ఒక బుధవారం, రావాలి ప్రతివారం…



దాదాపుగా లొసుగులు లేని మంచి పటుత్వంతో అల్లుకున్న కథ, వీక్షకులను మునివేళ్ళపై నిలబెట్టే కథనం వూహించని ట్విస్టులు, నిరుపమానమైన నటన వెరసి అద్భుతమైన చిత్రం చూసిన అనుభూతి. ఇదీ ఈ వారం విడుదలైన “A Wednesday” చిత్రం తాలుకూ సమీక్ష సంగ్రహం.


ఒక బుధవారం, రావాలి ప్రతివారం...

పదవీ విరమణ చేయబోతున్న ఒక పోలిస్ అధికారి (అనుపం ఖేర్) తన పూర్తి వృత్తి జీవితంలో అత్యంత ఆసక్తికరమైన, ఎక్కడ ఎలాంటి రికార్డులలో కూడా నమోదు కాకున్నా అత్యంత సవాలుగా నిలబడ్డ కేసు వివరాలు చెబుతుండగా చిత్రం అసలు కథ ప్రారంభం అవుతుంది. ఓ బుధవారం రోజు ముంబై పోలీస్ కమీషనర్ కార్యాలయం దగ్గరలో వున్న పోలిస్ స్టేషన్లో RDX బాంబును ప్లాంట్ చేసిన ఓ టెర్రరిస్టు (నసిరుద్దీన్ షా) ముంబై లో మరిన్ని బాంబులు పేలడానికి సిద్దంగా వున్నాయి అని కమిషనర్ కు ఫొన్ చేయడంతో ఉలిక్కి పడిన పోలీస్ యంత్రాగం, సదరు టెర్రరిస్టు అసలు మంత్రాంగం, ఆ తరువాత జరిగిన నాలుగైదు గంటల ఉత్కంఠపూరితమైన కథ ఈ చిత్రం సొంతం.


దర్శకుడు నీరజ్ పాండే అద్బుతమైన్ స్క్రీన్-ప్లే తో తనదైన ముద్ర ను చూపించాడు. సినిమా పూర్తయిన తరువాత అనిపించింది, “నిజంగా ఇలా జరిగితే బావుండును” అని. సగటు ముంబై వాసి సమస్యను, టెర్రరిజాన్ని కలగలిపి తనదైన పరిష్కారాన్ని బిగి సడలని థ్రిల్లర్‌గా రూపొందించడం దర్శకుడికే చెల్లింది. పోలిస్ కమీషనర్‌గా అనుపం ఖేర్, టెర్రరిస్ట్(?)గా నసిరుద్దిన్ షా తమ పాత్రలలో జీవించారు. అన్నట్టు చిత్రంలో ఒక్క పాట కూడా లేదు అన్న విషయాన్ని చిత్రం అయిపోయిన కాసేపటికి గానీ నేను గుర్తించలేదు.


థ్రిల్లర్ చిత్రం కాబట్టి ఇంతకన్న ఎక్కువ చెప్పడం వీక్షకుల ఆనందాన్ని పాడు చేయడమే అవుతుంది. సందేహం లేకుండా థియేటర్ లో చూడదగిన చిత్రం “A Wednesday”..


చూడబోతే భారతీయ సినిమాకు మంచిరోజులు వస్తున్నట్టు వున్నాయ్. ఇలాంటి చిత్రం వారానికి ఒకటి వస్తే భారతీయ సినిమాకు పండగే కదా, అందుకే (“A Wednesday”) ఒక బుధవారం, రావాలి ప్రతివారం….


నా రేటింగ్ 4.0/5.0.


3 Responses to ఒక బుధవారం, రావాలి ప్రతివారం…

  1. కె.మహేష్ కుమార్ అంటున్నారు:

    నిజమే..భారతీయ సినిమాకు మళ్ళీ మంచి రోజులొచ్చినట్లు గత రెండువారాలూ సూచించాయి. కానీ ఈ చోప్రాలూ జొహర్లూ వుండగా కొన్ని కష్తాలు మాత్రం తప్పవు.

    మెచ్చుకోండి

  2. Manasa అంటున్నారు:

    cinimala gurinchi antha avagahana ledu kani, ye cinima ni thappaka chustanu…………………

    మెచ్చుకోండి

  3. ప్రతాప్. అంటున్నారు:

    ప్రసాద్ గారు, కధ రాసిన తర్వాత చెప్పమన్నారు కదా? మీరిచ్చిన స్ఫూర్తితో రాసేసా. చదివి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియ చెయ్యండి. మిమ్మల్ని అనుసరించకుండా రాసేదానికి తెగ ప్రయత్నించాను, అందులో విజయం సాధించానో లేదో మీరే చెప్పాలి మరి.

    మెచ్చుకోండి

మీరేమంటారు ...