చిక్కులిప్పగలవా బ్లాగరి,..లెక్క చెప్పగలవా?

ఏప్రిల్ 9, 2007

మా అంజి గాడు ఈ మధ్య ఒక చిక్కు లెక్క తెచ్చి నాకు తగిలించాడు. కాస్త జుట్టు పీక్కొని, (ఉన్నదే కాస్త లెండి) చిక్కుముడులన్నీ విప్పేను. ఆ ముళ్ళేవో మీరూ చూస్తారని ఇదిగో ఇక్కడ వేస్తున్నా. మరి కాచుకోండి.

16 – 36 = 25 – 45 అన్నది నిజమే కదా, 

రెండు పక్కలా (9/2)2 కలపండి 

16 – 36 + (9/2)2  =  25 – 45 + (9/2)2  

దీన్నే ఇలా రాసుకుందాం.  

(4)2  – 2 x 4 x (9/2)  +  (9/2)2    =   (5)2 – 2 x 5 x (9/2)  + (9/2)2 

ఇది   (a2 – 2ab – b2 ) రూపం లో ఉంది కద, దాన్ని, (ab)2 అని రాయ వచ్చు కదా, అందుకని

(4  –  (9/2))2    =   (5  – (9/2)2 

రెండు పక్కలా వర్గమూలం (square root) చేయండి.

 4  –  (9/2)   =   5  – (9/2) రెండు పక్కలా (9/2)   తొలగించండి. 4 = 5 ఏవంటారు మరి.  ఏక్కడో తప్పుందంటారా. చెప్పండి మరి.

 

ప్రకటనలు

%d bloggers like this: