ఏ TVగ మము దయ జూచెదవో… (తొలి భాగం)

దయలేని వాడెవడో దీన్ని కనిపెట్టె
ఇంటింట వచ్చి పడె దిక్కుమాలిన పెట్టె
పిల్లలకు బుర్రలు బూజు పట్టె
పెద్దలందరికీ బుద్ది మాంద్యంబు పుట్టె

అరవ డబ్బింగులతో అదిరిపోవగ కొంప
కంపు డైలాగులు మన దుంప దెంప
కన్నీళ్ళతో తడిసే ఈ చెంప, ఆ చెంప
ఇల్లంత వొళ్ళంత నరకమే ఇంక

గంటగంటకు వేడి వార్తలే వడ్డించ
చావులూ, మర్డర్లు కళ్ళముందుంచ
శవం క్లోజప్పులే కలల్లో దడిపించ
వార్తలంటే చాలు వచ్చేను మూర్ఛ

డైలీ సీరియళ్ళు జిగట పాకపు జీళ్ళు
అయిపోయి చావవు ఏళ్ళు వూళ్ళు
అతుకుని చూస్తిరా ఇంట్లోని ఆడాళ్ళు
ఆ పూట ఉండవిక కూడు నీళ్ళు

ఎపుడు ఏడుపు గొట్టు ఎపిసోడులే ఉండ
ఆడ పాత్రకు నెత్తిన నీళ్ళకుండ
నట్టింట కన్నీళ్ళు కాల్వలగుచుండ
బతక లేడెవ్వడిక బలి కాకుండ

===========================================================

పాత హాసం పత్రిక లో ప్రచురించబడిన రాం కుమార్ గారి పద్యాలకు కొన్ని చిన్న చిన్న మార్పులు చేస్తే ఈ టపా రూపు దిద్దుకుంది. ఈ టపా కు తుది భాగం త్వరలో మీ ముందుకు వస్తుంది.

నా బ్లాగులో కోరుకున్న టపాలను సులభంగా చూడడానికి వీలుగా “బ్లాగులో ఏముంది? ” అన్న పుటను పునర్నిర్మించాను. నూతన పుట పై మీ అభిప్రాయాలకు స్వాగతం.       

మీ ప్రసాదం 

ప్రకటనలు

3 Responses to ఏ TVగ మము దయ జూచెదవో… (తొలి భాగం)

 1. వికటకవి అంటున్నారు:

  @ప్రసాద్,
  ఒరిజినల్ ఎలా ఉందో తెలియదు గానీ, ఇది మాత్రం ఉన్న పరిస్థితి వ్యంగ్యంగా బాగా చెప్పింది. పదాల కూర్పు ముఖ్యంగా బాగుంది.

  మెచ్చుకోండి

 2. Manasa అంటున్నారు:

  chadavatam kasta kastamu anipinchindi kaani, chala bagundandoyi!…

  chavataniki kastapaddanu, meeru rayataniki marentha kastapaddaro?

  మెచ్చుకోండి

 3. నవీన్ గార్ల అంటున్నారు:

  ఎచ్చలెంట్…మార్వలెచ్

  మెచ్చుకోండి

మీరేమంటారు ...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: