నట్టడవులు నడివీధికి నడిచొస్తే ఇంతే!

డిసెంబర్ 13, 2008దాదాపు నాలుగున్నర ఏళ్ళ క్రితంఆంధ్రప్రదేశ్ లోని ఒక ప్రఖ్యాత విశ్వవిద్యాలయం లో కాంపస్ సెలక్షన్లు జరుగుతున్నాయి. ఒక ప్రతిష్టాత్మక కంపనీ తరపున వచ్చిన ఎంపిక బృందంలో నేను సభ్యున్ని. యూనివర్సిటీ పరీక్షల్లో అరవై శాతం దాటిన వాళ్ళకు టెక్నికల్ ఇంటర్వ్యూ. పేరుకు టెక్నికల్ ఇంటర్వ్యూ అయినా మా పరిశీలన అంతా అభ్యర్థుల కమ్యునికేషన్ స్కిల్స్, లాజికల్ ఎబిలిటీ లాంటి ఆంశాల పైనే.ఇంటర్యూ చేయాల్సిన వాళ్ళందరిని పంచుకుంటె నాకొచ్చిన వాటా దాదాపు 20 మంది. నాతో సహ ఎంపిక బృందం సభ్యులందరికి తలా ఒక గది ఇచ్చి ఒకొక్క అభ్యర్థినీ వరసగా పంపడం మొదలెట్టారు.ఇంటర్వ్యూ తగలేసిన ఎనిమిదోవాడినో తొమ్మిదోవాడినో తన్ని పంపించేసి ఒళ్ళు విరుచుకుంటుంటే తలుపు తడుతూ “మే ఐ కమిన్ సర్” అన్న మధుర స్వరం. ఎవరో చూడ చక్కని అమ్మాయి. రమ్మని చెప్పగానే నెమ్మదిగా తలుపు మూసి వచ్చి నా ముందు నిలబడింది. చక్కని పంజాబీ డ్రెస్ తో నిండైన వస్త్రధారణ-ఇంటర్వ్యూ కోసం అని కాకుండా మామూలుగా కూడా ఒద్దికగా సాంప్రదాయబద్దంగా ఉండే అమ్మాయిలా అనిపించింది. కానీ మొహంలో మాత్రం టెన్షన్. అది మామూలే కదా. ఆమెను కూర్చొమని చెబుతూ బయోడేటా కోసం చేయి చాచాను. ఆమె అందించిన బయోడేటా ప్రాజెక్టు రిపోర్టూ చూస్తూ తన గురించి చెప్పమన్నాను.మధ్య తరగతి కుటుంబం-తల్లీదండ్రులిద్దరూ వుద్యోగులు-చాలా కష్టపడి చదివించారు-చిన్నప్పటి నుండీ మార్కులు ఎనభై శాతం పైనే వున్నాయి.(నాకు కూడా అన్ని మార్కులు రాలేదు)స్నేహ పూర్వక వాతావరణంలో అభ్యర్థుల పరిజ్ఞనాన్ని అంచనా వేయడమే కానీ వాళ్ళను ప్రశ్నలతో భయపెట్టడం మా లక్ష్యం కాదు కనుక ఏం సినిమాలు చూసావు,ఏ పత్రికలు చదువుతావు లాంటి ప్రశ్నలు కూడా వేస్తాము. అన్ని ప్రశ్నలకూ ఆ అమ్మాయి తలవంచుకొని నేల చూపులు చూస్తూ సమాధానం చెబుతోంది.ఏతా వాతా తేలిందేమంటే ఆ అమ్మయికి పుస్తకాలు పరీక్షలు,మార్కులు తప్ప మరో ప్రపంచం తెలీదు.
8వ తరగతి నుంది ఇంటర్ అయ్యే వరకూ తనని వాళ్ళ అమ్మా నాన్నలు అకడమిక్ పుస్తకాలు తప్ప మరో పుస్తకం ముట్టుకోనివ్వలేదు. ఒక్క సినిమా కూడ చూడనివ్వలేదు. ఇంజనీరింగ్ లో మాత్రం కొన్ని సినిమాలు చూసిందట .


ఇక టెక్నికల్ చూసినా అంత పెద్దగా ఆకట్టుకోలేదు. పుస్తకాలలో వున్నది వున్నట్టు చెప్పగలుగుతోంది గానీ ఏ కాస్త ప్రశ్న మార్చినా
, జవాబుండదు.  ఇంటర్వ్యూ తగలేసిందని తనకీ కూడ అర్థం అయిపోతోంది.నేను ఇంటర్వ్యూ ముగించబోతూ “మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ” అని అడిగాను తన ప్రాజెక్ట్ రిపోర్టు తిరిగిచ్చేస్తూ.యస్ సర్” అంటూ కొద్దిగా తల పైకెత్తింది.


తన చేతులు వణుకుతున్నాయ్. అప్పుడే చేతులు కట్టుకొని – మళ్లీ వదిలేసి – చున్నీ లాగి ఒళ్ళో పెట్టుకొని -మళ్ళీ చేతులు కట్టుకొని – అరుణ మందారాలయిన కళ్ళను దాచుకోలేక – కాదు కాదు అంటున్న సాంప్రదాయపు విలువలను మునిపంటితో నొక్కిపెట్టె ప్రయత్నం చేస్తూ – ఒక నిశ్చయానికి వచ్చినట్టుగా – తన ఎద భాగం నాకు కనిపించేలా మరి కాస్త ముందుకు వంగి “నన్ను సెలక్ట్ చేయండి సార్. ఎక్కడికంటే అక్కడికి వస్తాను. మీరెలా అంటే అలా…నన్ను సెలక్ట్ చేయండి సార్..” అంది.
 


ఇంటర్వ్యూలలో తిరస్కరించబడిన వాళ్ళలో కొందరు కన్నీళ్ళు పెట్టుకోవడం
, ఏడ్చెయ్యడం మామూలే,అయినా ఈ పరిస్థితి నేను ఊహించనిది. “ముందు సరిగా కూర్చొండి. మంచినీళ్ళు తాగుతారా ” అంటూనీళ్ళగ్లాసు అందించాను.


తను మంచినీళ్ళు తాగి కొంచం స్థిమిత పడ్డాక మాట్లాడటం మొదలెట్టింది. “మా ఫ్రెండ్సందరూ సెలక్ట్ అయ్యారు – ఇంతవరకూ జరిగిన అన్ని కాంపస్ ఇంటర్వ్యూలలో రిజెక్ట్ అయ్యాను సర్ – ఇప్పుడు కూడ రిజెక్ట్ అయితే
మా ఇంట్లో నాకు వాల్యూ వుండదు


తన సమస్య నాకు అర్థమైంది.
 Identity Crisis. (గుర్తింపు కోసం తపన).[ గుర్తింపు కోసం తపన: ప్రతీ మనిషికీ వుండేదే.ఉండాల్సిందే కూడా. కానీ దేని వల్ల గుర్తింపు అనేదే సమస్య. ఆస్కార్ అవార్డ్ ద్వారా వచ్చే గుర్తింపు కోసం అమీర్‌ఖాన్ తపన పడతాడు. ఆడపిల్ల పక్కనుంటే వచ్చే గుర్తింపు కోసం ఇంకొకరు తపన పడతారు]


అన్ని సంవత్సరాల జీవితంలో ఆ అమ్మాయి తన తల్లిదండ్రులనుండి అర్థం చేసుకున్నదేమిటంటే “తమ ఇంట్లొ ఒక వ్యక్తిగా తనకన్నా
, తన వుద్యోగానికికే విలువెక్కువ ” అని. ఎంత దౌర్బాగ్యపు అవగాహన అది.


అహోరాత్రాలు శ్రమించి పైస పైసా కూడబెట్టి ఖరీదైన కాన్వెంట్ చదువులు చెప్పించి బంగారం లాంటి కూతుర్ని పుస్తకాలు బట్టీయం వేసి మార్కులు సంపాదించేలా మలిచి [చూసారా ఈ పనులన్నింటి వల్ల సమాజంలో సదరు కుటుంబానికి గొప్ప పేరొస్తుంది.  పిల్లల కోసం కష్టపడుతున్నారు అని పేరెంట్స్ కీ, చదివి మంచి మార్కులు తెచ్చుకుంటారు అని పిల్లలకు] ఉద్యోగం కోసం విలువల్ని అమ్ముకునేంత సంస్కారాన్ని ఇచ్చిన [ఈ సంగతి మాత్రం ఎవరికీ తెలీదు] ఆ తల్లి దండ్రులపై నాకు ఆసిడ్ పోయాలనిపించింది.

  

ఇది సమస్యకు ఒక పార్శ్వం. రెండో వంక మరీ విచిత్రం. కవసాకీ బైకిచ్చి, ఖర్చులకూ కొంతిచ్చి, కురాళ్ళను కాలేజీకి తోలేసి బాధ్యతయుతమైన తల్లిదండ్రులం మేముఅని జబ్బలు చరుచుకునే జాతి ఇంకొకటి వుంది. కుర్రాళ్ళకు (పిల్లలందరికీ కూడా) కావలసింది సరైన గుర్తింపు. తల్లిదండ్రులు గుర్తించలేదు కనుక ఆ గుర్తింపుని కవసాకి బైకులోనూ, కాలేజీ కాంటీన్లోను, క్యాషు కట్టల్లోనూ, ఆడపిల్ల బుగ్గ సొట్టల్లోనూ వెతుక్కు నే కుర్రాళ్ళు బోలెడు మంది.


మన పిల్లలకు కావలసింది మన గుర్తింపు. ఏ పరిస్థితిలో నైనా సరే ఇంట్లో
షరతులు లేని ప్రేమాదరణలు లభిస్తాయన్న నమ్మకం. డబ్బు కన్నా విలువైంది ఇంట్లొని మనుషులు అన్న అవగాహన.ఈ నమ్మకాన్ని తల్లిదండ్రులుగా మనం ఇవ్వగలిగితే, మన పిల్లలు, అబ్బాయిలు ఇచ్చే గిప్టుల కోసం వెంపర్లాడరు. అంగీకరించని అమ్మాయిల నెత్తిన ఆసిడ్ పోయరు.


వరంగల్ సంఘటనను నేను ఏ విధంగాను సమర్థించడం లేదు
, అలాగని విమర్శించడమూ లేదు. కాని జరిగిన సంఘటనలో పిల్లల తల్లిదండ్రుల పాత్రని మాత్రం మనం చాలా కన్వీనియంట్గా గుర్తించడం లేదుఅనేదే నా పాయింటు.దాడి చేసి ఆనక ప్రజా అగ్రహానికి గురై ఎంకౌటర్లో ప్రాణాలు పోగొట్టుకున ఆ అబ్బాయి దాడి సరిగ్గా జరగాలని అంతకు ముందు 17 సార్లు ప్రయోగం చేసాడని [which means he is a perfectionist] చదివి మనమంతా ఎంత దుర్మార్గుడు అనుకున్నామే గానీ , అతనిperfectionism సరైన పద్దతిలో గుర్తించబడి ప్రోత్సహించబడి వుంటే, ఈ కథ మరోలా వుండేదిఅని ఎవరూ అనుకోలేదే?   కని పెంచిన తల్లిదండ్రులు కాకపోతే పిల్లల శక్తులను, అభిరుచులను ఇంకెవరు గుర్తిస్తారు. [గాయపడిన ఒకఅమ్మాయి మాటలు జగ్రత్తగా వినండి. ఆమె తల్లిదండ్రులు ఇచ్చిన విలువలు ఎలాంటివో మీకు తెలుస్తోందా?]

 

మన పిల్లల కోసం సమయం కేటాయిద్దాం. వాళ్ళ శక్తి యుక్తులకు మనం గుర్తింపునిద్దాం. వాళ్ళ కన్నా విలువైందేమీ లేదని నమ్మకమిద్దాం. వాళ్ళ జీవితాలకు జీవాన్ని ఇద్దాం.

 


లేదా

 


నట్టడవులు నడివీధికి నడిచొస్తే 
ఇంతే
!

ప్రకటనలు

%d bloggers like this: