అందమైన లోకమనీ “అమ్‌స్టర్‌డామ్‌” లా వుంటుందనీ…-1నెదర్లాండ్స్ స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10:00 కు అమ్‌స్టర్‌డామ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం లో దిగగానే తెలియని వింత అనుభూతి, మరో కొత్త దేశంలో అడుగు  పెడుతున్నానని కాబోలు. ప్రపంచంలో అతి పెద్ద విమానాశ్రాయాల్లో ఇదీ ఒకటి. అయినా ఎక్కడా తప్పిపోయే ఆవకాశం లేదు లెండి. ఇమ్మిగ్రేషన్ కౌంటరుకు వెళ్ళడానికే దాదాపు 15 నిమిషాలు పట్టింది. అక్కడ పెద్దగా ప్రశ్నలు ఏమీ అడగలేదు. అక్కడి నుండి బాగేజ్ బెల్టులదగ్గరికి మళ్ళీ ఓ 15 నిమిషాలపాటు నడక. నా బాగేజ్ తీసుకుని బయట హాల్లోకి వచ్చేసరికి నా కోసం హోటల్ వాళ్ళు ఏర్పాటు ఛేసిన టాక్సీ   డ్రైవరు ప్లకార్డుతో  నాకెదురుగా వచ్చాడు. విమానాశ్రయం నుండి బయటకు వస్తుంటేనే చిరుజల్లులు, చల్లగాలులూ స్వాగతం చెప్పాయి. సూర్యోదయమై ఇంకా గంటసేపు కూడా అయినట్టులేదు.


నా గది కిటికీ లోంచి పలకరించే సుందర దృశ్యం ...భూ ఉత్తరార్థగోళం లోని,  పశ్చిమ యూరప్ లో ఉన్న నెదర్లాండ్స్ లో భారత దేశంతో పోల్చితే కొంచం విపరీత పరిస్థితే అని చెప్పాలి. అక్టోబర్ నుండీ మార్చి నెల వరకూ శీతాకాలంగానే పరిగణించవచ్చు. సరాసరి ఉష్ణోగ్రతలు కూడా 7’C నుంది 2’C ల స్థాయిలో వుంటుంది. శీతాకాలంలో పగటి సమయం కూడ  చాలా తగ్గిపోతుంది. ఈ వ్యాసం రాస్తున్న సమయానికి, అంటే ఈ రోజు (1-Feb-08) ఉదయం 8:22 కు సూర్యోదయం అయింది. సాయంత్రం 5:26 కల్లా సూర్యాస్తమయం అవుతుంది. వేసవిలో అయితే రాత్రి పదకొండు అయినా ఆకాశంలో సూర్యుడు కనిపిస్తూనే వుంటాడు. అన్నట్టు శీతాకాలంలో కూడా రాత్రి అవగానే మరీ దట్టమైన చీకట్లు ఏమీ కమ్ముకోవు. అంత అర్ధరాత్రి అయినా ఆకాశం అంతా ఓ రకమైన సంజ కెంజాయ వర్ణం కమ్ముకుంటుంది. 


అర్ధరాత్రి అయినా ఆకాశంలో సంజకెంజాయ రంగులే...


హఠాత్తుగా సున్నాకు దిగువస్థాయిలోకి పడిపోయె ఉష్ణోగ్రతలు, విపరీతమైన వేగంతో ( దాదాపు గంటకు 50 నుండి 90 కిలోమీటర్లు) వీచే గాలుల వల్ల చలి ఉధృతి మరింత పెరిగినట్టు అనిపిస్తుంది. మరీ కుంభపోతగా కాకపోయినా వర్షపాతం కూడా ఇదే దారిలో వుంటుంది.


ప్రపంచవ్యాప్తముగ వున్న అతి పురాతన నగరాలలో అమ్‌స్టర్‌డామ్‌ కూడా ఒకటి. క్రీ.శ. 1200 నుండీ ఈ నగరం ఫరిడవిల్లుతూనే వుంది.  వంద, రెండు వందల సంవత్సరాల క్రితం కట్టిన పలు భవనాలు ఇప్పటికీ నగరంలో పూర్తిస్థాయి నివాసయోగ్యమైన భవనాలుగా వున్నాయి. అవడానికి నగరం చాలా పురాతనమైనదైనా, చక్కటి ప్లానింగ్ తో నగరం ముచ్చట గొల్పుతుంది. ముఖ్యంగా నగరంలో చాలా  ప్రాంతాలకు కాలువల రూపంలో విస్తరించిన నీటి రవాణా వ్యవస్థ అద్భుతంగా అనిపిస్తుంది. చాలా మంది తమ తమ ఇళ్ళతో పాటు స్వంతంగా తమకోసం ఒక బోట్ హవుస్ ను కూడా ఏర్పాటు చేసుకుంటారు. శాశ్వతంగా బోట్ హవుసలలోనే నివసించే వారికీ తక్కువలేదు. ఈ బోట్ హవుస్ లు కూడా ఆషామాషీగా వుండకుండా, సకల సౌకర్యాలతో విరాజిల్లుతుంటాయి. సంవత్సరానికి ఒకసారి పార్కింగ్ రుసుము చెల్లించేస్తే, మనకు నచ్చిన చోట బోటుహవుస్ ను కావలసిన చోటుకు తీసుకెళ్ళి కావలసినని రోజులు నిలుపుకోవచ్చు.


ఏమి ‘Home’ లే హలా, పడవ గృహములే ఇలా ... 


మనకు రోడ్ పై రైల్వే క్రాసింగులకు మల్లే ఇక్కడ వాటర్ వే క్రాసింగులు వుంటాయి. వంతెన కింది నుండి చాలా పడవలు క్రాసింగుల గొడవలేకుండా ఎంచక్క వెళ్ళిపోతుంటాయి. కాస్త పెద్ద పడవలు / బోట్ హవుసులు వచ్చినప్పుడు మాత్రం, ట్రాఫిక్ అంతటికీ రెడ్ లైట్ వెలగడం, వంతెనలపై వాహనాలు ఏవీ లేవని నిర్ధారణ అవగానే, నెమ్మదిగా వంతెన తెరుచుకోవడం, అటు పిమ్మట రోడ్డుకు అడ్డంగా నెమ్మదిగా కదిలిపోయె పడవలూ, బోట్ హవుసులు.  చూచి తీరాల్సిన దృశ్యం.


జల రవాణా సదుపాయాలతో పాటుగా నగరంలో రోడ్డు, రైలు రవాణా వ్యవస్థలు కూడా చాలా అభివృద్ది చెందాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ప్రజా రవాణ వ్యవస్థ గురించి. దాదాపు నగరంలోని ప్రతీ మూల నుండీ నిమిషానికి రెండు మూడు ట్రాముల చొప్పున బయలుదేరుతుంటాయి. ప్రతీ వెయ్యి, రెండు వేల గజాలకీ ఒక స్టాపు. వ్యక్తిగత వాహానాల వాహనాలను ఉపయోగించాల్సిన అవసరం ఏవిటిలే అనిపించేంత సౌకర్యంగా వుంటుంది.


ట్రాము, కారు, బైకు, ఏదైనా సరే పాదచారుల కోసం ఆగాలసిందే...కళలకీ పెట్టింది పేరైన అమ్‌స్టర్‌డామ్‌లో చూడడానికి బోలెడన్ని మ్యూజియంలు వున్నాయి.సృజనాత్మకత లో కూడా కొంటెతనాన్ని చొప్పించగల సమర్థత చాలా చోట్ల కనిపిస్తుంది.


ఇలాంటి కొంటె ప్రకటనలకీ కొదవేం లేదు మరి ...ఇక్కడి జీవన విధానంపై, ఆర్థిక పరిస్థితి, మరియూ సంస్కృతీ   మరిన్ని ఇతర విశేషాలు తరువాయి భాగాలలో చదవండి.ప్రకటనలు

9 Responses to అందమైన లోకమనీ “అమ్‌స్టర్‌డామ్‌” లా వుంటుందనీ…-1

 1. varudhini అంటున్నారు:

  మీ నుండి మరో హాస్యపు విందు అనుకుని పరిగెడుతూ వచ్చాను, ఏంటో చరిత్ర చెప్పేస్తున్నారు, కొద్దిగా నిరుత్సాహాం, అయినా బాగుంది.

  మెచ్చుకోండి

 2. chavakiran అంటున్నారు:

  Good one!

  మెచ్చుకోండి

 3. cbrao అంటున్నారు:

  హాస్యమే కాదు, ట్రావెలాగూ బాగా రాస్తున్నారు. ఇంత చక్కని టపాలో బొమ్మలేవి?

  మెచ్చుకోండి

 4. cbrao అంటున్నారు:

  ఎందుకో 1st time pix load కాలేదు. ఇప్పుడు load అయ్యాయి.బాగున్నై.

  మెచ్చుకోండి

 5. ravi అంటున్నారు:

  Good one. Keep going..

  మెచ్చుకోండి

 6. రాకేశ్వర రావు అంటున్నారు:

  కొంటెతనఁవేఁవిటి ? నాకేఁవీ అర్థం కాలేదు…

  మెచ్చుకోండి

 7. venkat అంటున్నారు:

  రాకేశ్వరా,
  కొంటెగా కొంటెతనమేంటో తెలియదంటావా?

  మెచ్చుకోండి

 8. Manasa అంటున్నారు:

  netherlands ki tesekellipoyaru ga andarini , Good 🙂 🙂

  మెచ్చుకోండి

 9. naren అంటున్నారు:

  Prasadam garu meeru inka amsterdam lo ne vunnattaithe mimmalini kalavataniki avakasam vunte koncham jaabu rayandi …na mail id ki..

  Prasthutam nenu meethote amsterdamlo….

  మెచ్చుకోండి

మీరేమంటారు ...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: