అందమైన లోకమనీ “అమ్‌స్టర్‌డామ్‌” లా వుంటుందనీ….-2పలు కాలువలతో నిర్మితమైన ఈ పట్టణం సముద్ర మట్టానికి కనీసం 4 మీటర్ల దిగువన వుంది. సముద్రంలోని నీరు కాలువల ద్వారా వెనక్కు వచ్చి నగరాన్ని ముంచేయకుండా వుండటానికి గాను, ఆనుక్షణమూ నీటిని తోడిపారబోయడానికి వీరు డైక్ అనబడే అనకట్టలను నిర్మించుకున్నారు.  ప్రకృతినే ఎదురొడ్డి నిలిచిన వీరి నీటిపారుదల సాంకేతిక పరిజ్ఞానమును భారత్ తో సహా ప్రపంచ దేశాలన్నీ వినియోగించుకుంటాయి. విలాస జీవితం గడపటానికి ఇష్టపడే వీరి జీవన విధానం చాలా ఆసక్తికరంగా వుంటుంది. సూర్యోదయ సమయంతో నిమిత్తం లేకుండా ఎక్కువ మంది ఉదయం నాలుగు గంటలకే మేల్కొంటారు. వ్యాపార సంస్థలు మినహాయించి పాఠశాలలు , కళాశాలలు వంటివన్నీ ఉదయం ఏడు గంటలకే ప్రారంభం. అలాగే మద్యాహ్నం గరిష్టంగా 1500 గంటలకల్లా అందరూ తట్టా, బుట్టా సర్దేస్తారు. వ్యాపార సంస్థలు, కార్యాలయాలు  కూడా సాయంత్రం 1800 కల్లా ముసుగు తన్నేయాల్సిందే. సాయంత్రం 1900 గంటలలోపు రాత్రి బోజనం కూడా అయిపోతుంది. ఆ తర్వాత అలా టీవీ ముందు కాళ్ళు చాపుకొని కూర్చొని బీరు గానీ వైను గానీ చప్పరిస్తూ సరదాగా కబుర్లతో గడిపేస్తారు.


లాహిరి, లాహిరి , లాహిరి లో...


ఇక పోతే, పని గంటల విషయం లో కూడా మరీ ఖండితంగా వుంటారు.రోజుకు 9 గంటల చొప్పున వారానికి 36 గంటలు (అంటే వారానికి నాలుగు రోజులే) పనిచేయాలి. ఆపైన పని చేసిన ప్రతీ నిమిషం ఓవర్‌టైము కిందే లెక్క. సాదారణంగా సోమ, మంగళవారం పనిచేసి మళ్ళీ బుధవారం సెలవుతీసుకుంటారు. మళ్ళీ గురు, శుక్ర వారాలు కాస్త వొళ్ళొంచితే ఇక వారాంతమే. ఎక్కువ మంది శుక్రవారం సాయంత్రమే వారాంతం గడపడానికి తమకు నచ్చిన చోటుకు వెళ్ళిపోతారు.


చౌకధరల షాపులు, చక్కనైన షోకులు..


ప్రపంచంలోని అత్యంత ధనిక దేశాల్లో ఒకటైన నెదర్లాండ్స్ లో ఆయుధ సంస్కృతి పెద్దగా లేదు. ఎవరైనా సరే, ఎంత అర్ధరాత్రి వేళయినా నిర్భయంగా కావలసినచోటుకు వెళ్ళొచ్చు. అన్నట్టు ఇక్కడ దాదాపు అన్ని రకాల మాదకద్రవ్యాలు కూడా స్వేచ్చగా షాపుల్లో అమ్ముతారు. వ్యభిచారం కూడా చట్టబద్దమైన గౌరవనీయమైన వ్యాపారమే. చాలా దేశాల్లో వ్యభిచారం పొట్టకూటికోసం జరిగితే, ఇక్కడ మాత్రం మరింత విలాసవంతమైన జీవితం కోసం, థ్రిల్ కోసం, సరదా కోసం జరుగుతుంది.


గారడీ వీరులూ ఇక్కడా వుంటారు మరి!


ఇక్కడి విలాసవంతమైన జీవితానికి నిదర్శనమా అన్నట్టు, చాల మంది స్థానికులు ఏవైనా కొత్త వస్తువులు కొనగానే, తమ పాత వస్తువులను ఇంటి ముందు వదిలేస్తారు. అలా వదిలేసిన వస్తువులలో పూర్తి స్థాయిలో  పని చేసే పెంటియం లాప్‌టాపులు, ఫ్లాట్ స్క్రీన్ టెలివిజన్లూ, మైక్రోవేవ్ ఓవెన్లతో పాటు మంచి ఫర్నీచర్లు ఇంకా మరెన్నో గృహోపయోగమైన వస్తువులూ వుంటాయి.  ఉదయమే వచ్చే మున్సిపాలిటీ (ఇక్కడ ఏవంటారో మరి) వాన్ లో ఈ వస్తువులన్నీ క్రష్ అవుతుంటాయి.


రిక్షావాలా ధూమ్ ధామ్


సహజవనరులు అతి తక్కువగా వున్నా, ప్రగతిపథంలో మాత్రం ముందుకు దూసుకుపోయే ఈ దేశంలో ఆదాయం పన్ను కూడా చాలా ఎక్కువే. ఎలాంటి మినహాయింపులూ లేకుండా అందరూ తమ ఆదాయంలో 33.60% నుండి 52% వరకూ  వివిధ శ్లాబులలో అదాయం పన్నుగా కట్టాల్సిందే. అయితే ప్రభుత్వం కల్పించే సదుపాయాలు కూడా అందుకు ధీటుగా వుంటాయి. ఉదాహరణకు, నిరుద్యోగ భృతి సంగతే తీసుకోండి. ఏ కారణం వల్లనైనా, ఉద్యోగం కోల్పోయి నిరుద్యోగులైతే కోల్పోయిన ఉద్యోగం ద్వారా లభించే ఆదాయంలో  75% నిరుద్యోగ భృతిగా (గరిష్ఠంగా రోజుకు 177 యురోలు) లభిస్తుంది. [ ఒక వ్యక్తికి సరిపడే ఆహారం ఖర్చు నెలకు గరిష్టంగా 300-500 యూరోలు]


అదాయం పన్ను ��వనం, అంతా తెరిచిన పుస్తకం


అమ్‌స్టర్‌డామ్‌ లోని ప్రజలు తమ మాతృభాష డచ్ కు ఇచ్చే ప్రాధాన్యం కూడా అనన్యమైనది. దాదాపు ప్రతీ ఒక్కరు ఇంగ్లీష్ మాట్లాడగలిగి వుండి యాత్రికులుగా వచ్చిన వారికి సాద్యమైనంతగా సహాయం చేస్తారు. కానీ, వుద్యోగరీత్యా,వ్యాపార రీత్యా ఇంకా చదువురీత్యా, మరే ఇతర అవసరం రీత్యా అక్కడ నివసించే విదేశీయులు మాత్రం డచ్ భాష నేర్చుకోవలసిందే. డచ్ భాష ను ఉచితంగా నేర్పే శిక్షణా సంస్థలు కూడా వున్నాయి. ఒకటి రెండు సంవత్సరాలకు పైగా నివసించే వారికి తప్పని సరిగా డచ్ మాట్లాడటం వచ్చి వుండాలి లేకపొతే కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక  తప్పదు. ఉదాహరణకు, విమానాశ్రయంలో పాస్‌పొర్ట్, వర్క్ పర్మిట్ పరిశీలించేటప్పుడు  అక్కడి అధికారి మీరు అక్కడ చాలా కాలంగా వుంటున్నట్టు గమనిస్తే మీతో డచ్ భాషలోనే మాట్లాడతాడు. మీరు ఇంగ్లీష్ లో మాట్లాడటానికి ప్రయత్నిస్తే కుదరదు. అన్ని రోజులు నెదర్లాండ్స్ లో వున్నప్పటికీ ఎందుకు డచ్ భాష నేర్చుకోలేదనే ప్రశ్న ఎదుర్కోవాల్సి వస్తుంది. కేవలం డచ్ భాష నేర్చుకోని కారణంగా కోరిన సహాయం (తాత్కాలికంగా) నిరాకరించిన సందర్భాలు కూడా వున్నాయి. మన తెలుగు భాషా సంఘం వాళ్ళు ఇక్కడకొచ్చి భాషాభిమానం అంటే ఏవిటో నేర్చుకోవాలి అని నాకు ఎన్నిసార్లు అనిపించిందో.మరిన్ని ఇతర విశేషాలు తరువాయి భాగాలలో చదవండి.


ప్రకటనలు

2 Responses to అందమైన లోకమనీ “అమ్‌స్టర్‌డామ్‌” లా వుంటుందనీ….-2

 1. naren అంటున్నారు:

  అంతా బాగానే చెప్పారు కాని,విదేశాలనుండి ఇక్కడ వచ్చి పని చెసే మన లాంటి వాల్లకు ప్రభుత్వం ఒక మినహాయింపు ఇచ్చింది.
  మన ఆదాయంలో 30% కు టాక్స్ వుండదు.ఇది కూడా కేవలం 10 సంవత్సరాల వరకు మాత్రమె.ఇంకొక విషయం యేమిటంటె
  వీరు చాల డబ్బులు వున్నవాళ్ళు మాత్రం కాదు. అందరు కస్టపడి పనిచేసి సంపదించి మిగుల్చుకోకుండ తగలేస్తారు,ఎందుకంటె భవిష్యథు గురించి పెద్దగా అలోచనఅవసరం లేదు కాబట్టి.
  edo naaku telisindi cheppanu…kshaminchandi…:-)

  మెచ్చుకోండి

 2. Jayasri అంటున్నారు:

  mee article chaala bagundi…
  mukhyaMga andamayina lokamani…amsterdamla vuntundani…really variety title.
  Nice article.

  మెచ్చుకోండి

మీరేమంటారు ...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: