ఈ వేళలో నిన్ను …

ప్రియమైన నా నీకు,

నీ గురించి ఎన్ని భావాలు? ఎన్నని చెప్పను? ఎలా వినిపించను?

ఏ భాషలో చెబితే నీకు తెలుస్తుంది? ఏ పదాల్లో పరిస్తే నీకు నా భావావేశం కనిపిస్తుంది?

ఏ రాగం తో స్వరపరిస్తే  నా భావనా గమకం నిన్ను స్పర్షిస్తుంది?

మనసుల మధ్య భావాలను ప్రసారం చేసే మాధ్యమం ఇంకా ఎదైనా ఉందేమో నాకు తెలీదు. నాకు తెలిసిందల్లా నువ్వు. ఎక్కడో చదివాను. “ప్రేమ అంటే నీ సమక్షంలో కాలాన్ని, నీ పరోక్షం లో చిరునవ్వులని  పోగొట్టుకోవడం”  అని.

ఎన్ని చిరునవ్వులని పారేసుకున్నాను నేస్తం!

తొలకరి కురిసినా, వెన్నెల విరిసినా నువ్వు గుర్తొస్తావు.

మల్లెలు చూసినా, మనసును కదిపినా,…కాదు, నువ్వు ఎలాగైనా గుర్తొస్తూనే ఉంటావు. ఊహూ, ఎలా చెప్పను? నువ్వు అసలు గుర్తు రావు.,

…మరచిపోతే కదా గుర్తు రావడానికి.

నిన్నంతా ఇక్కడ వర్షం కురిసింది. కిటికీ తెరిస్తే  గుండెల నిండా మట్టి వాసన. తడిసిపోయిన చెట్టూ చేమా, నా గదిలో ఒంటరి గా నేను.

ఈ బిజినెస్ స్ట్రాటజీలు, ప్రోడక్టు షెడ్యూల్స్, ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్సు అన్నీ వదిలేసి, కిటికీ లోంచి దూకి వచ్చేసి….,

నీ జ్ఞాపకాన్ని తెచ్చే ప్రతీ వర్షపు  చినుకునూ సృశించాలని,

నీ జ్ఞాపకాలతో అభిషిక్తున్ని అవ్వాలని…,

…నవ్వుకుంటున్నావా?

నువ్వు నవ్వుకోవడం కూడా నాకు ఇష్టమే, నాకు నీలో ఇష్టం లేనిదేదని? From all the lovely things you do, the nicest is just being you.

ఉదయాన్నే సూర్యున్ని చూస్తే నాకు ఈర్ష్యగా ఉంటుంది, ఎక్కడో ఉన్న నిన్ను చూస్తుంటాడని…

పరిగెత్తే మేఘాన్ని చూసినా నాకు అనుమానమే, పరుగు నీ దగ్గరకేమోనని…

రాత్రి ఆకాశంలో నక్షత్రాలు నన్ను చూసి జాలి గా నవ్వుతుంటాయి,

నా ఉక్రోశాన్ని చంద్రుడు వెన్నెలగా పరుస్తుంటాడు .

మళ్ళీ ఉదయం, మళ్ళీ సూర్యుడు…

ఏం చేయను?

ఏ విరిసిన పువ్వు దగ్గరో మోకాళ్ళపై కూర్చొని నన్ను నేను కోల్పోయెంత స్వఛ్ఛంగా నవ్వుతాను.
నువ్వు నాకు కనిపిస్తావు.

కదిలించే నీ కళ్ళు కనిపిస్తాయి.

నీ కళ్ళలో వెలిగే నా కనులు, కార్తీక దీపాలు,
నా కళ్లలో కదిలే నీ జ్ఞాపకాలు, శ్రావణ మేఘాలు,

మేఘమా, మేఘమా, మెరవకే మేఘమా!
మెరిసినా, నువ్వు కురవకే మేఘమా,

అంటూ నీ జ్ఞాపకాల కలలతో గడిపేసే…

నీ

నేను

ప్రకటనలు

8 Responses to ఈ వేళలో నిన్ను …

 1. తెలుగుఅభిమాని అంటున్నారు:

  నీ భావుకతకు జోహార్లు అన్నియ్యా. అప్పుడప్పుడూ emotional kiteflying మనిషికి అవసరమే.

  మెచ్చుకోండి

 2. Ssreddy అంటున్నారు:

  chaala baagundhi….

  మెచ్చుకోండి

 3. radhika అంటున్నారు:

  maaTalu caalavu emta nachchimdoa ceppaDaaniki.

  మెచ్చుకోండి

 4. శ్రవణ్ అంటున్నారు:

  ప్రతీ sentence ఒక్కో లైనులో రాయాలని రూలు పెట్టుకోకండీ. ఇంత మంచి భావాల్ని పలికించివారు వాటిని సరిగా కూర్చాలనిపించలేదా? చాలా బవుంది. చిన్న చిన్న పేరాలుగా వ్రాయండి, ఇంకా బావుంటుంది.

  మెచ్చుకోండి

 5. మానస అంటున్నారు:

  చాలా చాలా బాగుంది!

  ‘ఈ వేళలో నిన్ను …’ just ఒక సారి అలా వుహించుకుంటేనే ఎంతో బాగుంది feeling 🙂 🙂

  మెచ్చుకోండి

 6. siva sankar.v అంటున్నారు:

  chiru navula varamistava
  chitinundi tirigostanu
  maru janmaku karunistava
  marukshaname maranistanu

  మెచ్చుకోండి

 7. Manasa అంటున్నారు:

  “Ee vellalo Ninnu’…malli malli chadivanu, ekkadiko vellipoyanu, simply superb!

  మెచ్చుకోండి

 8. SASIKALA అంటున్నారు:

  who wrote these lines? Please i want to know the writer.

  మెచ్చుకోండి

మీరేమంటారు ...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: