కనులు జనులతో కలబడితే, ఇక ఆ పై జరిగేదీ…(Part-2)

మొదటి భాగం ఇక్కడ చదవండి.

============================================================== 

అలా గ్రూప్ మొత్తాన్ని హాండీ కాం లో కవర్ చేస్తూ ఉంటే అంజి గాడు అన్నాడు.

“మామా, మొత్తానికి నీ బర్త్ డే పార్టీ మాత్రం అదిరింది మామా, పైగా నాకు లేని బర్త్ డే ఒకటి తయారు చేసి మందు పార్టీ కి అక్కను   ఒప్పించేలా అయిడియా ఇచ్చావు చూడూ, అప్పుడే అనుకున్నాను, నీది గొప్ప క్రిమినల్ బ్రెయిన్ మామా. నీ దగ్గర చాలా నేర్చుకోవాలి ”   

“అఫ్ట్రాల్, ఆడాళ్ళకే అన్ని తెలివి తేటలు ఉంటే, మగాళ్ళం! మనకు ఎన్ని ఉండాలి.” అంటూ, పాకెట్ బాగ్ లోంచి చూయంగ్ గం స్ట్రిప్  తీస్తూ నవ్వాను, కాలర్ కొంచం పైకి ఎగరేస్తూ. 

చూయింగ్ గం తీసుకుంటూ అన్నాడు అంజి గాడు. “అయినా పార్టీ కి ఒప్పించేటప్పుడు అక్కకు పట్టు చీర కమిట్ అయ్యాను కద, దాని సంగతి కొంచం చూడరా. లేక పోతే అక్క నన్ను వేయించేస్తుంది. “

చూయింగ్ గం లోని మింట్ ను ఆస్వాదిస్తూ అన్నాను “ఆఆ!.. చీర సంగతి  ఎప్పుడైనా చూసుకోవచ్చు, లైట్ తీసుకోరా, …  ఈ ఫిగర్ చూడు కత్తి” అన్నాను జూం చేస్తూ.           

అంజి గాడు హాండీ కాం లోంచి చూస్తూ ఉండగా, మా ఆవిడ ను ఇంకా లేడీస్ క్లబ్ నూ వెంటేసుకుని  షణ్ముగం మా దగ్గరికి వచ్చాడు.

“రొంబ ఎంజాయ్ చేస్తా వుండారు సారు వాడూ, అంజి వాడూ” అన్నాడు షణ్ముగం.

“వా వా,  షణ్ముగం, సూపర్ ఫిగరు. జూం లో నల్లా సీను, ఇంద మాదిరి ఫిగరు … ” అని వచ్చీ రానీ తమిళ్ లో ఇంక అనబోతూ వెనక్కు తిరిగాను. మా అవిడను చూసి, “…. అంటే, నేను కాదు అంజి గాడు చూస్తున్నాడు. ” అని అంజి గాడి వైపు తిరిగి “అరె, లేరా అంజీ, అందరూ వచ్చారు” అన్నాను.

హఠాత్తుగా అంజి గాదు వెనక్కి తిరిగి, “లేదక్కా, జస్ట్ జూం టెస్ట్ చేస్తున్నను అంతే, …” అని కంగారుగా అన్నాడు.          

“సరే ఇక లంచ్ కు పదండి మరి ” అని బయలు దేరదీసాను అందరిని. అంజి గాడు నా వెనగ్గా వచ్చి నెమ్మదిగా “అక్క ను చూసిన కంగారు లో చూయింగ్ గం మింగేసాన్రా?” అన్నాడు. 

నేను ఆ సంగతి విననట్టుగానే ప్రవర్తించాను.

దగ్గరలోని రెస్టారెంట్ లో లంచ్ చేసి, ఆ సాయంత్రం అంజి గాడి అడ్వాన్స్ బర్త్ డే పార్టీ పేరిట నా బర్త్ డే తాలూకూ మందు పార్టీ ఎంజాయ్ చేసి ఆ మర్నాడు ఇంటికి తిరిగివచ్చాము.

ఆ మరుసటి రోజు నేను ఆఫీస్ లో ఉండగా మా ఆవిడ ఫోన్ చేసింది, సాయంత్రం ఇంటికి త్వరగా రమ్మని. తన స్వరం కొంచం తేడా గా అనిపించింది. అయినా ఇంటికి వెళ్ళక తప్పదు కదా.

ఇంటికి వెళ్ళేసరికి మా ఆవిడ కోపగృహం సీను. ఏమిటా సంగతి అని ఆరా తీయబోయాను. మా ఆవిడ నా వంక చూపులలొ నిప్పులు కురిపిస్తూ డివీడి ప్లేయరు, టీవీ ఆన్ చేసింది. టీవీ లో నేను షూట్ చేసిన కలర్స్ అన్ని కనిపిస్తూ నా మాటలు వినిపిస్తున్నాయి.

ఈ జూం కనిపెట్టిన వాడు దేవుడు మామా, లేక పొతే ఇక్కడ టెలిస్కోప్ పెట్టి చూడాల్సి వచ్చేది. మన పనులు చూసి జనం చావ తన్నే వాళ్ళు

…….

అరే మామా, ఒక మంచి పిల్లను చూస్కో, సూపర్ యాంగిల్ లో ఇద్దరినీ కల్సి వచ్చేలా లాగించేస్తాను. ఈ సారి నీ రూంలో మందు పార్టీ కి గజల్స్ వద్దు రా, హాయి గా ఈ సీడీ వేసుకునదాము. అహా, ఏం అందాలు రా, “

……..

మామా, నిజంగా అదిరింది మామా నీ సెలక్షన్!”

……..

ఈ ఫిగర్స్ కత్తి మమా, ఏ యాంగిల్ లో అయినా అందమే!”

……… 

అఫ్ట్రాల్, ఆడాళ్ళకే అన్ని తెలివి తేటలు ఉంటే, మగాళ్ళం! మనకు ఎన్ని ఉండాలి

………..

ఆఆ!.. చీర సంగతి  ఎప్పుడైనా చూసుకోవచ్చు, లైట్ తీసుకోరా, …  ఈ ఫిగర్ చూడు కత్తి!…

……….

ఇక చెప్పేదేముంది.

మా ఆవిడ ఇంతే, మరి మీ ఆవిడ…?

==============================================================

హాండీ కాం లో మైక్రో ఫోన్ కూడ ఉంటుందని, హాండీ కాం దగ్గరగా ఉన్న వాళ్ళ మాటలు చాలా స్పష్టంగా రికార్డ్ అవుతాయన్న విషయం షూట్ చేసేటప్పుడు నాకు తట్టలేదు.  ప్చ్!

8 Responses to కనులు జనులతో కలబడితే, ఇక ఆ పై జరిగేదీ…(Part-2)

  1. చదువరి అంటున్నారు:

    “అయినా ఇంటికి వెళ్ళక తప్పదు కదా.” -ఈ వాక్యం హైలైటు దీనికి.

    మీ శైలి ఎంతో బాగుంటుంది. ఓ సంఘటనను వర్ణించడం, అందునా హాస్యస్ఫోరకంగా చెప్పడం, అందరికీ కుదరని ఓ కళ. మీలాంటి ఏ కొందరికో అది సాధ్యం. ఆరోగ్యకరమైన హాస్యంతో (ప్రస్తుతం ఇది దొరకడం లేదు) ఓ చక్కని టీవీ ఎపిసోడు తియ్యొచ్చు. (మీ బ్లాగు అడుగున ఓ కాపీహక్కు హెచ్చరిక పడెయ్యండి, ఎందుకైనా మంచిది.)

    మెచ్చుకోండి

  2. radhika అంటున్నారు:

    ఈ కధ ను రివర్స్ లో రాసి అంటే అంజి,మీరు వున్న చోట సంజు,మంజు లను పెట్టి రాసి మగ వాళ్ల రియేక్షన్ ఏమిటో రాస్తే చదవాలని వుంది.

    మెచ్చుకోండి

  3. కొత్తపాళీ అంటున్నారు:

    సెభాష్ రాధికా. మంచి పాయింటు తీశారు. 🙂

    మెచ్చుకోండి

  4. నాగరాజా అంటున్నారు:

    నవ్వించారు. “అయినా ఇంటికి వెళ్ళక తప్పదు కదా.” అన్న వాక్యం అదిరింది.

    మెచ్చుకోండి

  5. ప్రసాదం అంటున్నారు:

    చదువరి గారూ, మీరన్నట్టుగా కాపీరైటు హెచ్చరిక త్వరలోనే తగిలిస్తాను. కానీ టీవీ ఎపిసోడ్ ఉద్దేశం మాత్రం ఇప్పుడే లేదు మరి 😉

    రాధిక గారు, మీసలహా బావుంది కానీ అంత మంది ఆడాళ్ళ ముందు మా మొగాళ్ళ పరువు తీయడం న్యాయమే అంటారా?

    కొత్తపాళీ గారు, ఈ కామెంటు మీరు రాసినట్టుగా లెదు, మీ ఆవిడ గానీ రాయలెదు కదా!

    నాగరాజు గారు, Thanks

    మెచ్చుకోండి

  6. విహారి అంటున్నారు:

    నవులే నవ్వులు..

    మీరు యుద్ధ ప్రాతి పదికన అక్షరాల పరిమాణం పెంచండి

    — విహారి

    మెచ్చుకోండి

  7. ప్రసాదం అంటున్నారు:

    విహారి గారు, ఈ అక్షరాల పరిమాణం పెంచే పద్దతి నకు ఎక్కడా కనిపించలేదు. మీరేమైనా సహయం చేయగలరా?

    -ప్రసాదం

    మెచ్చుకోండి

  8. విహారి అంటున్నారు:

    బ్లాగు స్పాటు అయితే తెలుసు కానీ ఈ వర్డు ప్రెస్ సంగతి తెలీదు.

    body gadget లో ఏదైనా CSS class declare చేసుంటే ఆ క్లాసుకెళ్ళి font size పెంచండి. ఇది సాఫ్టువేరులో వున్నోళ్ళకు కొట్టిన పిండి. ఓ చెయ్యి వెయ్యండి అక్కడ.

    — విహారి

    మెచ్చుకోండి

మీరేమంటారు ...