ఏ TVగ మము దయ జూచెదవో… (తుది భాగం)

మొదటి భాగం ఇక్కడ చదవండి. 

ఎత్తు పైఎత్తు తో అత్త కోడలి పాట్లు
టూ టౌను త్రీ టౌను నరుడి అగచాట్లు
కళ్ళెదుట మిరుమిట్లు పెళ్ళాల సిగపట్లు
కుళ్ళు కథలతో తల తూట్లు తూట్లు

పనులు మానిన జనులు గుడ్లప్పగించంగ
తెరచి ఉంచిన నోట తెగక కారును చొంగ
రంగు బొమ్మల గంగ అందరూ మునగంగ
ఇల్లు సర్దుకు పోవు దర్జాగ దొంగ

గడ్డి తినగలిగితే వాడే ఘనాపాఠి
సిగ్గునొగ్గేసేటి సాహసులె మేటి
చెయ్యగలిగితే ఫీటు వెయ్యి రూకల పోటీ
చానళ్ళు ఛాలెంజి ఒక దానికొకటి

అమ్మాయి పెళ్ళిని అనుక్షణము చూపించి 
ఆయన ఇంటి విషయాన్ని అందరికీ పంచి
అయ్య పరువును తీసి ఇంట ఆగ్గి రాజేసి
చెయ్యగలరా? “మెరుగైన సమాజం” చెత్త పోగేసి   

మీ పాట మా ఆట తీరునట తీట
సినిమాల చిందుకేనట ఇక  పెద్ద పీట
కళలంటే ఇవేగా మన తెలుగు నాట
కథ మలుపు తిరిగేను అథొగతి బాట

  
 

2 Responses to ఏ TVగ మము దయ జూచెదవో… (తుది భాగం)

  1. రావారె అంటున్నారు:

    సూపర్!! అప్పుడెప్పుడో ‘ఉదయం’ దినపత్రికలో అనుకుంటాను గజ్జెల మల్లారెడ్డి “అక్షింతలు” వేసేవారు. బగ్గిడి గోపాల్ అనే ఒఖ ఎమ్మెల్యేని తెగడుతూ ఆయన వేసిన అక్షింతల్లో “… మానాభిమానాలు మనకెందుకంటాడు … భ్రష్టుపట్టినవాళ్ల లిస్టులో ఇతనొకడు …” అని. నేటి మీడియా దాదాపుగా భ్రస్టుపట్టినా, అందులో టీవీ-9 మాత్రం పూర్తిగా పర్వర్టెడ్. సిగ్గునొగ్గేసేటి వారిది సాహసం అనడం నాకు బాగా నచ్చింది.

    మెచ్చుకోండి

  2. VENKI అంటున్నారు:

    SUPAR

    మెచ్చుకోండి

మీరేమంటారు ...