ముత్యమంత ముద్దు

    …. 

ఏ జ్ఞాపకమో మది తలపులను తట్టినప్పుడు ఆ కళ్ళ లోని ఊసులన్నీ కలంలోకి ప్రవహిస్తాయి. కవిత్వాలు అవుతాయి. ఆలాటి ఓ కవితే ఇది.
 

నుదుటి పైన ముద్దు
నూరేళ్ళకూ మరవద్దు

కనుల పైనా ముద్దు
కదలికలు రద్దు

ముక్కు కొసన ముద్దు
మురిపాల తొలి హద్దు

బుగ్గ మీద ముద్దు
బతుకంతా దిద్దు

చెక్కిళ్ళపై ముద్దు
చేజారనీయ వద్దు

పెదవి పైన ముద్దు
పదిలమైన దుద్దు

పెదవి కింద ముద్దు
పదాలేవీ వద్దు

పెదవి దాటిన ముద్దు
హద్దులని రద్దు

మెడ మీద ముద్దు
మరి ముందుకు వద్దు

మెడ కింద ముద్దు
మనసు మరవవద్దు

వలపు పైన ముద్దు
వలదు అన వద్దు

మరీ కింద ముద్దు
మాటలెందుకు లెద్దు

దిగువ మరో ముద్దు
దివి కూడ వద్దు

ముదిత మదిన ముద్దు
మనసు మారనీయొద్దు
మగువ అద్దిన ముద్దు
మనసు మరచిపోవద్దు

5 Responses to ముత్యమంత ముద్దు

  1. charasala అంటున్నారు:

    ఈ ముద్దుల పద్దు ముద్దుగా వుంది.
    –ప్రసాద్
    http://blog.charasala.com

    మెచ్చుకోండి

  2. radhika అంటున్నారు:

    “aa jnaapakamoa madi talupulu tattinappudu” antuu modalu pettina vaakyaalu chaalaa adbhutam gaa vunnayamdi..kavita chalaa chaalaa baagumdi

    మెచ్చుకోండి

  3. రానారె అంటున్నారు:

    super

    మెచ్చుకోండి

  4. Manasa అంటున్నారు:

    ‘Muthyam antha Muddu’ chala bagundi,
    simply superb,
    kaani artham avataniki time paduthundemo, nenu kavithvam lo poor..

    మెచ్చుకోండి

  5. kiran అంటున్నారు:

    guru gaaru,

    small doubt, meeku intha bhaavukatvam eppatninchi undi??? the reason is many of my unlucky married friends say that once you tie the knot, its your(male’s) neck thats on the line. so wonder how its possible to write such good… no.. great stuff …..

    మెచ్చుకోండి

మీరేమంటారు ...