ఏకాంత వేళ, ఓ కాంత సేవ…

హమ్మయ్య, చాలా కాలానికి పని లేని సాయంత్రం దొరికింది కదా అని ఆనందంతో లాప్‌టాప్ షట్ డవున్ చేస్తుండగా, డెస్క్ టాప్ వాల్ పేపర్ పై నేను అతికించుకున్న వాక్యం “When was the last time you did something for the first time?” అని ప్రశ్నించింది. సరే, ఈ వారానికి ఏదైనా కొత్త పని ప్రయత్నించాలి అని అలోచనలతో ఇంటికి బయలుదేరాను. వూరు మధ్యలో చిన్న అపార్టుమెంటులో కన్నా,  వూరు పొలిమేరలో విశాలమైన ఇంటిలో నివసించడానికి ఇష్టపడతాను నేను.

ఇంటి చుట్టు చిన్న గార్డెన్, మధ్యలో ఒక వూయల, వూయల పక్కన, తపో దీక్షలో నిశ్శలంగా వున్నట్టు తెల్లగా  విరబూసిన నందివర్ధనం చెట్టు…

చిరు చలి ఉదయాలు, తేనీటి కబుర్లు…,
చిరు సాయంత్రాలు,  చిలిపి నవ్వుల దిగంతాలు,…
సన్న జాజులు, సరాగాలు,..
పున్నమి రాత్రులు, వెన్నెల జలకాలు,….
తలపుల నిండా వలపుల పంటలు…
మన ఒంటరి తనంలో మనసుల దగ్గరితనం,.
మనసుల దగ్గరితనం లో …,

అలోచనల్లో చూసుకోలేదు. అప్పుడే ఇంటికి వచ్చేశాను. కారు పార్క్ చేసి కాలింగ్ బెల్ నొక్కబోతుండగా, “వందనాలు , వందనాలు వలపుల హరి చందనాలు, వెన్నెల్లో వేచి వేచి వెచ్చనైన నా సామికి వందనాలు….” అని ఇంట్లోంచి పాట మధురంగా మొదలైంది. కాలింగ్ బెల్ నొక్కడం మానేసి అలా రెయిలింగ్ పట్టుకొని నిలబడిపోయి నేను కూడా “కన్నులలో నీళ్ళు నిలిచి చల్లనైన నా దేవికి వందనాలు …” అంటూ కోరస్ అందుకున్నాను…,

నా గొంతు వినింది కాబోలు, తలుపుకు లోపలి వైపున గడి తీస్తున్న చప్పుడు అవగానే, నేను ఓ పక్కకు దాగున్నాను. తను తలుపు తీసి, ఏవరా అని చూడబోతుంటె, నేను ఒక్క సారిగా గుమ్మం ముందుకు వస్తూ విఠలాచార్య సినిమాలో లాగా అరిచి భయపెట్టబోయాను. తను ఒక్కసారి గగుర్పాటుతో వెనక్కి తగ్గి, అంతలోనే చిరునవ్వుతో మళ్ళీ ముందుకు వస్తూ, “అయితే మీరన్న మాట..” అంది.

ద్వారానికి ఓ ప్రక్కగా భుజం తాకేలా నిలబడి, ఓ చేత్తో, నడుముకి పమిట దోపుకుంటూ మరో చేత్తో గరిట తిరగేసి చేయిని చెక్కిట చేర్చి నా కళ్ళలోకి చూస్తూ వుంటే, నాలో ముప్పిరిగొన్న బావనలేవో ప్రజ్వరిల్లి, “కదలొద్దు, నీకు ఇప్పుడు అర్జంటుగా ఒకటి ఇవ్వాలి అని వుంది.” అంటూ తన దగ్గరికి జరిగాను. నా శ్వాస వేడి తన వంటిపై ప్రతిఫలించి మళ్ళీ నన్ను చేరుతుందన్నంత దగ్గరగా రాబోతుంటె, మధ్యలోంచి తన చేయి, దానితో గరిటా పైకి లేచాయి.

ఇదేంటి పానకంలో పుడకల గురించి విన్నాను గానీ ఇలా సరసంలో గరిటల సంగతి ఎప్పుడూ వినలేదే అన్నాను వెనక్కి తగ్గకుండా. తను వెనక్కి జరుగుతూ, “ఏదో ఈ రోజు పౌర్ణమి కదా, శ్రీవారికి ఈ సాయంత్రం గార్డెన్‌లో వెన్నెల భోజనం ఏర్పాటు చేద్దామని పాపం నేనూ, నా గరిటా కష్టపడుతున్నాం.” అంది నుదిటిపై చెమటను తుడుచుకోవడాన్ని అభినయిస్తూ.

“వావ్, ఈ రోజు పౌర్ణమి కదూ. అయితే ఈ రోజు వెన్నెల భోజనాలు, మల్లెల కబుర్లు,.. Disappoited Cupనువ్వు ఊ అనాలే గానీ వంట మొత్తం నేనే చేసేయనూ.” అంటూ తన వెనకే కిచెన్ లోకి నడిచాను. తను హాట్- ప్లేట్ ఆన్ చేసి జీడి పప్పులు వేయిస్తూ, “ఇక చేయడానికి పని ఏమీ మిగలలేదు లెండి. సేమ్యా లోకి ఈ కాస్త చల్లితే చాలు”.

“మరి కిస్‌మిస్ లు వద్దా…” అర్థొక్తిలో  ఆగాను. తను వెనక్కు తిరిగి తనకు అలవాటైన సన్నని నవ్వుతో, “ఈ మాటలకేమీ తక్కువ లేదు,” అని అంతకు ముందే వేయించి పక్కన పెట్టిన ఎండు ద్రాక్షను నా నోటికందిస్తూ “కాస్త ఈ హాట్‌పాక్ లన్నీ గార్డెన్లో పెడుదురూ…” అంది.

“పెడతానుగాని మరి నాకేమిస్తావ్…” కనుబొమలెగరేస్తూ అడిగాను.

“ఎం కావాలేంటి?” అడిగింది వేయించిన జీడిపప్పు పక్కన పెడుతూ.

“నేను నీకు ఎప్పుడూ చెబుతాను చూడు, అలా నువ్వు నాకు చెప్పవా?..” సేమ్యా లో జీడిపప్పు కలుపుతూ గారం పోయాను నేను.

“ఏవిటో అది” ముసి ముసి నవ్వుతో ఆడిగింది మా ఆవిడ.

“అదే, చిన్న వాక్యం. మూడే మూడు పదాలు వుంటాయి. మొదటి పదంలోనేమో ఒక్క అక్షరమే, రెండో పదంలో నాలుగక్షరాలు, చివరి పదంలో మూడే అక్షరాలు..” అన్నాను నేను

“నేను చెప్పను బాబు, నాకు సిగ్గు ..” అంది దాచుకోలేని ముసిముసినవ్వుతో కిస్మిస్ సేమ్యా పై చల్లుతూ.

“ప్లీజ్, ప్లీజ్ ఓ సారి చెప్పవా…” మరింత గారం పోయేను నేను.

తను వరమిస్తున్న దేవతలాగా పోజు పెడుతూ, “ఇప్పుడు కాదు, రేపు పొద్దున నిద్రలేవగానే చెబుతాను, కానీ…” ఆగింది మా ఆవిడ,

వెలిగిపోతున్న కళ్లతో అడిగాను “ఆ, కానీ..”

“ఇప్పటి నుండీ, రేపు ఉదయం వరకూ అన్ని పనులు మీరే చేయాలి. నాకు అన్నం తినిపించడంతో సహా..” అంటూ చిన్న పిల్లలా కండిషన్ పెట్టింది.

“ఓస్ అంతేనా”, అన్నాను.

“అన్నం తినిపించాక కథ కూడా చెప్పాలి, మీ ఆఫీస్ కథలొద్దు!” అంది కొత్త కండీషన్ జతచేస్తూ.

“ఓ యస్ ” అని ఐదు నిమిషాల్లో స్నానం చేసి డ్రెస్ మార్చుకొని, మరో ఐదు నిమిషాల్లో భొజనం వడ్డించేసాను.

పండు వెన్నెల వేళ, చిరు చలి నేను కూడా వున్నానోచ్ అని కొద్దికొద్దిగా అప్పుడప్పుడూ వణికిస్తుంటే,  మా ఇంటి గార్డెన్లో ఊయల బల్లపై నెమ్మదిగా వూగుతూ,  చిన్నగా సంగీతం పెట్టుకొని

కాస్త కారం పప్పు, వేడి నెయ్యితో మొదలెట్టి, గుత్తొంకాయ కూరంతా ఒక గుక్కలో తినేసి, బెండకాయ వేపుడు, మునక్కాయల సాంబారు మురిపంగా మొదలెట్టి, మజ్జిగలో నానేసిన మిరపకాయలు అదరువుగా, గడ్డ పెరుగు ఇంకా ఎర్రటి ఆవకాయ.,

మారంగా వద్దంటూ తనూ, గారంగా తినిపించే నేనూ

..ఓహ్హ్,  చెప్పలేనంత రుచికరమైన జీవితం.

సేమ్యా తినిపిస్తూ అన్నాను నేను. “అన్నిట్లోకీ, సేమ్యా బావుంది కదా..”

“ఆవునా, ఎందుకని ?” ప్రశ్నార్థకంగా అడిగింది తను.

“చివర్లో నేను జీడిపప్పు వేసి కలిపాను కదా, అందుకు ..” అన్నాను.

పెదాలు బిగబట్టి, “నువ్వెప్పుడూ ఇంతే” అని గిల్లి  “..ఇప్పుడు కథ చెప్పు” అంటూ శాలువా కప్పుకొని వెనక్కి వాలి వూయలలో వూగసాగింది.

“అనగనగా ఒక మంచి రాజు, నాలాగా”  అని ఆగాను. నందివర్ధనం చెట్టు ఆకుల గలగలలు మానేసి  నిశబ్దంగా అయిపోయింది!

“ఊ,” అంది మా ఆవిడ. హాడావుడిగా మేఘాల్ని పక్కకి తరిమేసి చంద్రుడు తొంగి చూడ్డం మొదలెట్టాడు.

“ఆ రాజుకు ఏడుగురు అందమైన భార్యలు…” అని నేను ఇంకా చెప్పబోతుండగా

“ఈ కథ బాలేదు, వేరే కథ చెప్పు ” కళ్ళు పెద్దవి చేస్తూ అంది.

“సరే, ఆ రాజుకు ఒకే ఒక అందమైన భార్య, నీ లాగా”. ఈ సారి మేఘాలన్నీ కలిసి ఐకమత్యంగా చంద్రున్ని కమ్మేసాయ్.

“ఊ..” అంది తను.

“ఓ వెన్నెల రాత్రి, ఆమె రాజును ఓ కథ చెప్పమంది. అప్పుడు రాజు కథ ఇలా చెప్పడం మొదలెట్టాడు. ఆ కథ ఏమంటే..”

“ఊ..” అని అంటుండగా నేను తన దగ్గరికి జరిగాను. కథ వినడానికి కాబోలు, నెమ్మదిగా గాలి కూడా రావడం మొదలైంది.

“అనగనగా ఒక అనగనగా ఒక మంచి రాజుంటాడు, నాలాగా అని రాజు కథ మొదలెట్టాడు” నందివర్ధనం చెట్టుకు కథ అర్థమైనట్టుంది. ఆకులు గలగలలాడించడం మొదలెట్టింది.

“…ఆ రాజుకు ఒకే ఒక అందమైన భార్య, ఓ వెన్నెల రాత్రి, ఆమె రాజును ఓ కథ చెప్పమంది. అప్పుడు ఆ రాజు కథ ఇలా చెప్పడం మొదలెట్టాడు. ఆ కథ ఏమంటే..” గాలికి కూడా నేను చెప్తున్న కథ పూర్తిగా అర్థమైనట్టుంది. గట్టిగా వీయడం మొదలెట్టాడు.

“…అనగనగా ఒక రాజుంటాడు, …ఆ రాజుకు ఒకే ఒక అందమైన భార్య, ఓ వెన్నెల రాత్రి, ఆమె రాజును ఓ కథ చెప్పమంది. అప్పుడు ఆ రాజు …” అంటున్న నన్ను ఆపి “ఈ కథలో ఎంత మంది రాజులు వున్నారు ఇలా,” అడిగింది మా ఆవిడ.

“నువ్వు విన్నంత సేపు ఇలా రాజులు వస్తూనే వుంటారు అన్నాను నేను ఊయలలోంచి లేస్తూ …”

మేఘుడు కూడా ఫేటేల్మని నవ్వేడు. గాలి మరింత ఉధృతంగా నవ్వింది. నందివర్ధనం ఆకులు రాలిపోయెంతగా నవ్వింది.

“నిన్నూ, నిన్నూ,….” మా ఆవిడ నన్ను అందుకోవడానికి ప్రయత్నిస్తోంది. నెమ్మదిగా నడక పరుగుగా మారి, ఊయల చుట్టూ అందకుండా తిరుగుతూ నేను, నన్ను అందుకోవాలని తనూ.

“టప్”, వరుణుడు భుజం తడుతున్నట్టుగా  మొదటి చినుకు.

“హేయ్, వర్షం ” అంటూ మా ఆవిడ ఇంట్లోకి పరిగెడుతూ వుంటె, వెనకాలే నేనూ …” ఇంట్లోకి చేరే సరికి పూర్తిగా తడిసిపోయి,

తడిసిన తనువులతో, మురిసిన మనసులతో

అది

వర్షం కురిసిన రాత్రి, అమృతం విరిసిన రాత్రి.

*  *  *  *  *  *  *  *  *  *  *  *  *  *  *  *  *  *  *  *  *

పొద్దున్నే మా ఆవిడ కన్న ముందే నిద్ర లేచి, తనని నిద్ర లేపుతూ అడిగాను. “నాకు పొద్దున్నే చెబుతా అన్నావు కదా, ఇప్పుడు చెప్పు మరి” అని

“ఏదీ” అని ప్రశాంతంగా అడిగింది తను.

“అదే, ఇంగ్లీష్ లో ఒక చిన్న వాక్యం,  మూడే మూడు పదాలు వుంటాయి. మొదటి పదంలోనేమో ఒక్క అక్షరమే, రెండో పదంలో నాలుగక్షరాలు, చివరి పదంలో మూడే అక్షరాలు..” గడ గడ గా చెబుతూ గుర్తు చేసాను నేను.

“నిజంగా చెప్పాలా? ” గోముగా అడిగింది.

తప్పదు మరి, అన్నాను నేను వినడానికి సిద్దంగా.

“సరె” అని తను కళ్ళు మూసుకొని చెప్పసాగింది ” I …”

నేను ఓళ్ళంతా చెవులు చేసుకుని వింటున్నాను

“I…” మళ్ళీ అంది

ఆనందంతో నా గుండె వేగం పెరిగింది.

“I…” మళ్ళీ అంది.

ఈసారి గుండె వేగం రెట్టింపు అయింది.

“I Want Tea” అని “ఒక చిన్న వాక్యం,  మూడే మూడు పదాలు వుంటాయి. మొదటి పదంలోనేమో ఒక్క అక్షరమే, రెండో పదంలో నాలుగక్షరాలు, చివరి పదంలో మూడే అక్షరాలు  వున్నాయో లేదో కావాలంటే చూసుకో” అనేసి మళ్ళీ ముసుగు తన్నేసింది.

నా పరిస్థితి, ఇంకెందుకులెండి చెప్పడం!..

మా ఆవిడ ఇంతే, మరి మీ ఆవిడ…?  [పక్కనే వున్న లింక్ ను క్లిక్ చేయండి. నా తొలి కథను చదవండి.]

33 Responses to ఏకాంత వేళ, ఓ కాంత సేవ…

  1. Purnima అంటున్నారు:

    hahaha.. lovely!! enjoyed every bit of it!!కథ హైలైట్ అసలు.. indefinite loop. :-))

    Keep writing!!

    మెచ్చుకోండి

  2. Naga Muralidhar Namala అంటున్నారు:

    అదరగొట్టారు సార్. ఏంటో ఈ బ్లాగులు కొంతమంది వద్దురా సోదరా డోంట్ మేరీ అని, బద్రం బీకేర్ ఫుల్ బ్రదరు అంటారు. మరికొంతమంది ప్రేమయాత్రలకి బృందావనము అని పాడుతారు. మా లాంటి బ్రహ్మచారులకి చాలా ఇబ్బంది అయిపోతుంది. చివరగా ఏమంటారు చెప్పండి. సఖి సినిమాలో మాధవన్ లా మీరూ మా వలె అంటారా?

    మెచ్చుకోండి

  3. ప్రసాదం అంటున్నారు:

    నెనర్లు పూర్ణిమ గారు,

    నాగమురళిగారు, అయితే మీరింకా బ్రహ్మచారేనన్నమాట, తొందరగా పెళ్ళి చేసుకొని మా గుంపులోకి వచ్చేయండి. హన్నా, మీరు అంత సంతోషంగా వుంటే మేము చూస్తూ వుండలేము సుమా! 😉

    సఖి సినిమా నేనింకా చూడలేదు కాబట్టి ఇప్పుడే ఏమీ చెప్పలేను.

    ప్రసాదం

    మెచ్చుకోండి

  4. ప్రవీణ్ గార్లపాటి అంటున్నారు:

    ఓ చాన్నాళ్ళకు కనిపించారు…
    ఎంతయినా మీరు భలే రొమాంటిక్ సార్ 😉

    మెచ్చుకోండి

  5. గిరీష్ అంటున్నారు:

    అదిరిందయ్యా..ప్రసాదూ!

    మెచ్చుకోండి

  6. Manasa అంటున్నారు:

    Chal Romatic ga vundi 😉

    Keep it up!

    మెచ్చుకోండి

  7. meenakshi అంటున్నారు:

    చాలా బా రాసారు..ఒక్కమాటలో చెప్పాలంటే…
    అదిరింది మాస్టారు ……..:)

    మెచ్చుకోండి

  8. జ్యోతి అంటున్నారు:

    మీలాగే నేను మీఆవిడ ముద్దుగా ఆ పదాలు చెప్తుందనుకున్నా.కాని ఎంతైనా ఆదవాళ్లం కదా. అంత తేలిగ్గా దొరికిపోతారా? పాపం ప్రసాదం/…

    మీఆవిడ చెప్పింది చూడగానే గట్టిగా నవ్వేసాను. చుట్టుపక్కల ఎవ్వరూ లేరు కాబట్టి బ్రతికిపోయా. లేకుంటె నాకు పిచ్చిపట్టింది అనుకునేవాళ్ళు. హహహ..

    మెచ్చుకోండి

  9. శివ అంటున్నారు:

    ఎక్కడికో తీసుకు పోయారు…. బాగుంది ..:)

    మెచ్చుకోండి

  10. tejashreyus అంటున్నారు:

    I Want Tea….. kathalo manchi twist icharu……. anduke annaru adavari matalaku arthaley veruley ani……..

    మెచ్చుకోండి

  11. రాజేంద్ర అంటున్నారు:

    మరి ఆవిడ ప్రసాదం గారి శ్రీమతి ఆపాటి జర్లులివ్వరామరి!!!

    మెచ్చుకోండి

  12. Syama sundaram అంటున్నారు:

    హాయ్ సార్
    న సొంత సమస్య సాధనకు మీ ప్రతిస్పందన పత్రాన్ని వాడుకుంటున్నందుకు క్షమించాలి. దయచేసి నా సమస్య సాధనకు తగిన సలహ ఇవ్వగలరు.
    నా సమస్య ఏమిటంటీ మీ కూడలి లో నా బ్లాగ్ ను ప్రదర్షించాలనుకుంతున్నాఆను కాని అది నాకు సాద్యం కావదం లేదు దయ చెసి నాకు గల
    కి తగిన సలహాలు ఇచి సహకరించ గలరు my mail id madhuchi2008@gmail.com

    మెచ్చుకోండి

  13. Arun అంటున్నారు:

    Wellcome back sir!! You are rocking again.

    మెచ్చుకోండి

  14. RSG అంటున్నారు:

    మాష్టారూ, చిరకాల దర్శనం… ఏమిటి కామెడీ వదిలేసి రొమాన్స్ ట్రై చేస్తున్నారా… బావుంది 🙂

    మెచ్చుకోండి

  15. ప్రతాప్ అంటున్నారు:

    భార్యాభర్తల మధ్య ఉండే బాడీ కమ్యూనికేషన్ సహజ సిద్ధంగా ఏర్పడుతుంది. అలాంటి సహజసిద్దమైన కమ్యూనికేషన్ ని నేను మణిరత్నం గారి సినిమాల్లో, కృష్ణవంశీ గారి సినిమాల్లో మాత్రమే చూసాను. ఇక పొతే చదవడం అంటారా? మీ కథలో మాత్రమే చదివాను. నాకో మంచి కథ రాయడానికి అనువైన ఉపాయాన్ని అందించారు. అందుకు కృతజ్ఞతలు.

    మెచ్చుకోండి

  16. ప్రసాదం అంటున్నారు:

    ప్రవీణ్ గారూ,

    రాయడానికి కుదరలేదు గానీ, కూడలి చుట్టుపక్కలకి అప్పుడప్పుడూ వస్తూనే వున్నాను. మీ అభిమానానికి ధన్యవాదాలు.

    గిరీష్ గారూ, మానస గారూ, మీనాక్షి గారూ,

    నెనరులు

    జ్యొతి గారూ,

    నా తంటాలన్నీ చదివి ఫక్కున నవ్వారన్నమాట,:-D సంతోషం.

    శివ గారూ, తేజ గారూ,

    నెనరులు

    రాజేంద్ర గారూ,

    నా మీద సానుభూతి చూపుతారు అనుకున్నాను కానీ, ఇలా పార్టీ మారుస్తారనుకోలేదు 😦

    ఉత్తినే సరదాకు అన్నాను లెండి. 😉

    శ్యామ సుందరం గారూ,

    http://koodali.org/add అన్నలింక్ లో చూడండి, మీకు పూర్తి సమాచారం దొరుకుతుంది.

    ఇక పోతే, నా కూడలి అంటూ ఎమీ లేది. ఇది మనందరి కూడలి. వీవెన్ గారి మానస పుత్రిక.

    అరుణ్ గారూ,

    నెనర్లు.

    RSG గారూ,

    హమ్మయ్య, రొమాంటిక్ కామెడీ కూడా చెయ్యగలనన్న మాట. నెనర్లు.

    ప్రతాప్ గారూ,

    మీ కామెంటు చూసి చాతీ రెండు అంగుళాలు పొంగింది. 🙂 చాలా నెనరులు, [మనసులో ఏ మూలో పీకుతుంది, నన్ను మునగ చెట్టు ఎక్కిస్తునారేమో అని? ఎక్కితే ఎక్కాను లెండి, ఈ ఒక్కసారే కదా!]

    ఏవిటో, “వారెవా ఏమీ ఫేసు, అచ్చం హీరొలా వుంది బాసు …” పాట కూడా మరీ మరీ గుర్తొస్తుంది. 😉

    మీ అభిమానానికి అనేక నెనర్లు.

    మీరు కథ రాసిన తర్వాత నాకు చెప్పడం మరవకండేం? నా కథ లోంచి అయిదియా వచ్చిన కథ ఎలా వుంటుందోనని గొప్ప ఆసక్తిగా వుంది.

    మరోసారి నెనర్లు.

    ప్రసాదం

    మెచ్చుకోండి

  17. […] ఒక బ్లాక్మైలు…నేను ఇప్పుడు “రొమాన్సు” అనే పదానికి అర్ధం […]

    మెచ్చుకోండి

  18. ఏకాంతపు దిలీప్ అంటున్నారు:

    ప్రసాదం గారు,
    మీలో నన్ను చూసుకున్నానండి… చాలా బాగుంది… బ్లాగుల్లో మొదటిసారి ఒక రమణీయమైన దృశ్య కావ్యాన్ని చదివాను..

    మెచ్చుకోండి

  19. Raja అంటున్నారు:

    ప్రసాదంగారు, ఏమీ అనుకోకపోతే… చిన్న కంప్లైంటు… మీరిన్నళ్ళూ “మా ఆవిడ ఇంతే… మరి మీ ఆవిడ?” మకుటంతో రాసిన టపాలన్నింటితో నాకు ఆవిడంటే ఒక 30-something and a bit insecure,posessive woman ఇమేజ్ ఏర్పడింది. దానివల్ల ఈ టపా కొద్దిగా awkward గా అనిపించింది.

    May be its just me… Nevermind.

    మెచ్చుకోండి

  20. radhika అంటున్నారు:

    వాహ్…మీ కవిత్వ0లో చూపి0చేటువ0టి భావుకత వు0ద0డి ఇ0దులో.నిజమే ఇది ఒక దృశ్యకావ్య0.ఇది చదవగానే నాగు గుర్తొచ్చిన పాట “మనసున మనసై బ్రతుకున బ్రతుకై…తోడొకరు0డిన అదే స్వర్గమూ….అదే భాగ్యము”

    మెచ్చుకోండి

  21. విహారి అంటున్నారు:

    ఒక్కో సారంతే. జరగనివి జరిగినట్టు, జరిగినవి జరగనట్టు ఊహించుకోవాలి. అప్పుడే ఏమయింది. పిల్లలు పుట్టనీ. తరువాత అన్నీ ఇలాంటివే. రాసుకోని దాచుకోని చదువుకొని సంతోషపడాలి.

    బొత్తిగా నల్ల పూసయిపోయారంటే ఇలాగన్న మాట. మరీ ఎక్కువగా ఉయ్యాల బల్ల చుట్టూ పరిగెత్తకండే.

    — విహారి

    మెచ్చుకోండి

  22. కె.మహేష్ కుమార్ అంటున్నారు:

    చాలా బాగుంది.

    మెచ్చుకోండి

  23. ప్రసాదం అంటున్నారు:

    దిలీప్ గారూ,

    మీ అభిమానానికి సంతోషం. నెనర్లు.

    రాజా గారూ,

    ముందుగా మీ సునిశిత దృష్టిని అభినందిస్తున్నాను. మీరు చెప్పిన పాయింటు అర్థమైంది కానీ, ముప్పై సంవత్సరాల తరువాత రొమాన్స్ వుండకూడదని ఏమీ లేదు కదా! రెండవదీ, ముఖ్యమైనది ఏమంటే, నా ఇతర కథనాలు అన్ని కలిసి మీకు [ఆవిడ] పాత్ర పై ఒకే రకమైన అభిప్రాయాన్ని కలిగించాయంటే, నేను కథనం లో చాలా వరకు సఫలున్ని అయినట్టే. మీ అభిప్రాయాన్ని వ్యక్తీకరించినందుకు నెనర్లు.

    రాధిక గారూ,

    నెనర్లు, చాలా మంచి పాటను గుర్తు చేసారు.

    విహారి గారూ,

    ఇది అన్యాయం, మీరేదో నన్ను మరింతగా భయపెడుతున్నారు. 😉

    ఉయ్యాల బల్ల చుట్టు తిరగడం వల్లె నల్ల పూస అయిపోతున్నానంటారా?

    మహేశ్ కుమార్ గారు,

    నెనర్లు

    మీ
    ప్రసాదం

    మెచ్చుకోండి

  24. నిషిగంధ అంటున్నారు:

    “వెన్నెలలో వేచి వేచి వెచ్చనైన నా స్వామికి.. వందనాలు” ఆహా! ఏం పాటకదండీ!

    మీకాంత సేవ చాలా బావుందండీ! ఎండింగ్ మాత్రం సూపర్ 🙂

    మెచ్చుకోండి

  25. Srividya అంటున్నారు:

    బాగా రాసారు.కథ చదువుతుంటే వెన్నెల్ని కన్నుల నిండా నింపుకున్నట్టు అనిపించింది.

    మెచ్చుకోండి

  26. ప్రసాదం అంటున్నారు:

    నిషిగంధ గారు

    చాలా అద్బుతమైన పాట. తరచుగా వింటుంటాను. ఇది రాసేటప్పుడు ఓ పది సార్లైనా ఈ పాట వినుంటాను.

    శ్రీవిద్య గారు,

    వాఖ్యకు ధన్యవాదాలు

    మీ
    ప్రసాదం

    మెచ్చుకోండి

  27. ramani అంటున్నారు:

    కాస్త ఆలస్యంగా అయినా అభినందనలు ప్రసాదం గారు. చాలా చాలా బాగా రాసారు ఏక బిగిన చదివాను. నిజంగా ఏకాంత వేళ ఓ కాంత అనేసరికి మా ఆడవాళ్ళ ఆలోచనలు ఎక్కడికో వెళ్ళిపోతాయి. మీరు ఏ ‘కాంత ‘ సేవా కాకుండా మీ ‘కాంత ‘ సేవ గురించే చెప్పడం సుపర్బ్. ‘ఐ లవ్ టీ ‘ ట్విస్ట్ బాగుంది.

    మెచ్చుకోండి

  28. […] ఓ కాంత సేవ అంటూ ప్రసాదం శృంగార రసాత్మక టపా ఒకటి […]

    మెచ్చుకోండి

  29. Subramanyam Naidu అంటున్నారు:

    ప్రసాదం గారు చాల రమణీయంగా వ్రాసారు చాల కాలం తరువాత మంచి రసవత్తరమైన కథ చదివాను థాంక్స్… మరిన్ని కథలు మీ బ్లాగు నుంచి జాలువారతాయని ఆశిస్తు సుబ్రమణ్యం నాయుడు.

    మెచ్చుకోండి

  30. Vamsi అంటున్నారు:

    too good….:)

    మెచ్చుకోండి

  31. […] నన్ను inspire చేసిన ప్రసాదం గారికి కూడా […]

    మెచ్చుకోండి

  32. kumar అంటున్నారు:

    keka

    adbhutham

    prasadam gaaru.

    మెచ్చుకోండి

  33. kishan rao అంటున్నారు:

    sorry andi e blog ki pampalsina responce “nattadavilo…….” ki vellindi chalabaundadi

    మెచ్చుకోండి

మీరేమంటారు ...