ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి…

అక్టోబర్ 15, 2007

“….అండీస్ పర్వత శ్రేణుల్లో కూలిపోయిన విమాన శిథిలాలను కనుకొనడానికి గత పదకొండు రోజులుగా సాగిస్తున్న ప్రయత్నాలు సఫలం కాలేదు. మంచు పర్వతాల్లోని తీవ్రమైన చలి మూలంగా, కూలిపోయిన విమాన ప్రయాణికులలో ఎవరూ జీవించి ఉండే అవకాశాలు లేవని భావిస్తూ విమాన శిథిలాల కోసం వెదికే చర్యలను నిలిపి వేయాలని  మూడు దేశాల ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్ణయించాయి”. రేడియోను కట్టేస్తూ నిర్వేదంగా చుట్టూ మూగిన పదిహేను మందీ ప్రయానికులనూ చూసాడు రాయ్. అతను ఆ విమాన ప్రమాదం లో ప్రాణాలు దక్కించుకున్న  పదహారవ ప్రయాణికుడు. రోదనలు, ప్రార్థనలు నిశబ్దంగా మిన్నంటాయి. చుట్టూ విస్తరించిన మంచు పర్వతాల కన్నా దట్టంగా నిండిన విషాదం అందరినీ కమ్ముతుంటే, గుస్తావో నికోలెహ్ లేచి నిలబడి అందరి వంకా చూస్తూ అరిచాడు. 

కూలిన విమానంలో మిగిలిన ��ాగం.“ఇక లేవండి! మంచి అవకాశం మించిన దొరకదు. విన్నారుగా రేడియోలో, మన కోసం వెతకడం ఆపేసారు”. ఒకసారిగా అందరిలో ఘనీభవించిన నిశబ్దం.

“ఇది నీకు మంచి అవకాశంగా అనిపిస్తోందా? ” కోపంగా వెక్కుతు ఆడిగాడు ప్యెఏజ్. అతని కళ్ళు ఎర్రగా అంత విషాదంలోనూ  నిప్పులు కురిపిస్తున్నాయి.

“అవును. మనం స్వంతంగా ఇక్కది నుండి బయటపడబోతున్నాం. మనం చేసి చూపిద్దాం” అన్నాడు గుస్తావో ప్రశాంతంగా. అతని మాటలకు భయపడినట్టుగా, అక్కడి విషాదం మంచులా కరగడం మొదలెట్టింది. ఒకొక్కరూ కళ్ళు తుడుచుకున్నారు. స్థైర్యం కూడగట్టుకోవడం మొదలెట్టారు. 

                 *                                   *                                   *

గురువారం, 12 అక్టోబర్ 1972, కర్రాస్కో అంతార్జాతీయ విమానాశ్రయము;ఉరుగ్వే

మొంటేవిడో లోని స్టెల్లా మేరీస్ కాలేజ్ రగ్బీ టీం సభ్యుల ఉత్సాహమంతా విమానంలో పరవళ్ళు తొక్కుతోంది. ఉరుగ్వే వైమానిక దళం కు చెందిన విమానంలో చీలీ లోని సాటియాగో లో జరగబోయే రగ్బీ మాచ్ లో పాలు పంచుకోవడానికి బయలుదేరిన కురాళ్ళ జోరులో  విమానం హోరు చిన్నబోయింది. దాదాపు 800 మైళ్ళ ప్రయాణం తర్వాత ప్రతికూల వాతావరణ  పరిస్థితుల వల్ల అర్జెంటీనా లోని మెండోజాలో రాత్రంతా ఆగిపోయిన విమానం ఆ మర్నాడు 13 శుక్రవారం,మధ్యాహ్నం పూట ఉత్సాహాన్నంతా నింపుకుని తెల్లని అండీస్ మంచు కూలిన విమానం చివరగా ఇక్కడ నిలిచిపోయింది.పర్వత శ్రేణుల వైపు ఎగిరింది. ఏ మాత్రం దారి కనిపించనివ్వకుండా కమ్ముకుపోయిన తెల్లని మేఘాలు, తీవ్రమైన గాలుల మధ్య దారి తప్పిన విమానం ఆండీస్ పర్వతాల్లోని సన్నని లోయల్లోకి దూసుకుపోయింది. మరి కాసేపట్లో కన్నీటి హిమనదం గా పిలవబడే సెర్రో సెలేర్ కు ఢీకొన్న విమానం కుడి రెక్క విరిగి పడిపొయింది. చిగురుటాకులా ఊగుతున్న విమానం ఎడమపక్క రెక్క మరో మంచు కొండకు ఢీకొని నేలకు జారింది. నడి ఆకాశంలో రెక్కలు తెగి అదుపు తప్పిన విమానం ఓ పర్వత శిఖరాన్ని ఢీకొని, మంచు పై రాసుకుంటూ ఓ లోయలోకి జారిపోయి ఓ చివర నెమ్మదిగా నిలిచిపోయింది.

కూలిపోయిన విమానపు లోపలి బాగం ఇలా మిగిలింది

విమానంలోని నలభై ఐదు మంది ప్రయాణికులలో పన్నెండు మంది వెంటనే మరణించారు. మర్నాడు మరో ఐదుగురి వంతు. వారం తర్వాత మరొకరు. కనుచూపుమేరలో మానవమాత్రుడు గానీ మానవ సంచారం గానీ ఏమీ లెదు. ఎటుచూసినా తెల్లని మంచు పర్వతాలు. రక్తం గడ్డకట్టించే చలి గాలులు.  ఒక్కొక్కరిని మృత్యువు తాపీగా కబళిస్తోంది. మృతుంజయులైన మిగిలిన ఇరవయ్యారుగురి లోనూ తీవ్ర గాయాల వల్ల జీవితం కన్నా చావు బావుంటుందనే మానసిక పరిస్థితి. అండీస్ మంచుగాలుల నుండి రక్షించగల దుస్తులు, మంచులో నడవడానికి వీలయ్యే పాదరక్షలు, స్నో బ్లైండ్‌నెస్ ను ఆడ్డుకోగల సరంజామా ఎవరికీ లేవు. చుట్టూ మంచు పర్వతాలు, వణికించే చలి గాలి, మరణించిన సహచరుల మృతదేహాలు, ఇంకా ముక్కలైన విమానం, అంతే.

సన్ బ్లైండ్‌నెస్ నుండి కాపాడుకోవడానికి తయారుచేసుకున్న కళ్ళజోడు.అవసరం! అవసరం మనిషిని నడిపిస్తుండి. అదృష్టవశాత్తు (?) ప్రాణాలు దక్కించుకున్న 24 సంవత్సరాల మొదటి సంవత్సరం వైద్య విద్యార్తి ఫిటో, ఇంజనీరు అవతారం ఎత్తాడు. పైలట్ కాబిన్‌లోని నల్ల అద్దాలను, ఫ్లైట్ ప్లాన్ తాలూకు ఫైల్ ప్లాస్టిక్ కవర్‌నూ, కొన్ని  తీగ ముక్కలు ఇంకా ఓ ప్రయాణికురాలి బ్రా నుండి కత్తిరించిన ఎలాస్టిక్ పట్టీతో కలిపి కడితే సన్ గ్లాసెస్ తయారు.

ఇక నీరూ ఆహారం సంగతి. కూలిపోయిన విమానం లో కొన్ని చాక్‌లెట్లు, కొద్దిగా స్నాక్స్ ఇంకా కొన్ని వైన్ బాటిల్సు మిగిలాయి. విమానంలోని సీట్ల తాలూకూ లోహపు ముక్కలు బయటకు లాగి, వాటిపై మంచు ను ఉంచితే కరిగిన మంచుముత్యాలని బొట్టు బొట్టుగా పట్టుకొని ప్రాణాలు నిలుపుకున్నారు.

ఎంత పొదుపుగా ఉన్నా, ఆహారం మాత్రం అయిపోయింది. ఎంత వెతికినా తినడానికి ఏమీ దొరకలేదు. విమానం సీట్ల కు వున్న లెదర్, ఉహూ తినడం కుదరలేదు. సీట్ల లోపలి గడ్డి లాంటి పదార్థం ప్రయత్నించారు. ప్చ్ ,లాభం లేదు. వేసుకున్న బట్టలు తప్ప కడుపు నింపుకోవడానికి ఏమీ లేదు. తప్పదు, తప్పులేదు. ప్రాణం నిలుపుకోవడానికి చేసే ఏ పనీ పాపం కాదు. మరణించిన సహచరుల మృతదేహాల నుండి తీసిన మాంసం తినడం తప్ప వేరు దారి లేదు. దేవ దేవా, క్షమించు.

అక్టోబర్ 29. విమానం కూలి అప్పటికి పదహారు రోజులు. బతకడానికి ఒక్కో మార్గం మూసుకుపోతోంది.నిన్నటిదాకా తలదాచుకోవడానికి శిథిలమైన విమానం మాత్రం మిగిలింది, ఇప్పుడు అదీ లేదు. మంచు తుఫానులో కొన్ని అడుగుల లోతులో కప్పబడిపోయింది ఎనిమిది మంది సజీవ సహచరులతో పాటు.

మంచుతుఫాను చావు ధైర్యాన్ని ఇచ్చింది. మిగిలిన కొద్ది మంది జట్లు జట్లుగ విడిపోయి విమానం తోక భాగం కోసం అన్వేషణ మొదలెట్టారు. ఆహారం కోసం, విమానపు కుడి రెక్క విరిగినప్పుడు పడిపోయిన సహచరుల కోసం. పలు ప్రయత్నాల తర్వాత విమానం తోక భాగాన్ని కనుక్కోగలిగారు. చాలా సూట్‌కేసులు,కొంత ఆహారం, ఇంకా విమానం గొట్టాలలో వేడిని నష్టపోకుండా ఉపయోగించే ఇన్సులేషన్ పదార్థపు చుట్టలను సేకరించారు.  

కొండలపైకి నడుస్తూ వెళ్ళడం తప్ప వేరే దారి లేదు. కానీ ముఖ్యంగా రాత్రులు చలికి తట్టుకోవడం కష్టం. ఈ ఇన్సులేషన్ పదార్థం తో స్లీపింగ్ బాగ్స్ కుట్టగలిగితే,… యస్, దట్ విల్ బి ద సొల్యుషన్.చక చక, కుట్టడం ప్రారంభించారు. స్లీపింగ్ బాగ్స్ పూర్తయ్యే సరికి డిసెంబర్ వచ్చేసింది. అలాగే మరో సహచరుడికి మృత్యువు కూడా.

డిసెంబర్ 12, 1972 న పర్వతారోహణ ఆరంభమైంది. పర్వతాలపై ఉండే ఆక్సిజన్ స్థాయి చాలా తక్కువ. విపరీతమైన శ్రమ తో స్లిపింగ్ బాగ్ ని మోసుకుంటూ, మూడురోజుల తర్వాత పర్వతపు అంచును చేరుకుని అక్కడి నుండీ చూస్తే, …..

కనుచూపుమేరంతా తెల్లటి మంచు పర్వతాలు. అయినా ఆశను ఆవిరి కానివ్వలేదు. తొమ్మిది రోజుల తర్వాతి సాయంత్రం నదికి అవతలి ఒడ్డున అస్పష్టమైన ఆకారం, ఓ గుర్రం పైన ఓ వ్యక్తి ఉన్నట్టుగా. నిజమేనా, భ్రమనా? నది ఒడ్డున పరిగెడుతూ, గట్టిగా కేకలు పెట్టారు. అవును, ఒకరు కాదు ముగ్గురు ఉన్నన్రు అవతలి ఒడ్డుపై. తమ పరిస్థితిని వివరించే ప్రయత్నం చేసారు.

అవతలి ఒడ్డుపైనుండి జవాబు వచ్చింది. ఒకే ఒక ముక్క “టుమారో”

మర్నాడు ఉదయం, మరోసారి తమ పరిస్థితిని అవతలి ఒడ్డుకు చేరవేసిన కొన్ని గంటల తర్వాత హెలికాప్టర్లతో పాటు సహయక బృందం కనిపించారు. ఒక జీవన సమరం గెలిచింది, 72 రోజుల నిరంతర పోరాటం తర్వాత.

===================================================

వికీలో ఇక్కడ కనిపించిన యథార్థ గాథని మీకు తెలుగులో అందించడానికి చేసిన ప్రయత్నం ఇది. నేను తెలుగులో సరిగ్గా చెప్పలేక పోయానేమో, కాని నేర్చుకో గలిగితే ఈ సంఘటన చాలా స్ఫూర్తిని ఇస్తుంది. మీకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా, జీవన పోరాట పటిమను ఏ కారణంతో నైనా కోల్పోతే, ఈ సంఘటన వాళ్ళకు చెప్పండి. మరో ఆశను వెలిగించండి.

ఈ టపాపై నాకు ఎటువంటి  హక్కులూ లేవు. మీరు దీన్ని మూలం చెడకుండా యదేచ్చగ ఉపయోగించుకోవచ్చు. అలా ఉపయోగించినప్పుడు నా బ్లాగుకు లింకును ఏర్పరిస్తే ఆనందిస్తాను.     

ప్రసాదం.

ప్రకటనలు

%d bloggers like this: