేకం గా తెచ్చిన గిఫ్ట్ పాక్ నాకు అందించింది. నాతో సహ అందరిలో గొప్ప ఉత్సుకత, అందులో ఏముందో అని.

అందరూ చప్పట్లు కొడుతుంటే, ఆత్రం గా పాకెట్ విప్పాను. ఒక్క సారి గా నా కళ్ళు మెరిసాయి. ఎన్నాళ్ళు గానో కొనాలనుకున్న సోనీ హాండీ-కాం మెరుస్తోంది లోపల. నేను ఇంకా మెరుస్తున్న కళ్ళతో చూస్తుండగానే, అంజి గాడు మా ఆవిడ తో అన్నాడు. “అక్కా, గిఫ్ట్ అదిరిండి. వచ్చే వారం నా పుట్టిన రోజు కూడా” అని అంటూ నందిని వైపు చూసాడు.

నందిని వంక చూస్తూ మా ఆవిడ “నీక్కూడా అదురుతుంది అంజీ …” అంటూ ప్రసన్నంగా నవ్వింది.

ముద్దొచ్చినప్పుడె చంకనెక్కాలి అన్న సంగతి నాకు బాగా తెలుసు కనుక, మా ఆవిడ చూడకుండా, అంజి గాడికి సైగ చేసాను. వాడు చాలా న్యాక్ గా కథ మొదలు పెట్టాడు.

“అక్కా, ఎలాగూ ఇంత దూరం వస్తున్నాము కద, వచ్చే వారం నా పుట్టిన రోజు కూడా, అందుకని నా బర్త్ డే పార్టీ కూడా ఇక్కడే ఇచ్చేస్తాను.  నందిని, నువ్వు నాకు గిఫ్ట్ వచ్చె వారం ఇద్దువు లే” అని నదిని వైపు తిరిగాడు.

“ఇంతకీ ఏం పార్టీ ఇస్తావయ్యా తమ్ముడూ, ” అని మా ఆవిడ అడగ గానే వాడు కొంచం నసుగుతూ, “అది… అదీ… మీరు వద్దు అనకపొతే, ….మందు పార్టీ బావుంటుందని… అంటే నా ఉద్దేశం, ఎక్కువేం కాదు, కొద్దిగానే, జస్ట్ రెండు పెగ్గులు మాత్రమే, … వద్దంటే మరి వద్దులెండి అక్కా, …” అని నసుగుతూ, నా వంక తిరిగి “…ఎరా, ఎమంటావు.? ” అని అడిగాడు.

వాడి చూపులతొ పాటే, మా ఆవిడ చూపులు నా వంక తిరిగాయి.

నాకు గొంతులో ఒక్కసారి తడారి పోయినట్టు అనిపించింది. నేను ఏదో చెప్పబోతుండగా, మా ఆవిడ కొంచం వాడిగా నా వంక చూస్తూ, అంజి గాడి వైపు తిరిగి  డబ్బాలోంచి  ఒక లడ్డూ తీసి వాడికి ఇస్తూ  “అది సరేనయ్యా, మీకు మందు పార్టీ, మరి నాకేమిస్తావు” అని ప్రసన్నంగా అంది.

నీకు మంచి పట్టు చీర కొనిపెడతాను అక్కా, అని అంటూ ఎవరూ చూడకుండా నన్ను గిల్లాడు.  “ఈ పట్టు చీర బిల్లు నీకే మామా ” అని వాడి గిల్లుడు ఉద్దేశం.

అలా మాట్లాడుతూ ఇంకొద్దిసేపట్లో మేము బుక్ చేసుకున్న హొటల్ కు చేరుకున్నాము.

ఉదయం 10 గంటలకల్లా ఆడవాళ్ళని షాపింగ్ కు వదిలేసి, వాళ్ళకి సెక్యురిటి గా, సాంబారు షణ్ముగం ను వదిలి, మా మగ జాతి అంతా రంగుల కొసం బయలుదేరింది. అసలే హిల్ స్టేషన్, ఇక అందాలకు కొదవేముంది. పైగా నా చేతిలో హండీ-కాం. ఇక కనిపించిన ప్రతి అందాన్ని అందులో బందీ చేస్తూ అలా అలా ముందుకు సాగాము.

ఒక చోట సహజంగా ఏర్పడిన లేక్ ఉంది.  దానికి ఆనుకొని స్విమ్మింగ్ పూల్. దాని చుట్టూ బికినీలలో రంగులు. గుల్లు, నీలూ, అంజి గాడికి కళ్ళు చెదిరి పోయాయి. నేను అసలు కళ్ళు చెదరనిస్తేగా.

ఇక అసలు సరదా మొదలైంది.

“మామా, ఆ బ్లూ బికినీ చూడు మామా, కత్తి లాగా ఉంది” అన్నాడు అంజి గాడు.
నేను అలా అటు పక్క చూస్తుండగానే, “ఆ బ్లూ బికిని కాదురా, ఇక్కడ పక్కకు దేఖో, లడ్కీ బాడి మొత్తం చమక్ చమక్ అంటుంది.” అని గుల్లు అందుకున్నాడు. వాడు ఒరిజినల్ గా మరాఠి. ఇంకా ఆ వాసనలు పోలెదు. వాడి భాషలో హిందీ ధారాళంగా కలిసిపోతుంది.

నేను వ్యూ అలా అటుపక్క ఫొకస్ చేయగానే,  వాడు అరిచాడు. ” ….అబేయ్, లడ్కి కి చూడ్రా, లడ్కీ అమ్మకు కాదు రా, … ”

జూం మరీ దగ్గరికి లాగి షూట్ చేస్తూ  ” ఈ జూం కనిపెట్టిన వాడు దేవుడు మామా, లేక పొతే ఇక్కడ టెలిస్కోప్ పెట్టి చూడాల్సి వచ్చేది. మన పనులు చూసి జనం చావ తన్నే వాళ్ళు ” అన్నాను.

అంజి గాడి ని చూస్తూ ” అరే మామా, ఒక మంచి పిల్లను చూస్కో, సూపర్ యాంగిల్ లో ఇద్దరినీ కల్సి వచ్చేలా లాగించేస్తాను. ఈ సారి నీ రూంలో మందు పార్టీ కి గజల్స్ వద్దు రా, హాయి గా ఈ సీడీ వేసుకునదాము. అహా, ఏం అందాలు రా, ”

“అరే, అరే అక్కడ నుండి వస్తుంది దేఖో పింక్ పంజాబీ డ్రెస్ లడ్కీ, ఉస్కో మొత్తం షూట్ చెయ్యి. ఆమె మన దగ్గర నుండే వెళ్తుందేమో? పూరా క్లోజప్ షాట్ తియ్యి. అబ్బ ఏం ఉందిరా లడ్కి. ”

“మామా, నిజంగా అదిరింది మామా నీ సెలక్షన్!” అన్నాను నేను జూం లోకీ లాగుతూ.

“అహా, ఏమి నడక మామా, ” అన్నాడు అంజి.

అలా కామెంట్స్ చేస్తూ, హండీ కాం లో రికార్డ్ చేస్తుండగానే, సదరు పింక్ పంజాబీ మమ్మల్ని దాటి ముందుకు వెళ్ళింది.

“ఈ ఫిగర్స్ కత్తి మమా, ఏ యాంగిల్ లో అయినా అందమే!” అంటూ అందరినీ పక్కకు మరల్చాను.  ఒక కాలేజీ గ్రూప్ కాబోలు, గల గలా నవ్వుతోంది.

(మిగితా త్వరలో …)

ప్రకటనలు

2 Responses to కనులు జనులతో కలబడితే, ఇక ఆ పై జరిగేదీ…(Part-1)

  1. radhika అంటున్నారు:

    welcome back.

    మెచ్చుకోండి

  2. నాగరాజా అంటున్నారు:

    బుల్లి పాపాయికి తండ్రి అయిన సందర్భమున శుభాకాంక్షలు.

    మెచ్చుకోండి

మీరేమంటారు ...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: