నట్టడవులు నడివీధికి నడిచొస్తే ఇంతే!



దాదాపు నాలుగున్నర ఏళ్ళ క్రితం



ఆంధ్రప్రదేశ్ లోని ఒక ప్రఖ్యాత విశ్వవిద్యాలయం లో కాంపస్ సెలక్షన్లు జరుగుతున్నాయి. ఒక ప్రతిష్టాత్మక కంపనీ తరపున వచ్చిన ఎంపిక బృందంలో నేను సభ్యున్ని. యూనివర్సిటీ పరీక్షల్లో అరవై శాతం దాటిన వాళ్ళకు టెక్నికల్ ఇంటర్వ్యూ. పేరుకు టెక్నికల్ ఇంటర్వ్యూ అయినా మా పరిశీలన అంతా అభ్యర్థుల కమ్యునికేషన్ స్కిల్స్, లాజికల్ ఎబిలిటీ లాంటి ఆంశాల పైనే.



ఇంటర్యూ చేయాల్సిన వాళ్ళందరిని పంచుకుంటె నాకొచ్చిన వాటా దాదాపు 20 మంది. నాతో సహ ఎంపిక బృందం సభ్యులందరికి తలా ఒక గది ఇచ్చి ఒకొక్క అభ్యర్థినీ వరసగా పంపడం మొదలెట్టారు.ఇంటర్వ్యూ తగలేసిన ఎనిమిదోవాడినో తొమ్మిదోవాడినో తన్ని పంపించేసి ఒళ్ళు విరుచుకుంటుంటే తలుపు తడుతూ “మే ఐ కమిన్ సర్” అన్న మధుర స్వరం. ఎవరో చూడ చక్కని అమ్మాయి. రమ్మని చెప్పగానే నెమ్మదిగా తలుపు మూసి వచ్చి నా ముందు నిలబడింది. చక్కని పంజాబీ డ్రెస్ తో నిండైన వస్త్రధారణ-ఇంటర్వ్యూ కోసం అని కాకుండా మామూలుగా కూడా ఒద్దికగా సాంప్రదాయబద్దంగా ఉండే అమ్మాయిలా అనిపించింది. కానీ మొహంలో మాత్రం టెన్షన్. అది మామూలే కదా. ఆమెను కూర్చొమని చెబుతూ బయోడేటా కోసం చేయి చాచాను. ఆమె అందించిన బయోడేటా ప్రాజెక్టు రిపోర్టూ చూస్తూ తన గురించి చెప్పమన్నాను.



మధ్య తరగతి కుటుంబం-తల్లీదండ్రులిద్దరూ వుద్యోగులు-చాలా కష్టపడి చదివించారు-చిన్నప్పటి నుండీ మార్కులు ఎనభై శాతం పైనే వున్నాయి.(నాకు కూడా అన్ని మార్కులు రాలేదు)



స్నేహ పూర్వక వాతావరణంలో అభ్యర్థుల పరిజ్ఞనాన్ని అంచనా వేయడమే కానీ వాళ్ళను ప్రశ్నలతో భయపెట్టడం మా లక్ష్యం కాదు కనుక ఏం సినిమాలు చూసావు,ఏ పత్రికలు చదువుతావు లాంటి ప్రశ్నలు కూడా వేస్తాము. అన్ని ప్రశ్నలకూ ఆ అమ్మాయి తలవంచుకొని నేల చూపులు చూస్తూ సమాధానం చెబుతోంది.



ఏతా వాతా తేలిందేమంటే ఆ అమ్మయికి పుస్తకాలు పరీక్షలు,మార్కులు తప్ప మరో ప్రపంచం తెలీదు.
8వ తరగతి నుంది ఇంటర్ అయ్యే వరకూ తనని వాళ్ళ అమ్మా నాన్నలు అకడమిక్ పుస్తకాలు తప్ప మరో పుస్తకం ముట్టుకోనివ్వలేదు. ఒక్క సినిమా కూడ చూడనివ్వలేదు. ఇంజనీరింగ్ లో మాత్రం కొన్ని సినిమాలు చూసిందట .


ఇక టెక్నికల్ చూసినా అంత పెద్దగా ఆకట్టుకోలేదు. పుస్తకాలలో వున్నది వున్నట్టు చెప్పగలుగుతోంది గానీ ఏ కాస్త ప్రశ్న మార్చినా
, జవాబుండదు.  ఇంటర్వ్యూ తగలేసిందని తనకీ కూడ అర్థం అయిపోతోంది.నేను ఇంటర్వ్యూ ముగించబోతూ “మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ” అని అడిగాను తన ప్రాజెక్ట్ రిపోర్టు తిరిగిచ్చేస్తూ.యస్ సర్” అంటూ కొద్దిగా తల పైకెత్తింది.


తన చేతులు వణుకుతున్నాయ్. అప్పుడే చేతులు కట్టుకొని – మళ్లీ వదిలేసి – చున్నీ లాగి ఒళ్ళో పెట్టుకొని -మళ్ళీ చేతులు కట్టుకొని – అరుణ మందారాలయిన కళ్ళను దాచుకోలేక – కాదు కాదు అంటున్న సాంప్రదాయపు విలువలను మునిపంటితో నొక్కిపెట్టె ప్రయత్నం చేస్తూ – ఒక నిశ్చయానికి వచ్చినట్టుగా – తన ఎద భాగం నాకు కనిపించేలా మరి కాస్త ముందుకు వంగి “నన్ను సెలక్ట్ చేయండి సార్. ఎక్కడికంటే అక్కడికి వస్తాను. మీరెలా అంటే అలా…నన్ను సెలక్ట్ చేయండి సార్..” అంది.
 


ఇంటర్వ్యూలలో తిరస్కరించబడిన వాళ్ళలో కొందరు కన్నీళ్ళు పెట్టుకోవడం
, ఏడ్చెయ్యడం మామూలే,అయినా ఈ పరిస్థితి నేను ఊహించనిది. “ముందు సరిగా కూర్చొండి. మంచినీళ్ళు తాగుతారా ” అంటూనీళ్ళగ్లాసు అందించాను.


తను మంచినీళ్ళు తాగి కొంచం స్థిమిత పడ్డాక మాట్లాడటం మొదలెట్టింది. “మా ఫ్రెండ్సందరూ సెలక్ట్ అయ్యారు – ఇంతవరకూ జరిగిన అన్ని కాంపస్ ఇంటర్వ్యూలలో రిజెక్ట్ అయ్యాను సర్ – ఇప్పుడు కూడ రిజెక్ట్ అయితే
మా ఇంట్లో నాకు వాల్యూ వుండదు


తన సమస్య నాకు అర్థమైంది.
 Identity Crisis. (గుర్తింపు కోసం తపన).[ గుర్తింపు కోసం తపన: ప్రతీ మనిషికీ వుండేదే.ఉండాల్సిందే కూడా. కానీ దేని వల్ల గుర్తింపు అనేదే సమస్య. ఆస్కార్ అవార్డ్ ద్వారా వచ్చే గుర్తింపు కోసం అమీర్‌ఖాన్ తపన పడతాడు. ఆడపిల్ల పక్కనుంటే వచ్చే గుర్తింపు కోసం ఇంకొకరు తపన పడతారు]


అన్ని సంవత్సరాల జీవితంలో ఆ అమ్మాయి తన తల్లిదండ్రులనుండి అర్థం చేసుకున్నదేమిటంటే “తమ ఇంట్లొ ఒక వ్యక్తిగా తనకన్నా
, తన వుద్యోగానికికే విలువెక్కువ ” అని. ఎంత దౌర్బాగ్యపు అవగాహన అది.


అహోరాత్రాలు శ్రమించి పైస పైసా కూడబెట్టి ఖరీదైన కాన్వెంట్ చదువులు చెప్పించి బంగారం లాంటి కూతుర్ని పుస్తకాలు బట్టీయం వేసి మార్కులు సంపాదించేలా మలిచి [చూసారా ఈ పనులన్నింటి వల్ల సమాజంలో సదరు కుటుంబానికి గొప్ప పేరొస్తుంది.  పిల్లల కోసం కష్టపడుతున్నారు అని పేరెంట్స్ కీ, చదివి మంచి మార్కులు తెచ్చుకుంటారు అని పిల్లలకు] ఉద్యోగం కోసం విలువల్ని అమ్ముకునేంత సంస్కారాన్ని ఇచ్చిన [ఈ సంగతి మాత్రం ఎవరికీ తెలీదు] ఆ తల్లి దండ్రులపై నాకు ఆసిడ్ పోయాలనిపించింది.

  

ఇది సమస్యకు ఒక పార్శ్వం. రెండో వంక మరీ విచిత్రం. కవసాకీ బైకిచ్చి, ఖర్చులకూ కొంతిచ్చి, కురాళ్ళను కాలేజీకి తోలేసి బాధ్యతయుతమైన తల్లిదండ్రులం మేముఅని జబ్బలు చరుచుకునే జాతి ఇంకొకటి వుంది. కుర్రాళ్ళకు (పిల్లలందరికీ కూడా) కావలసింది సరైన గుర్తింపు. తల్లిదండ్రులు గుర్తించలేదు కనుక ఆ గుర్తింపుని కవసాకి బైకులోనూ, కాలేజీ కాంటీన్లోను, క్యాషు కట్టల్లోనూ, ఆడపిల్ల బుగ్గ సొట్టల్లోనూ వెతుక్కు నే కుర్రాళ్ళు బోలెడు మంది.


మన పిల్లలకు కావలసింది మన గుర్తింపు. ఏ పరిస్థితిలో నైనా సరే ఇంట్లో
షరతులు లేని ప్రేమాదరణలు లభిస్తాయన్న నమ్మకం. డబ్బు కన్నా విలువైంది ఇంట్లొని మనుషులు అన్న అవగాహన.ఈ నమ్మకాన్ని తల్లిదండ్రులుగా మనం ఇవ్వగలిగితే, మన పిల్లలు, అబ్బాయిలు ఇచ్చే గిప్టుల కోసం వెంపర్లాడరు. అంగీకరించని అమ్మాయిల నెత్తిన ఆసిడ్ పోయరు.


వరంగల్ సంఘటనను నేను ఏ విధంగాను సమర్థించడం లేదు
, అలాగని విమర్శించడమూ లేదు. కాని జరిగిన సంఘటనలో పిల్లల తల్లిదండ్రుల పాత్రని మాత్రం మనం చాలా కన్వీనియంట్గా గుర్తించడం లేదుఅనేదే నా పాయింటు.దాడి చేసి ఆనక ప్రజా అగ్రహానికి గురై ఎంకౌటర్లో ప్రాణాలు పోగొట్టుకున ఆ అబ్బాయి దాడి సరిగ్గా జరగాలని అంతకు ముందు 17 సార్లు ప్రయోగం చేసాడని [which means he is a perfectionist] చదివి మనమంతా ఎంత దుర్మార్గుడు అనుకున్నామే గానీ , అతనిperfectionism సరైన పద్దతిలో గుర్తించబడి ప్రోత్సహించబడి వుంటే, ఈ కథ మరోలా వుండేదిఅని ఎవరూ అనుకోలేదే?   కని పెంచిన తల్లిదండ్రులు కాకపోతే పిల్లల శక్తులను, అభిరుచులను ఇంకెవరు గుర్తిస్తారు. [గాయపడిన ఒకఅమ్మాయి మాటలు జగ్రత్తగా వినండి. ఆమె తల్లిదండ్రులు ఇచ్చిన విలువలు ఎలాంటివో మీకు తెలుస్తోందా?]

 

మన పిల్లల కోసం సమయం కేటాయిద్దాం. వాళ్ళ శక్తి యుక్తులకు మనం గుర్తింపునిద్దాం. వాళ్ళ కన్నా విలువైందేమీ లేదని నమ్మకమిద్దాం. వాళ్ళ జీవితాలకు జీవాన్ని ఇద్దాం.

 


లేదా

 


నట్టడవులు నడివీధికి నడిచొస్తే 
ఇంతే
!

22 Responses to నట్టడవులు నడివీధికి నడిచొస్తే ఇంతే!

  1. కె.మహేష్ కుమార్ అంటున్నారు:

    మీరు చెప్పిన నిజం దాన్ని చెప్పిన పద్ధతి హృద్యంగా ఉన్నాయి. I completely agree with it.

    మెచ్చుకోండి

  2. Kumar అంటున్నారు:

    PrasadaM garu,
    నా మనసులో ఉన్న భావాలను సరిగ్గానే కాకుండా, బాగా కూడా చెప్పారు.
    I am in total agreement, especially on parents’ fault.

    పోతే, మీ ఇంటర్వ్యూ అమ్మాయి ఉదాహరణ, నాకు unbelievable. Do girsl really do like that?!!
    I guess helplessness stage నుంచి hopelessness స్థితికి జారిపోయే స్టేజి లో, తనకున్న చిట్టచివరి హోప్ అదే అనుకుని ఉంటుంది. పాపం.

    మెచ్చుకోండి

  3. వికటకవి అంటున్నారు:

    చాలా బాగా చెప్పారు. విభేధించే అవకాశమే లేదు.

    మెచ్చుకోండి

  4. ప్రసాదం అంటున్నారు:

    మహేశ్ గారూ, వికటకవి గారూ ,

    వాఖ్యకు నెనర్లు.

    కుమార్ గారు,

    ఇంటర్వ్యూ విషయం అక్షరమక్షరమూ నిజం. ఒత్తిడి (?) తట్టుకోలేక మనసాక్షికి నచ్చజెప్పలేక యాతన పడే వాళ్ళపై సానుభూతి చూపగలం కాని ఒళ్ళు కొవ్వెక్కి అలా ప్రవర్తించే వాళ్ళను చూసినప్పుడు ఏం చేయాలో అర్థం కాదు.

    వృత్తిపరంగా కొన్ని వందలమందిని ఇంటర్వ్యూ చేసాను నేను. ఇలాంటి సంఘటనలు చాలా తక్కువే, పది కన్నా తక్కువే.

    ప్రసాదం

    మెచ్చుకోండి

  5. Kumar అంటున్నారు:

    The font size for comments super tiny Prasad gaaru.
    Very hard to read them. Could you do something for them please?

    మెచ్చుకోండి

  6. ప్రసాదం అంటున్నారు:

    Unfortunately , I can not. WordPress limits comments fonts size on this theme. one temp alternative is increasing your browser text size for the time being.

    మెచ్చుకోండి

  7. శివ బండారు అంటున్నారు:

    చాలా బాగా చెప్పారు

    మెచ్చుకోండి

  8. రాకేశ్వర రావు అంటున్నారు:

    చాలా మంచి టపా, అందరూ ఆలోచించే కోణానికి భిన్నంగా వేఱే కోణం చూపించారు.

    మెచ్చుకోండి

  9. సిరిసిరిమువ్వ అంటున్నారు:

    “మన పిల్లల కోసం సమయం కేటాయిద్దాం. వాళ్ళ శక్తి యుక్తులకు మనం గుర్తింపునిద్దాం. వాళ్ళ కన్నా విలువైందేమీ లేదని నమ్మకమిద్దాం. వాళ్ళ జీవితాలకు జీవాన్ని ఇద్దాం”–ఇలాంటి సమస్యలకి ముందు కావలసింది ఇదే, అసలు సమస్యకి మూలమూ ఇదే.

    మెచ్చుకోండి

  10. రానారె అంటున్నారు:

    నిన్నటినుంచి టీవీలో మాట్లాడేవాళ్లంతా చంపడం మంచిపనే, అదే సరైన శిక్ష, ఇక భయమనేదే వుండదు అనేస్తున్నారు. నాకు నవ్వు వస్తూవుంది. బాధగా కూడా వుంది. చంపుతారేమో అనే భయంతో ఇలాంటివన్నీ సమసిపోతాయా!? తగ్గుతాయా? నేనసలు నమ్మను.

    యాసిడ్ పోయడం గురించే అందరూ మాట్లాడుతున్నారు. అది భయంకరమైన నేరమే, కాదనడానికి లేదు. కానీ వ్యవహారం అంతదూరం ఎందుకొచ్చిందో మాట్లాడేవారు ఏ ఒక్కరో ఇద్దరో వున్నారు! మనసులోని హింసాప్రవృత్తిని తేలికగా బయటకుతెచ్చే మనుషులు ఇన్ని కోట్లమంది జనాభాలో కొందరైనా వుంటారు, ఇవి మామూలేనని సర్దుకోవడానికి లేదు. దాడులు ఎక్కువవుతూనే వున్నాయి. చంపాలనుకునేవాడు సాధారణంగా ప్రాణానికి తెగించే వుంటాడు – తాత్కాలికంగా అయినాసరే. ఇలాంటి ఎన్‌కౌంటర్లతో పోలీసులతో ఈ ఆగడాలు ఆగవుగాక ఆగవు. పెరిగే అవకాశమే ఎక్కువ.

    ఏది సరయిన గుర్తింపు అంటూ మీరు చెప్పినదే సరైన పరిష్కారం. అందరూ ఆ అబ్బాయిల తల్లిదండ్రులకు పాఠాలు నేర్పడానికి బయల్దేరేవారే! అమ్మాయిల తల్లిదండ్రులు చాలా పరిణతితో వ్యవహరిస్తున్నట్లు! తల్లిదండ్రులుగా మసలడం ఎలాగో తెలీని అజ్ఞానమే మన సమాజానికి పడుతున్న పెద్ద చీడ.

    మెచ్చుకోండి

  11. వేణూ శ్రీకాంత్ అంటున్నారు:

    ” మన పిల్లల కోసం సమయం కేటాయిద్దాం. వాళ్ళ శక్తి యుక్తులకు మనం గుర్తింపునిద్దాం. వాళ్ళ కన్నా విలువైందేమీ లేదని నమ్మకమిద్దాం. వాళ్ళ జీవితాలకు జీవాన్ని ఇద్దాం. ”

    చాలా బాగా చెప్పారు.

    మెచ్చుకోండి

  12. Sri అంటున్నారు:

    @Kumar, It seems you are not working in India. I am working in MNC (financial sector). Middle class Indian girls psychology changed a lot. Recently we recruited a girl she has two years experience in IT sector. She is around 25 years ( North Indian girl ). She discusses how many cigarettes she used to smoke while studying B Tech, drinks she knows better than anybody else in my friends. Their selection of boyfriend reminds me Credit Card Company offers and balance transfers based on need.
    I used to read all those progressive books. My views are similar to you people. If you express our views to them, they will call us “PAPPU”. Now nobody will buy our views. First they will avoid our talk because we would ask them don’t smoke cigarettes and drink.
    This lady came from well educated * middle class * family back ground.

    మెచ్చుకోండి

  13. Kumar అంటున్నారు:

    Sri,
    Your guess is right. For the last 11 years, my nervous system didn’t get exposed to all socio/economic/political/moral-compass changes in India. My only exposure is news-paper headlines, and my brief visits to India. Hence, I am grossly incomptent to talk about current India.

    I didn’t have one girl in my class until my M.Tech. Edaari Jeevitam.
    Given what you said, I feel sad that I don’t belong to current generation to be surrounded by those girls that you mentioned :-)). Hey, I was just kidding.

    On a serious note, I stayed in Bombay about 4 years ago on an office trip. Those couple of months gave me a peak into current life-styles, but not much though. I still felt/feel that India is a conservative country esp our south-indian girls.

    Thanks for your reply.

    మెచ్చుకోండి

  14. మనిషిగా ఆలోచించు అంటున్నారు:

    […] బ్లాగరులు రాసిన జాబులను చదివాను. ప్రసాదం గారి జాబు నాకు బాగా నచ్చింది. ఆయన […]

    మెచ్చుకోండి

  15. madhura vaani అంటున్నారు:

    చాలా బాగా చెప్పారు. అందరి బుర్రలకీ సుళువుగా ఎక్కేలాగా..
    మీరు చెప్పిన ఇంటర్వ్యూ సంగతి.. కొంచెం షాకింగ్ గానే అనిపించింది. మీ విశ్లేషణ నిజంగా అద్భుతం.
    (చూసారా ఈ పనులన్నింటి వల్ల సమాజంలో సదరు కుటుంబానికి గొప్ప పేరొస్తుంది. పిల్లల కోసం కష్టపడుతున్నారు అని పేరెంట్స్ కీ, చదివి మంచి మార్కులు తెచ్చుకుంటారు అని పిల్లలకు)
    ఇది ఎంత నిజమో.. తొంభై శాతం పైన తల్లిదండ్రులు ఈ విషయాన్ని గుర్తించట్లేదు అనేది కూడా అంతే నిజం. ఎంతసేపూ.. క్లాసు ఫస్ట్ రావాలి, ర్యాంకులు రావాలి, ఫారిన్ వెళ్ళాలి. అందరి ముందూ గర్వంగా చెప్పుకోవాలి. అందుకే మా జీవితాల్ని ధారపోస్తున్నాం. అంటారే గానీ.. పిల్లల మీద వత్తిడి గురించి, వ్యక్తిత్వం గురించి ఆలోచించే సమయమే లేదు వాళ్లకి.
    అసలు అందరూ క్లాసు ఫస్ట్ ఎలా వస్తారు? అయినా ఫస్ట్ వచ్చేవాళ్ళే మనుషులా.. రాకపోతే ఇంక దేనికీ పనికిరారా? పిల్లల చదువు దగ్గరనుంచీ, పెళ్ళిళ్ళ దాకా.. ప్రతీదీ పరువు ప్రతిష్టల కోసం, అందరిలోనూ గొప్ప పేరు తెచ్చుకోడానికే తప్ప.. మన కోసం మనం బతకాలని ఎప్పుడూ ఆలోచించే సందర్భమే రాదు.
    మీరు చెప్పినట్టుగా తల్లిదండ్రులు కాస్త వేరే కోణాల్లో కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు..
    మీ చెప్పిన శైలి మాత్రం చాలా చాలా హృద్యంగా ఉంది.
    అభినందనలు.

    మెచ్చుకోండి

  16. మనిషిలా ఆలోచించు అంటున్నారు:

    […] బ్లాగరులు రాసిన జాబులను చదివాను. ప్రసాదం గారి జాబు నాకు బాగా నచ్చింది. అందరూ […]

    మెచ్చుకోండి

  17. krishna అంటున్నారు:

    “ఒక నిశ్చయానికి వచ్చినట్టుగా – తన ఎద భాగం నాకు కనిపించేలా మరి కాస్త ముందుకు వంగి “నన్ను సెలక్ట్ చేయండి సార్. ఎక్కడికంటే అక్కడికి వస్తాను. మీరెలా అంటే అలా…నన్ను సెలక్ట్ చేయండి సార్..” అంది.”
    ఆ లైన్లు చదివినప్పుడు, వెంటనే నాకు ఎదురయిన అదె సంఘటన కల్ల లో మెదిలింది ప్రసాదు గారు. చాల బాద వేసింది.ఒక్కప్పుడు ఆడవాళ్ళు తనకంటు ఉన్న గొప్ప ఔదార్యాన్ని, ఇప్పుడు జీవెతం లో కావల్శిన (జాబ్ లాంటి)చిన్న చిన్న విషయాలకి కొల్పుతున్నారు అని పించింది.ఒక్కొకసారికి అమ్మాయిల తో మట్లాడాలంటే బయంవేస్తుంది.
    ఏ దిశ గా మన సబ్యసమాజం పయనిస్తుందో ??? దీని గమ్యం ఎమిటో వేచి చూడాల్సిందే !

    మెచ్చుకోండి

  18. sridevi అంటున్నారు:

    hi prasadam garu

    nenu sridevi, mee blog eppude chusanu…..naku chala baga nachhindi…

    మెచ్చుకోండి

  19. kavirat అంటున్నారు:

    chaka chakkaga visadeekarincharu. Elanti sandarbhalu manaku akkadakkada kanipincheva. Intlo vallu pattinchukoni vadu thegina galipatam lanti vadu. ee sandarbhaniki inkoka parsvam kuda vundi. Mana pakkinti valla abbayi emcet lo state rank techukuntadu adi chusi manadu kuda ala techukovalani pulini chusi nakka vatha pettukunna chandam ga pillala brains wash chese vallu kuda ede kavaloniki vastaru.
    Chala mandi vadu chesadu kabatti manodu kuda cheyyali adi chusi manam chankalu guddukovali ani pasi jeevitalu nasanam chestuntaru.
    Kevalam vallu parents ane hakku to pasi moggala jeevitham nasanam cheastunnaru.

    మెచ్చుకోండి

  20. kumar అంటున్నారు:

    heart touching and nice told

    మెచ్చుకోండి

  21. kishan rao అంటున్నారు:

    sir chala baga chepparu.munduga parents lo maarpuvaste ika acid attacks undavu

    మెచ్చుకోండి

  22. kishan rao అంటున్నారు:

    megudu petlmani navvedu ee varnana chalabaaaaaaaaaaaaaaaaaaundandi

    మెచ్చుకోండి

మీరేమంటారు ...