నేనిదరిని, నువ్వాదరిని, మనసెంత తలచింది ఇద్దరినీ, మన ఇద్దరినీ…

మే 6, 2013మరవలేని జ్ఞాపకాలను మనసు ఊటయై తవ్వితీస్తే,
కనుల కొలనుల తడిసి కలము, గళముతో గమకాలూ రాస్తే,
జారిపోయిన కలలు ఎన్నున్నా, కలలు జారిన కథలు ఇంతేలే.
రాలిపోయిన ఊసులెన్నున్నా, రాసుకున్నఊహలింతేలే!ఇంతేలే, మధురోహలింతేలే, రాసుకున్నఊహలింతేలే.మర్చిపోలేని నీకు మనసు ఇచ్చే జ్ఞాపిక, నా ఈ జ్ఞాపకాల మాలిక.-–———————————————————————-కలనైనా, నిజమైనా
క్షణమైనా, దినమైనా
గతమైనా, సంగతమైనా
మతమైనా, సమ్మతమైనా“నువ్వు నాకు గుర్తు రావు” అని చెప్పడం అసత్యం. “నేను నీకు గుర్తురాను” అనడం అబద్దం. ఈ అసత్యానికి, అబద్దానికి పెట్టిన పోటిలో ఇరువురూ ఓడిపోయి, అవమానంతో జ్ఞాపకాల దొంతరలోకి దూకి ఒకరి ఉనికిని మరొకరు మర్చిపోతే;నిన్ను మరచిపోవాలని నే చేసిన ప్రతి ప్రయత్నమూ…కరిగి ఎదపై వాలి,
కన్నీరై కిందికి జారి,
కదలి గోదారిగా మారి,
కడలి వరదగా మరలిఉవ్వెత్తున ఎగసిన వలపు అల నను ముంచెత్తి, గుండె లోతుల్లోంచి జ్ఞాపకాల ఊటను తవ్వి తీస్తే,మనసు చెలమన
మనసు చెలిమిన
మనసు తెలిసిన
మనసు చెలియనమనసు చెలియన
చెలియ నీవని
నేను లేనని,
అసలు లేనని..కౌగిలి అంతా కరిగిరాగా,
కౌముది అంతా కమిలిపోగా ,
కాలమంతా కదలివచ్చి,
కనుల దాపున కలను దెచ్చి,ఊపిరద్ది, ఊసులద్ది,
తపముకొద్దీ తపనలద్దీ,
మనసుకొద్దీ మమతలద్ది
బాషనొదిలి భావమద్ది,పూలు చల్లి పుడమి తల్లి
దారులోదిలి దోసిలొగ్గితే
మాటలొద్దు, మౌనమొద్దు
మనకు మాత్రం మనసు హద్దుమనసు మనసును పలుకరించగా
మనసు మదినే పులకరించగానేనిదరిని, నువ్వాదరిని, మనసెంత తలచింది ఇద్దరినీ. మన ఇద్దరినీ!నీ నేను.


ప్రకటనలు

కను రెప్పల కౌగిలిలో, నును సిగ్గుల లోగిలి లో…

ఫిబ్రవరి 13, 2008

ప్రియమైన నీ,

          కనురెప్పల కౌగిలిలో, నును సిగ్గుల లోగిలి లో,
          కలలు కనే మనసును కాలం తో కదిపితే, కదిలే  నా ఆశలు …
          ఇలా,
          పరుచుకున్న అక్షరాలు,
          పరువపు విరి శరముల వ్రాలు..
 
          గుర్తుందా నీకు? జ్ఞాపకాల వర్షంతో విరిసిన ఆ రాత్రి,..

          నుదుట కుంకుమ బొట్టు పెట్టి,
          వలపు తలపుల చీరకట్టి,
          సిగ్గు పక్కన ఒగ్గి పెట్టి,
          బుగ్గ చుక్కన ముద్దు పెట్టి,

          గుర్తుందా నీకు? జ్ఞాపకాల వర్షంతో తడిసిన ఆ రాత్రి,..

          పలకరింతలే పులకరింతలై,
          నిలువరింతలే పలవరింతలై,
          కనులు కావ్యపు  కవితలల్లగా,
          పెదవి శ్రావ్యపు మరులు చల్లగా,
 
          గుర్తుందా నీకు? జ్ఞాపకాల వర్షంతో గడచిన ఆ రాత్రి,..

          పులకరింతలే పలకరింతలై,
          పలవరింతలే నిలువరింతలై,
          నే కౌముదిలో నిను చూచి,
          నీ కౌగిలిలో నను దాచి,

          గుర్తుందా నీకు? జ్ఞాపకాల వర్షంతో ఎగసిన ఆ రాత్రి,..

          పరవశమే పరిచయమై,
          పరువంలో విరి శరమై,
          మనసంతా నీ వశమై,
          మది అంతా పరవశమై,
 
          గుర్తుందా నీకు? జ్ఞాపకాల వర్షంతో ముగిసిన ఆ రాత్రి,..

          నువ్వూ నేనూ ఒక స్వరంగా
          నువ్వే నాకై ఒక వరంగా,
          నా మనసులో మిగిలుండనీ !
          నీ మనసుగా నను వుండనీ !!


లెక్కలేనంత ప్రేమతో,

నీ  కనురెప్పల కౌగిలిలో…

=======================================================

నాకు అందనంత దూరాన వున్న నీకు, “నన్ను” నేను అందించే ప్రయంత్నంలో,
ఇదంతా…

నన్నందుకుంటావని, ఎదకందుకుంటావని,,
ఆశతో…, అదే శ్వాసతో…

నేను 


%d bloggers like this: