లేదిక, కృష్ణా రాధికా..

ఏ మాట కా మాటే చెప్పుకోవాలి.మా ఆవిడకు కొంచం షాపింగ్ పిచ్చి ఎక్కువే, ( మా ఆవిడకు నా బ్లాగు సంగతి తెలీదు లెండి.  అందుకని ఇంత ధైర్యంగా నిజాలు రాస్తున్నాను.) మొన్నా మధ్య మా ఆవిడ ఊరు వెళ్ళే ముందు అంటే NIL భీమ పాకం   జరగడానికి ముందు, ఏదో షాపింగ్ చేయడానికి నన్ను రమ్మంది. నేను మామూలుగా నా కారుకు ఓనర్ గానే ఫీల్ అవుతాను, మా ఆవిడతో షాపింగ్ కు వెళ్ళేటప్పుడు మాత్రం డ్రైవర్ అవతారం లోకి పరకాయ ప్రవేశం చేస్తాను.

పెళ్ళైన కొత్తలో ఎప్పుడో నిర్ణయించుకున్నట్టు, మా ఆవిడ ఎప్పుడు షాపింగ్ వెళ్ళాల్సి వచ్చినా నేను తనని షాపింగ్ మాల్ లో వదిలేసి (నా పర్సు కూడా) పార్కింగ్ లో ఉండే నా కార్లో కూర్చోని రెండో నాలుగో పుస్తకాలు చదివి పారేస్తాను. ఈ లోగా మా ఆవిడ నా పర్సును ఊదేస్తుంది.  తర్వాత చదివేసిన పుస్తకాలను నెమరు వేసుకుంటూ నేను, కొనేసిన వస్తువులు తడుము కుంటూ మా ఆవిడా ఆనందం గా ఇంటికి చేరతాము.

అలా ఆ రోజు పార్కింగ్ లో కూర్చొని నేను ఎడ్వర్డ్ డి బోనో రాసిన Serious Creativity ని లాగించేసాను. షాపింగు బాగా జరిగిందేమో, మా ఆవిడ కూడా ఉత్సాహంగా ఉంది. అదేంటో ఎంత షాపింగ్ చేసినా మా ఆవిడ ఎప్పుడూ అలసిపోదు.  ఉత్సాహంగా ఇద్దరం ఇంటికి వెళ్తూ ఉండగా మా ఆవిడ అంది.

“షాపింగ్ మాల్ లో స్వప్న వాళ్ళు కనబడ్డారు అండీ. వాళ్ళ మరదలు కూడా ఇప్పుడు ఇక్కడే ఉంది. మీరు తనకు పాజెక్టు వర్క్ లో చాలా హెల్ప్ చేసారటగా, మిమ్మల్ని ప్రత్యేకంగా ఆడిగింది.  ప్రసాదం బావున్నాడా! ” అని. 

“ఇంకా ఎవరు కనిపించారు? ” అడిగాను నేను కారులో మ్యూజిక్ ఆన్ చేస్తూ.

“మీ రాధిక కనిపించలేదు లెండి. కాకపోతే  మీ కోలీగ్ సురేఖ ఇంకా ఆమె ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్ళు కూడ అడిగారు, ప్రసాదం బావున్నాడా అని, మొత్తానికి మంచి పేరు సంపాదించారు ఇక్కడ కూడా” అంది.

“నాకు రాధిక అనే గర్లు ఫ్రెండు ఉంది, తను ఎప్పుడు కావాలంటే అప్పుడు నా దగ్గరికి వచ్చేస్తుంది. నిన్ను చేసుకున్నాను అని తనకు అభ్యంతరం అదీ ఏమీ లేదు” అని మా ఆవిడను పెళ్ళి అయినప్పటి నుండీ ఉడికిస్తున్నాను. ఆ విషయాన్నే అప్పుడప్పుడూ ఇలా దెప్పుతుంది. నన్ను ఎంత దెప్పినా, మా ఆవిడకు నా మీద అనుమాణమే, నిజంగా రాధిక  ఉందేమో, ఎప్పుడైనా తను వస్తుందేమో అని. దానికి తోడు “నన్ను సరిగ్గా చూసుకోక పోతే నేను రాధిక ను పిలుస్తాను” అని నేను మరింత ఉడికించేవాన్ని.

స్టీరియో లో జేసుదాసు “ఓ బాటసారి, ఇది జీవిత రహదారి…” అంటూ పాట ఎత్తుకుంటుండగా, నేను చదివిన పుస్తకం లోంచి డీ బోనో నా బుర్ర పై తడిమాడు. కమాన్ ప్రసాదం, కొంచం క్రియేటివ్ గా ఆలోచించు అని, అంతే నాకు గొప్ప ఆలోచన వచ్చేసింది.    

“చూసావా అందరూ నన్ను ప్రసాదం బావున్నాడా అని ఎలా అడుగుతున్నారో,” అన్నాను నేను.

“మరి ఇంక ఏవని ఆడుగుతారు మీ గురించి?”  అంది మా ఆవిడ

“వాళ్ళంతా నన్ను ప్రేమగా ప్రసాదం బావున్నాడా అని ఆడిగారు కదా, నీకు ఏం అర్థం కాలేదా?” అన్నాను సిగ్నల్ దగ్గర కారు స్లో చేస్తూ.

“అందులో తప్పేం ఉందీ …” కను బొమలు ముడేసింది మా ఆవిడ .

” ప్రసాదం బావున్నాడా అని అడిగారు కదా, బావున్నాడా  అంటే బావ + ఉన్నాడా అని అనుకోవచ్చు కదా” అన్నాను తనని ఉడికిస్తూ, 

డీ బోనో ఈ సారి నా భుజం తడిమాడు భేష్ అన్నట్టుగా,

“ఏమిటీఈఈ ,  వాళ్ళంతా నిన్ను బావా అంటున్నారా?  లేక ఆలా అనిపించుకోవాలి అని మీకు అనిపిస్తోందా? ఇంటికి పదండి. ఈ సంగతి తేలిపోవాలి ఈ రోజు…” అని మా ఆవిడ అంటుండగానే నేను అన్నదాంట్లో తప్పు నాకు అర్థం అయింది.

స్టీరియో లో జేసుదాసు శృతి పెంచాడు. “….ఇప్పుడు తప్పును తెలుసుకొని, జరిగేదేమిటని? క్షమించదెవ్వరినీ…”

డీ బోనో తడుముతాడేమో అని చూసా, కానీ ఆయన ఎప్పుడో మాయమై పోయాడు.

నేను ఆ రాత్రి మా ఆవిడను బతిమాలి, బామాలి నాకు అలాంటి ఉద్దేశం ఎమీ లేదని వివరించేసరికి  నాకు డీ బోనో తాతలు కనిపించారు. డీ బోనో మాత్రం మళ్ళీ కనిపించలేదు. 

చివరికి మా ఆవిడ కళ్ళు తుడుచుకుంటూ అంది. “అయితే రాధిక కూడ అబద్దం కదా,…”

“అబ్బా, ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు..”. అన్నాను. తనని ఉడికించే అవకాశం వదులుకోవడం నాకు ఇష్టం లేదు మరి.     

“మరీ, మరీ,… డీ బోనో పద్దతి లో రాధిక అంటే, రాదు + ఇక = రాధిక. నాకు తెలుసు, నువ్వు నన్ను ఉడికించదానికి అలా చెప్పావు ..”  అని పూర్తిగా కళ్ళు తుడుచుకుని నవ్వేసింది మా ఆవిడ.

ఇంకేముంది నాకు తనని ఉడికించడానికి ఉన్న ఒక్క అవకాశం కూడా పోయింది.   

మా ఆవిడ ఇంతే, మరి మీ ఆవిడ…?

ప్రకటనలు

18 Responses to లేదిక, కృష్ణా రాధికా..

 1. సుధాకర్ అంటున్నారు:

  చాలా రోజులకు మళ్లీ కత్తి లాంటి టపా..హాయిగా నవ్వుకున్నా…మీకు డీ బోను అక్కరలేదండి బాబు.

  మెచ్చుకోండి

 2. Vihaari(KBL) అంటున్నారు:

  డీ బోన్ అంటే అంతరాత్మా సార్

  మెచ్చుకోండి

 3. ప్రసాదం అంటున్నారు:

  విహారి గారు,

  ఎడ్వర్డ్ డీ బోనో సుప్రసిద్ద రచయిత. అతను అలోచనా పద్దతులపై రాసిన పుస్తకాలు కార్పోరేట్ ప్రపంచం లో చాలా ప్రాచుర్యం పొందాయి. మీకు వీలయితే డీ బోనో గారి పుస్తకాలు Lateral Thinking, I am Right, You are Wrong, Six Thinking Hats ,How To Have A Beautiful Mind చదవండి. నాపై చాలా ప్రభావం చూపిన పుస్తకాలలో ఇవీ ఉన్నాయి.

  మెచ్చుకోండి

 4. Raju అంటున్నారు:

  చాలా బాగుంది మీ టపా!

  మెచ్చుకోండి

 5. jyothi అంటున్నారు:

  ఇలాంటి డీబోనో ఎవడో రాతలు చదివి భార్య దగ్గర అతి తెలివి చూపిస్తే ఇంతే మరి. అర్ధం చేసుకోరు. ఆడాళ్ళా మజాకా. మీకు మీరే గొప్ప అనుకుంటే ఎలా ప్రసాదం గారు..

  మెచ్చుకోండి

 6. నాబోటి బ్రహ్మచారులకివి రన్నింగ్ లెస్సన్స్ అండి. చాలా బావున్నాయి మీ గిల్లికజ్జాలు.

  మెచ్చుకోండి

 7. santhosh అంటున్నారు:

  Prasadam garu, naku vundi oka girl friend Niharika ani…….just ma aavidani vudkinchadaniki..neniate ekanga oka story raasanu…adi chadinapudu chudali ..tarvata nijam cheppanu lendi..

  you blog is humorous and jovial. Keep posting.

  మెచ్చుకోండి

 8. నాగరాజా అంటున్నారు:

  గిలిగింతలు పెట్టే టపా! చాలా చాలా బాగుంది. డీ బోనో పుస్తకాలు దొరకని/చదవని వారికోసం, ఆ పుస్తకంలో మీకు నచ్చిన అంశాలను కొన్ని రాస్తే, నేర్చుకొని ఇంట్లో ప్రయోగిస్తాం 🙂

  మెచ్చుకోండి

 9. Manasa అంటున్నారు:

  ఆడ వాళ్లని బాగా Study చేసినట్టు వున్నారు, మీ కవితలు అన్నీ చాలా బాగుంటాయి, U R very gr8….Keep it up!

  ఏలా రాస్తారు అండి మీరు ఇలా, thoughts ఏల వస్తాయి మీకు , Is there anybody behind U?

  మెచ్చుకోండి

 10. Keerthi అంటున్నారు:

  చాలా బాగున్నయి అండి మీ ఆలొచనలు, మీ బార్యను వుడింకించడాలు, అన్నీ బాగున్నాయి

  ఇంకా ఇలాంటివి చాలా రాయాలి కోరుకుంట్టున్నాము

  De bono ante naaku arthamu kaledu, mee paina vari comments chesaka arthamu iyyindi

  – కీర్ఠి

  మెచ్చుకోండి

 11. vijju అంటున్నారు:

  chala bagundandi… chala enjoy chesanu idi chaduvutu..

  మెచ్చుకోండి

 12. సామాన్యుడు అంటున్నారు:

  all time hit

  మెచ్చుకోండి

 13. CHANDU అంటున్నారు:

  ప్రసాద్ గారు,

  మీలో బహు చక్కని హ్యుమరసు వుంది బాసు..మీ అన్ని బ్లాగులను చదివి పరవసించి నీరసించి పోయ..అందుకోండి అభినందనలు..

  మెచ్చుకోండి

 14. pothukuchi అంటున్నారు:

  This time u write something ridiculing u….I want to know ur feelings when ur wife says the same to u(I’ve a boy friend).Will it be humorous?punching?…as someone above said..read his works and change ur mindset.Thank god I didn’t read any of ur postings before.God has really saved me.

  మెచ్చుకోండి

 15. varam అంటున్నారు:

  chela bagundi mi family attachement …. nice couples ani ardam aiendi…. mari eka prepare cheyandi kotha ga enko chetta idea… all the best..

  మెచ్చుకోండి

 16. రాఘవ అంటున్నారు:

  ప్రసాదం గారు మీరు కేక..
  ఇంకా మాటల్లేవ్…..

  మెచ్చుకోండి

 17. sudha అంటున్నారు:

  Meedi e roju chadivanu. chala bagundi

  మెచ్చుకోండి

 18. prasad అంటున్నారు:

  prasadam garu very nice story. thankyou very much

  మెచ్చుకోండి

మీరేమంటారు ...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: